*సమత్వం యోగ ఉచ్యతే : సమత్వ బుద్ధియే యోగము*
అన్ని పరిస్థితులనీ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీ కృష్ణుడు దానిని 'యోగం' అంటాడు అంటే పరమాత్మతో ఐక్యత.
నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపటం సహజం. ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు. ఒకవేళ అలలు పైకిరావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్లే. అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి.
అదే విధంగా, సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు, మన నియంత్రణలో లేని, ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు. మనము ప్రతికూల పరిస్థితులని నివారించటానికి నిరంతరం పోరాడుతూ ఉంటే, మనం అసంతృప్తి/దుఃఖాన్ని తొలగించుకోలేము. కానీ, మన శక్తిమేర ప్రయత్నం ఆపకుండా, దారిలో వచ్చే ప్రతి దాన్నీ స్వీకరించటం నేర్చుకుంటే, మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే, అదే నిజమైన యోగము.
http://youtube.com/post/Ugkxlw71z9wYwp88F6rkJ_UFbau3VPWZ48sc?si=0G7TzsNONb3UwQci
No comments:
Post a Comment