Monday, July 27, 2026

ఎవరినైనా గుడ్డిగా నమ్మొద్దు!""ఈ ఒక్క తప్పు జీవితం నాశనం చేస్తుంది!""నమ్మకం పెట్టే ముందు ఇది చూడండి!"

ఎవరినైనా గుడ్డిగా నమ్మొద్దు!""ఈ ఒక్క తప్పు జీవితం నాశనం చేస్తుంది!""నమ్మకం పెట్టే ముందు ఇది చూడండి!"

Author Name:Lechi Nilabadu

Youtube Channel Url:https://www.youtube.com/@LechiNilabadu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mxg3rqlB0F4



Transcript:
(00:00) అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ లేచి నిలబడు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని సూట్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. మీ జీవితంలో బాగా ఎక్కువై ఏడ్చింది ఎప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడా లేదంటే మీ దగ్గర ఉన్న డబ్బు పోయినప్పుడా లేకపోతే ఉద్యోగం కోసం వెతిగేటప్పుడా లేదంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోయినప్పుడా ఇవేమీ కాదు.
(00:28) మీరు ఎక్కువగా ఎప్పుడు ఏడ్చుకుంటారో నేను చెప్పనా మీరు ఎవరినైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే మీ ఇష్టాలన్నీ షేర్ చేసుకొని ఇంకా తను లేకపోతే మీ జీవితం లేదు అనేసి ఫీల్ అవుతారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు మాత్రమే మీరు ఎక్కువగా బాధపడతారు. ఆ గాయం బయటికి కనిపించదు కానీ లోపల ప్రతిరోజు మెల్లగా మెల్లగా మెల్లగా మనల్ని చంపేస్తూ ఉంటుంది.
(00:51) తను ఇలా మోసం చేశడు అనేసి ఎవరికీ కూడా చెప్పలేము ఆ టైంలో అయితే మనకి చాలా ఎక్కువ బాధగా ఉంటుంది. మనలో చాలా మంది అంటారు మొత్తం అందరినీ నమ్మాలి ఎవ్వరిని కూడా అనుమానించకూడదు ప్రతి ఒక్కరిని నమ్మాలి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం నమ్మకంతో నమ్మకం మీదే కదా నడుస్తుంది అనేసి అంటారు. ఇంకా కొంచెం మంది ఉంటారు వాళ్ళు ఏమంటారు లేదు లేదు ఎవ్వరిని నమ్మకూడదు అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మోసం చేసేవాళ్లే కాబట్టి ఒక్కరిని కూడా నమ్మొద్దు ఎవ్వరిని నమ్మి మోసపోవద్దు అనేసితే కొంచెం మంది చెప్తారు.
(01:21) ఒక రకంగా ఆలోచించాలంటే ఇద్దరు చెప్పేది రాంగే ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు. ఇద్దరిలోనూ తప్పులేదు కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మంచివారా లేదంటే చెడ్డవారా అన్న నిజం తెలుసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మే నీలోనే ఉంది. అసలు నమ్మకం అంత విలువైనది ఎందుకో తెలుసా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక ఇంటిని కడుతున్నాం అనుకోండి దాన్ని కట్టడానికి అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
(01:46) అదే ఇంటిని కూల్చేయాలంటే కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు ఒక చెట్టు ఉంది దాన్ని మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయడానికి కదా కొన్ని సంవత్సరాలు పడేస్తుంది. కానీ అదే చెట్టుని నరికితే వితిన్ సెకండ్స్ లో చెట్టు అయితే నరికేగలం. సేమ్ నమ్మకం విషయంలో కూడా అంతే మనం ఎంతో కష్టపడి ఒక వ్యక్తి నమ్మకాన్ని సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడేస్తుంది కానీ అదే నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే సెకండ్స్ లో పోతుంది ఒక వ్యక్తి చేసే నమ్మక ద్రోహం మోసం కుట్ర ఇవన్నీ అంటే చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళ మీద ఉన్న నమ్మకం అయితే పోతుంది ఇప్పుడు
(02:25) ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఒక పేపర్ లాంటిది అన్నమాట దాన్ని ఎప్పుడైతే మనం ఫోల్డ్ చేస్తామో ఇంకొకసారి శుభ్రం నలిపేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది మళ్ళీ ముడతలు ముడతలుగానే కనిపిస్తుంది తప్పితే ముందున్న పేపర్ లాగా అయితే కనిపించదు నమ్మకం కూడా అంతే ఒక్కసారి నువ్వు దాన్ని నలిపి పడేసిన తర్వాత ఇంక నీకు మళ్ళీ నమ్మకం ముందు పేపర్లా ఫ్రెష్ గా కనిపించమంటే నీకు అసలు కనిపించదు అందరినీ గుడ్డిగా నమ్మేసి తర్వాత నేను మోసపోయాను అనేసి అయితే మనం ఏడుస్తుంటాం కానీ ఆ పరిస్థితి నిజంగా తీసుకొచ్చింది ఎవరు ఇంకెవరు మనమే ఎందుకంటే ఒక వ్యక్తి
(02:58) మనతోటి రెండు మూడు మాటలు బాగా మాట్లాడాడు అంటే ఇంకా తను చాలా మంచోడు అనుకునే అయితే మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతాం ఎప్పుడు కూడా ఎవరనా నిన్ను నవ్వుతూ పలకరించిన వాళ్ళు నీ వాళ్ళు అనేసి నువ్వు గుడ్డిగా నమ్మేవద్దు ఎందుకంటే ప్రతి నవ్వు వెనకాల కూడా వాళ్ళ మనసులో ఎంతో కొంత విషం ఉంటుంది అలాగని అందరిలోనూ కాదు కానీ నువ్వైతే గుర్తించాలి ఎవరు నీతో నిజంగా ప్రేమగా ఉంటున్నారు ఎవరు నీతో ప్రయోజనం కోసం ఉంటున్నారు అనేసి ఆ విషయం నువ్వు గ్రహించినప్పుడు మాత్రమే నువ్వైతే ధైర్యంగా ఎదుర్కోగలవు ఎలాంటి సమస్య వచ్చినాను ఇప్పుడు ఎవరో నీతో అందంగా నవ్వి
(03:31) మాట్లాడి ఎలా ఉన్నావ్ తిన్నావా ఉన్నావా అనేసి రెండు మాటలు మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళని మీద ప్రేమ చూపించేస్తున్నారు అని అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎవ్వరిని గుడ్డిగా నమ్మి ఎవరో బాగా మాట్లాడుతున్నారు అనేసి లేదా నీ కష్టాలన్నీ ఇప్పుడు నువ్వు నీ బాధలు ఏమన్నా ఉన్నాయి అనుకో వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు స్టోరీ విన్నట్టు వింటుంటారు అప్పుడు ఏంటంటే నువ్వు ఏమనిపిస్తుంది నీ చెప్పే మాటలన్నీ వింటున్నారు కాబట్టి వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఏమో అనుకుంటావ్ కానీ ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఏంటంటే నీ యొక్క బాధను తెలుసుకొని నువ్వు తర్వాత నీ ఫీలింగ్స్ తో నిన్ను
(04:02) ఇబ్బంది పెట్టడానికి చూస్తుంటారు కాబట్టి ఎవ్వరితో కూడా నీ పర్సనల్స్ అనేవి ఏమి షేర్ చేసుకోకుండా గుడ్డుగా నమ్మేకు ఎవరిని కూడా ఎవరితో కూడా నీ పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకు అదేవిధంగా ఎవరైనా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనేసి చెప్తున్నారంటే వాళ్ళ వాళ్ళు ఆ మాటని ఒక్కరిదానికి చెప్పండరు అలాగే వాళ్ళు ఏంటంటే ఫోన్లో నీలాంటి నీలాంటి అమ్మాయిలక బోల్డ్ అంత మందికి చెప్పుకుంటాడు.
(04:27) కాబట్టి వాడు ఎవడో నీకు ఇలా ఫోన్లో మెసేజ్లో నువ్వంటే నాకు ఇష్టం లే ఎవరితో చచ్చిపోతాను అనేసి చెప్పినంత మాత్రాన వాడు నిజంగా నువ్వంటే ఇష్టమో అనేసి నువ్వు నమ్మేసి వాడిని గుడ్గా నమ్మి నీ యొక్క పర్సనల్స్ గాని ఏమి వాడితో అయితే షేర్ చేసుకోకు ఎందుకంటే ప్రతి మాట కూడా అందంగా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా మంచివాళ్ళు కాదు కాబట్టి ఒకసారి నువ్వు ఎవ్వరిని గుడ్డిగా నమ్మేకండా ఒకసారి ఎవరు ఏంటి నీతో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ తను నిజంగా నీకు నువ్వు నువ్వు హ్యాపీనెస్ కోసమే మాట్లాడుతున్నాడా లేకపోతే నీ నుంచి తనకి ఏమన్నా హెల్ప్ అవుతుందా అనేసి కూడా నువ్వు గ్రహించాలి.
(05:02) ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో నీ లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీకు జీవితంలో ఏదో ఒక పాఠం అయితే కచ్చితంగా నేర్పిస్తారు. అయితే ఆ వ్యక్తి ద్వారా నీ జీవితం చాలా అందంగా తయారవుతుంది లేదంటే ఆ వ్యక్తి నుంచే నువ్వు గుణపాఠం అయితే నేర్చుకుంటావ్. కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళని గుడ్డిగా నమ్మేయకుండా వాళ్ళు నిజంగా నీ జీవితంలోకి రావడానికి అసలు కారణం ఏంటి అన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి.
(05:25) ఇప్పుడు సపోజ ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకఫేస్బ లోఇగ లో ఏదైనా నువ్వు ఒక పోస్ట్ పెట్టావ అనుకో నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్ కి లైక్ చేసి కామెంట్ చేసి సూపర్ వావ్ అనేసి నీకు ప్రతిదానికి లైక్ చేసి లైక్ చేసినంత మాత్రం నువ్వంటే తనకు ఇష్టం ఉన్నట్టు కాదు అలాగే మార్నింగ్ లేచి నీకు ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా ఏం తిన్నావా అనేసి నీతో సొల్లు కబుర్లు చెప్పి వాడికి కూడా నువ్వంటే ప్రేమ ఉన్నట్టు కాదు ఎప్పుడూ కూడా మన యొక్క విలువ ఎలా పెరుగుతుందంటే ఎవరైనా మనతో రెండు మూడు మాటలు మాట్లాడేసి నిన్ను అమ్మాయి మైక్రాలని చేసేసి వాళ్ళు చెప్పే మాటలు గుడ్డిగా ఎప్పుడు కూడా
(05:57) నమ్మకూడదు ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ కూడా మాటల ద్వారా చేసి చేయడం వల్ల మనకి మంచి వ్యక్తి అనేది తెలియదు. మాటల ద్వారా ఎప్పుడు కూడా తను మంచివాడు అనేసి మనం చెప్పకూడదు ఎప్పుడు కూడా తను నిజంగా మంచివాడు అని తెలియాలంటే తన యొక్క చేతను చూడాలి. తను చేసే పనుల్లోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కి లైక్ చేసాడు అలాగనేసి వాడు నా కోసం అంత చేస్తున్నాడు అంటే నేను అంటే వాడికి పిచ్చేమో అనేసి నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదు.
(06:22) ఎందుకంటే అది జస్ట్ మొబైల్ లోన చేశడు అంతే అలా కాకుండా నువ్వు ఏదైనా ఆపదలో ఉంటే నీకోసం ఎంత దూరమైనా సరే వచ్చి నీకు నిజంగా సహాయపడేవాడే నీవు అంటే గౌరవం ఉన్నవాడు కాబట్టి ఫోన్లోనూ మెసేజ్ల ద్వారా నీతో గంటలు గంటలు చాట్ చేసేవాళ్ళని లేదంటే నీతో ఫోన్ మాట్లాడేవాడిని లేకపోతే నువ్వు పెట్టిన ప్రతి లైక్ కి ప్రతి పోస్ట్ కి లైక్ చేసేవాడిని గుడ్డిగా నమ్మేయకండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అనేసి కూడా మాట్లాడుతుంటారు.
(06:52) ఆ మాటలకి ఎలా ఉంటుందంటే తను నిజంగా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో లేని లేకపోతే తను నిజంగా అలా అయిపోతాడో అనేసి నువ్వైతే ఎక్కువ ఫీల్ అయిపోయి వాళ్ళకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంటావ్ ఆ టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తుంటావ్ అంటే ఇప్పుడు నీకు ఎవరైనా ఒక వ్యక్తి బాగా ఇష్టం అనుకో ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసినా కానీ నువ్వు గ్రహించలేవు ఎందుకంటే తనంటే నీకు ఇష్టం కాబట్టి తను చేసిన తప్పును కూడా నువ్వు ఆ ఏదో తెలియక చేసి ఉంటాడులే అనేసి నువ్వు లైట్ గా తీసుకుంటావ్ అదే నీకు ఎవరైనా ఒక వ్యక్తి అస్సలు నచ్చలేదు అనుకో తను మంచి చేసినా కానీ నీకు చెడుగానే
(07:23) కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు చేసి అన్ని అన్ని పనులు తప్పిపోయి వేరు చేసి అన్ని రైటే అనేసి ఎవరిని గుడ్గా నమ్మకు ఒక్కసారి వాళ్ళ ఎవ్వరికీ కూడా నీ లైఫ్ లో ఎక్కువ ఎక్స్ట్రా ప్లేస్ ఇచ్చేసి అన్ని వాళ్లే సర్వస్వం అనేసి ఒక వ్యక్తికి ఎవరికీ కూడా నువ్వు ఎక్కువ విలువ అన్నది ఇవ్వకు ఎందుకంటే నువ్వు అలా ఎవ్వరికైతే ఎక్కువ విలువ ఇస్తావో ఆ వ్యక్తితే ఏదో ఒక రోజు నిన్నే ఖచ్చితంగా మోసం చేస్తాడు.
(07:46) అసలు మీరు చేసే మిస్టేక్ ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏంటంటే ఒక రైతు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి ఒక చిన్న పాము చలిలో వనుకపోతే కనిపించింది అన్నమాట అయితే వెంటనే పాపం రైతు అయ్యో పాము చలికి వణకిపోతుందే అనేసి దాన్నయతే నెమ్మదిగా తీసుకొని ఆ పాముకి దుప్పటి కప్పి దాన్ని వెచ్చగా ఉంచి ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి దాన్ని పెంచి పెద్ద చేశడు.
(08:11) అయితే ఎప్పుడైతే ఆ పాము బలంగా మారిందో ఆటోమేటిక్ గా కొన్ని రోజులకి రైతునే కాటేసింది. అప్పుడు రైతు ఇలా అడిగాడు అరేయ్ నేను నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు అంత ఇబ్బందిలో ఉంటే నేను నిన్ను తెచ్చుకొని పెంచి ఇంత పెద్ద చేశాను కదా నువ్వు నన్ను ఎందుకు కాటేసావు అనేసి అడిగాడు. అప్పుడు వెంటనే ఈ పాము ఇలా అంది. అవును నువ్వు మనుషువు కాబట్టి నీలో నిజంగా మానవత్వం ఉంది కాబట్టి నువ్వు నన్ను తీసుకొచ్చి పెంచావు అది నీ స్వభావం కానీ నా స్వభావం ఏంటి నువ్వు నన్ను ఎంత పెంచి పెద్ద చేసినా కానీ నా స్వభావం కాటు వేయడం మాత్రమే కాబట్టి నేను అలా చేశాను అన్నది నిజానికి
(08:42) ఇందులో తప్పు ఎవరిది ఒకసారి ఆలోచించండి కాటు వేయడం అనేది పాము లక్షణం. సహాయం చేయడం అనేది మనిషి లక్షణం. పాము కాటు వేస్తుందని తెలిసినా సరే తనకి సహాయం చేశాడు. అంటే అక్కడ తప్పు ఎవరిది రైతుదే కదా అలాగే ఎప్పుడు కూడా మనం ఎలాంటి వ్యక్తిని నమ్ముతున్నాం ఎలాంటి వాళ్ళకి మనం పాలు పోసి పెంచుతున్నాం ఎవరి మీద నమ్మకం పెంచుకుంటున్నాం అనేది కూడా ఒకసారి గ్రహించాలి.
(09:05) ఎప్పుడైనా గమనించారో లేదో అందరితో మంచిగా ఉండే వ్యక్తి మాత్రం ఎవరో ఒకరి చేతిలో మోసపోతాడు. ఎందుకంటే ఈ మంచిగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచనతో కొంచెం వివేకంతో ఆలోచించరు. ఎప్పుడు కూడా ఇప్పుడు తనకి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అనుకో వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారురా అనేసి ఎవరైనా చెప్పినా గానీ వాళ్ళు గ్రహించరు. ఆ వాడు నన్ను ఎందుకు అలా చేస్తాడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడికి నేను అంటే చాలా ఇష్టం అనేసి ఫీల్ అవుతుంటారు.
(09:29) వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వివేకంగా ఆలోచించకుండా హృదయంతో ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే మనసుతో ఆలోచిస్తారో వాడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు తను నన్ను ఎందుకు మోసం చేస్తుంది తనకి ఆ అవసరం ఏముంది నేను అంటే తనకి చాలా ఇష్టం అనేసి వాళ్ళు మనసును నమ్ముతారు. అంతేగాని ఆలోచన నమ్మరు. అదే అక్కడ చేసే పెద్ద మిస్టేక్ ఇప్పుడు కూడా మనల్ని మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే కదా మనల్ని మోసం చేసేది ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అమాయకులనే ఎంచుకుంటారు ఎందుకంటే నువ్వు చాలా అమాయకంగా ఉండి అందరికీ మంచిగా ఉండి
(10:04) అందరితో బాగా మాట్లాడుతున్నావ అనుకో వాళ్ళకి కావల్సింది ఏంటి ఎవరినైతే తనకు ఇప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి అమాయకంగా ఉండేవాళ్ళే ఫస్ట్ టార్గెట్ కాబట్టి నువ్వు ఇప్పుడు అమాయకంగా ఉన్నావ అనుకో నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ అరే నువ్వు నిజంగా చాలా మంచివాడవ అంటావ్ నీకోసం అందరూ ఇలా చెప్పుకుంటున్నారు ఇంక నిన్ను నువ్వు కాబట్టి నీ గొప్పతనం విని నేనైతే నీకు ఫ్యాన్ అయిపోయాను కాబట్టి ఇప్పటినుంచి ఇంక నువ్వు లేకపోతే నేను లేను మనద్దరం దోస్తు అనుకుంటా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు.
(10:32) ఇలా తను ఎప్పుడైతే రెండు మూడు మాటలు చెప్పాడో వెంటనే నువ్వు చెట్టు ఎక్కేసి ఇంక నువ్వు నాకు అంతా సర్వస్వం తానే ఆ నా తను నేను లేకపోతే ఉన్నాడంట కాబట్టి నేను కూడా అంతా అనేసి నువ్వైతే నమ్మేస్తుంటావ్ కానీ నిజానికి ఏంటంటే ఎవరైతే నిన్ను ఫాస్ట్ గా మోసం చేయాలనుకుంటున్నారో వాళ్లే నిన్ను ఎక్కువగా బలంగా చాలా ఎక్కువ ఎక్కువగా నిన్ను పొగుడుతూ ఉంటారు.
(10:53) నువ్వు ఎప్పుడైతే ఆ పొగడతలకు పడిపోతావో వాళ్ళకి సింపుల్ గా దొరికేస్తావ్ ఇప్పుడు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మేయొద్దు ఆ నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటే తను నిజంగా నా కోసం అలా చేసుకుంటాడమ్మా అనేసి అయితే ఫీల్ అయిపోతుంటారు. కానీ నిజంగా ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఒక్క రోజులో నువ్వు పెద్దదానివి అయిపో అంటే పెద్ద అవ్వదు కదా ప్రతి దానికి కూడా కొంచెం టైం ఉంటుంది.
(11:14) అలాగే ప్రతి బంధం ఏర్పడడానికి కూడా కొంచెం టైం అనేది ఉంటుంది. రెండు రోజులు మాట్లాడాడని మూడు రోజులు మాట్లాడాడు అనేసి ఇంక అన్నీ నువ్వు తనక అన్నీ నువ్వే అనుకొని నువ్వు ఫీల్ అయిపోతే ఎలా ఇప్పుడు ఒక చిన్న విత్తనం మొఖ కింద రావడానికే దగ్గర దగ్గర ఒక నెల పడుతుంది అలాంటిది ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఇంకా తనకు ఏం మాట్లాడలేదు చేయలేదు ఇంకా నువ్వు పరిచయం అయి నెల కూడా అవ్వకుండానే నీ దగ్గర నుంచి నిన్ను మోసం చేయడానికే చూస్తారు కానీ ఏ బంధం కూడా అప్పటికప్పటికి నిన్నే నాకు కలిసాడు మేమ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా అవ్వదు ఎందుకంటే ఎప్పుడు కూడా నిన్ను టార్గెట్
(11:43) ఎలా చేస్తారంటే నువ్వు అమాయకంగా బాగా అమాయకంగా ంగా కనిపించా అనుకో నువ్వు నిన్ను మోసం చేయడానికి వీలు ఉంటది అనేసి నిన్ను ఎక్కువైితే పొగుడుతుంటారు ఇప్పుడు నువ్వు ఏం చేసినా అరేయ్ నువ్వు బాగా చేసావురా నువ్వు ఎవరనా ఏదైనా చేసి ఒరేయ్ నువ్వు చాలా బాగా తిట్టావురా వాడిని అరేయ్ వాడిని నువ్వు చాలా బాగా పుట్టావురా అనేసి కూడా పొగుడుతుంటారు ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ చిన్న పని చేసినా అతిగా పొగుడుతున్నారు అంటే వాళ్ళకి నీ నుంచి ఏదో అవసరం ఉంది అందుకే నువ్వు చేసిన ప్రతి తప్పును కూడా అవతలవాడు పొగుడుతున్నాడు.
(12:10) అదే ఇప్పుడు నువ్వు ఏదనా తప్పు చేసావ అంటే నీకు నిజమైన ఫ్రెండ్ అయితే వాడు అరేయ్ ఎందుకురా వాడిని అలా చేస్తున్నావ్ అది తప్పు కదా అనేసి నీకైతే ఏదో ఒక టైంలో అయితే నిన్ను మందలిస్తాడు అలా కాకుండా నువ్వు ఏం చేసినా కరెక్టేరా అన్నాడంటే వాడికి నీతో కచ్చితంగా ఏదో అవసరం ఉంది. ఎప్పుడు కూడా మనకి నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏ తప్పు చేసినా సరేరా నీ వెనకాల నేను ఉంటాను అనేవాడు ఎప్పుడ మన ఫ్రెండ్ కాదు నువ్వు ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు అరే అది చేయకరా దాని వల్ల తర్వాత ఇబ్బందుల్లో పడతావ అని చెప్పేవాడు నిజంగా మన ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఏం చేసినా నన్ను తప్పు అనే
(12:40) అంటాడు అనేసి నీ తప్పుని నీ వేలెత్తి చూపించేవాడిని అయితే నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే వాడే నీకు అసలైన ఫ్రెండ్ ఇప్పుడు ఇంకా చాలా మంది ఉంటారు ఎలా అంటే నువ్వు బాధపడుతున్నావ అంటే నీ దగ్గరికి వచ్చి ఏమైంది నీ బాధ ఏంటి నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అసలు నిన్ను ఎవరు బాధ పెట్టారు అనేసి అడుగుతుంటారు.
(13:00) వాళ్ళకి మొత్తం నీ కుటుంబ వివరాలు బ్యాంకులో ఎంత సేవింగ్ చేసి అవన్నీ కూడా చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు నీ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు నీ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. అదేవిధంగా నువ్వు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరో నీ దగ్గరికి వచ్చి అడిగేసారు అనేసి నువ్వైతే సమాధానం చెప్పేయకూడదు. అలాగే వేరే టైపు మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒరేయ్ నన్ను అందరూ మోసం చేశరురా అందరూ నన్ను వదిలేశరు ఈరోజు నా బతుకు ఇలా తయారవ్వడానికి కారణం వాడే అనేసి అందరిని తొక్కుపడుతుంటారు.
(13:26) అలా ప్రతి ఒక్కరిని తప్పుపట్టి అందరూ తప్పే నేనే కరెక్ట్ అన్న వాడితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ మాటల్లో సగానికి సగం నిజం ఉండకపోవచ్చు ఎందుకంటే నిన్ను అట్రాక్ట్ చేయడానికి వాడు ఏంటంటే ఇప్పుడు అరే నన్ను ఇంత డబ్బుతో మోసం చేసేసాడు రా నేను చాలా కుంగిపోయాను రా అనేసి నీ దగ్గరికి వచ్చి సానుభూతి కోసం ట్రై చేస్తుంటాడు.
(13:45) అప్పుడు ఏంటంటే నువ్వు అవునా నిన్ను ఎలా మోసం చేసాడో నన్ను కూడా ఫలానా వ్యక్తి అలా చేసాడు అనేసి నువ్వు ఎప్పుడైతే చెప్తావో నీ యొక్క రహస్యాలు తెలుసుకొని వాడైతే నీ మీద గెలవడానికి చూస్తుంటాడు ఎప్పుడు కూడా నీ రహస్యాన్ని ఎవ్వరికీ షేర్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఇతరులది తప్పు నేనే ఇలా బాధపడిపోయాను అందరి వల్ల నేనే సఫర్ అయ్యాను అని చెప్పే వ్యక్తితో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
(14:05) ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఒకరి చేతిలో మోసుకోవడానికి ఆటోమేటిక్ గా రెండోసారి మోసుకోవడానికి రెడీగా ఉండడం కానీ వాళ్ళు ఎలా మోసం చేశారు వీళ్ళు ఎలా మోసం చేశరు అంటే ఒక వ్యక్తిని అంతమంది అన్నిసార్లు మోసం చేయరు కాబట్టి ఒకసారి మోసపోయిన తర్వాతనే నిజంగా బుద్ధి వస్తుంది కానీ అలా ప్రతిసారి నేను ఇలా మోసపోతూనే ఉన్నాను అనేసి నీకు వెక్కించడానికి చూస్తున్నాడు అంటే ఆ మనిషి నీ నుంచి ఏదో రావడనికి ట్రై చేస్తున్నాడు అని అర్థం కాబట్టి ఒకసారి ఆలోచించు ఎప్పుడు కూడా నిన్ను ఎవరైనా ఎలా ఉన్నావు ఏంటి అనేసి నీకు తెలియని వ్యక్తి ఎవరైనా పదే పదే పదే
(14:37) పదే నీకోసం ఆలోచిస్తున్నాను నాకు నీ మీద ఆలోచన అనేసి చెప్తే వారిని నమ్మకూడదు ఎందుకంటే అతనికి నిన్నటి వరకు నువ్వు అంటే ఎవరో కూడా తెలియదు అతను జస్ట్ నీకు అప్పుడే పరిచయం అయ్యాడు అయినా కానీ వెంటనే నీ మీద అంత మమ్మగారం అతనికి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి తెలియని పరిచయాలని ఎక్కువగా నమ్మకండి అదేవిధంగా కొంచెం మంది ఉంటారు నువ్వు ఏదనా బాధపడుతున్నావ అంటే ఎవరు బాధ పెట్టారు ఏంటి అనేసి తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అరే నిన్ను మీ అమ్మ నాన్న అలా బాధ పెట్టారా వాళ్ళ వాళ్ళు అస్సలు మంచోరు కాదు అప్పుడు వాళ్ళు అలా చేశారంట నాకు తెలిసింది అనేసి
(15:08) అయితే మన ఫ్యామిలీని మన ముందే చిలకం చేస్తుంటారు. అలాగా మన ఫ్యామిలీని మన ముందే ఎవరైనా చిలకం చేస్తే వాళ్ళని అయితే అస్సలు నమ్మొద్దు ఎందుకంటే నిజంగా మన బెస్ట్ ఫ్రెండ్ అయినవాడు మన ఫ్యామిలీని కూడా గౌరవిస్తాడు తప్పితే నీ ఫ్యామిలీ అలాంటిది అనేసి మన ముందే చెప్పడం కాబట్టి ఎవరైనా నీ ముందే నీ ఫ్యామిలీని తక్కువ చేస్తుంటే వాళ్ళయితే నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు వదిలేయ్.
(15:32) అదేవిధంగా చాలామంది నీతో ఉంటారు అరే నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటేనే బాగుంటారు నువ్వు ఆ డ్రెస్ే వేసుకోవాలి లేదా అరేయ్ నువ్వు ఈ చీరలోనే బాగుంటావు ఆ చేరే కట్టుకో అనేసి నిన్ను నీలా ఉంచకుండా వాళ్ళ అదుపులో ఉంచుకుంటున్నారు అంటే అది కూడా ఫ్రెండ్షిప్ కాదు కాబట్టి దాన్ని కూడా నువ్వు లైట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు నీకు ఏది నచ్చితే అది వేసుకో అన్నట్టు ఉంటది తప్పితే నువ్వు అలాగే ఉండాలి ఇదే చేయాలి అనేసి నిన్ను అదుపులో పెట్టాలని చూస్తే అంటే అది ఎప్పటికీ కూడా ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ కాదు కాబట్టి అలాంటి వాళ్ళని మీరైతే
(16:05) లైట్ తీసుకోండి. ఇంకా మనం కామన్ గా చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా మన కుటుంబంలోని చాలా మంది రిలేటివ్స్ లో కూడా కొంచెం మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే నువ్వు ఎదుగుతుంటే నీ ముందుకు వచ్చి అరే నువ్వు చాలా బాగా చేసావు అనేసి మనల్ని పొగడేస్తుంటారు. నువ్వు ఏమనుకుంటావ్ వాడు నా రిలేటివ్ే కాదా వాడు నిజంగానే నా ఎదుగుద్దలని చూసి వాడైతే ఆనంద పడుతున్నాడేమో అనుకుంటారు కానీ అందరూ కూడా నీ నీ యొక్క విజయాన్ని ఎవ్వరు ఆస్వాదించరు ఎవరో ఒకరైతే దాన్ని నువ్వు అది ఎలా సాధించేసావు అనేసి వెనకైతే వాళ్ళ యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది.
(16:36) ఆ వీడేంటి అది సాధించడం ఏంటి అనేసి వేరేలా ఆలోచిస్తుంటారు కాబట్టి రక్త సంబంధం అయినా గాన చాలా మందిని అయితే నమ్మకూడదు ఎందుకంటే నీ ముందు ఒకలాగా నువ్వు లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయినా గాని ఇప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్ లా బిహేవ్ చేసేవాడైనా నీ బ్లడ్ రిలేషన్ అయినా సరే నీ ముందు నీతో ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి అదే విధంగా మాట్లాడిన వాడే నీ ఫ్రెండ్ అవుతాడు.
(16:59) అలా కాకుండా నీ ముందు అరే నువ్వు నిజంగా గ్రేట్ రా అనేసి నీతో చెప్పి నువ్వు వెళ్ళిపోయిన అంటున్న వాడు ఒక వరస్ట్ ఫెలోరా అని చెప్పేవాడు ఎప్పటికీ కూడా నీ ఫ్రెండ్ అయినా రిలేషన్ అయినా ఏదైనా గాని వాడితో అయితే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాయితిగా మన ముందు మన తప్పుని చూపించినా పర్లేదు కానీ మన వెనకాల మనల్ని తిట్టేవాడితో మనల్ని హేలెంట్ చేసేవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
(17:23) కాబట్టి నా బంధువే కదా నాకోసం అలా మాట్లాడడు అనేసి ఎప్పుడు కూడా గుడ్గా నమ్మకు నువ్వు ఏదైనా సాధించినప్పుడు అది మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రశంసిస్తున్నారా లేదంటే ఏదో చేయాలి కదా అనేసి చేస్తున్నారు అనేది కూడా నువ్వు గమనించుకోవాలి. ఇప్పుడు చాలా కుటుంబంలో ఏంటంటే ప్రేమ వల్ల చాలా కుటుంబాలు ఊడిపోతుంటాయి. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు చాలా కలిసి మెలిసి ఉంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకే ప్లేట్లో తింటారు ఒకే వాళ్ళఇద్దరి కోసం ఒకళ కోసం ఒకరికి ఎన్నో త్యాగాలు చేసుకుంటారు అంత క్లోజ్ గా ఉన్నవాళ్ళు ఏదో చిన్న చిన్న ఆస్తి పంపకాల్లోనో లేదంటే
(17:55) ఏదైనా చిన్న భూమి పంపకాలు అవి వచ్చినప్పుడు వాళ్ళైతే బద్ద శత్రువుల్లా మారిపోతుంటారు ఒకరి కోసం ఒకరు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళద్దర అంత క్లోజ్ గా ఉన్నారు కదా ఎప్పుడు విడిపోవు అనుకున్నారు కదా ఎందుకు విడిపోయారు అన్నిటికి కూడా కారణం డబ్బు కూడా ఉంటుంది ఎందుకంటే అంటే ఇప్పుడు నా అన్నే కదా ఒక ప రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే ఏమవుతుంది అనేసి ఆలోచించేవారు ఎవరు ఉండరు ఏంటంటే వాడికి అంత వచ్చింది నాకు అంతే కావాలనేసి ఎదుటివారు డబ్బు కోసం కూడా ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరైతే నీతో పాటు ఉన్నారో నీ దగ్గర డబ్బు
(18:26) లేకపోయినా గాని నువ్వు ఏడుస్తున్నప్పుడు అరే ఊరుకోరా అనేసి ఓదర్చేవాడు నీ స్నేహితుడు ఎప్పుడు అవ్వడు కానీ నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసుకొని నువ్వు మళ్ళీ తిరిగి లేచి నిలబడ చేసేవాడే నిజమైన ఫ్రెండ్ అంతేగనీ నువ్వు ఏడుస్తు ఒరేయ్ ఊరికోరా అనేసి నీ పక్కన కూర్చొని నీతో పాటు భజనం చెప్పేవాడు ఎప్పుడు కూడా ఫ్రెండ్ కాదు.
(18:45) నిజంగా నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే అరేయ్ ఎంతసేపు ఏడుస్తావ్ రా ఎన్ని పని చూసుకో అనేసి నిన్ను నీ భుజం తట్టి నిన్ను లేపి పని లేచి నిలబడేలా చేసేవాడే అసలని ఫ్రెండ్ అసలు ఇప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే మన చుట్టూనే ఇప్పుడు ఎవరికైనా డబ్బు అవసరం అనుకో ఇప్పుడు ఈ రోజుల్లో అసలు బంధాలు బాధతో ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఎవరికైనా మనీ అవసరం అనుకో అరే చెల్లి నేను నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ రా ఒక్క 1000 కొట్టురా అంటారు.
(19:10) సరే అనేసి వేసిన తర్వాత ఒక నెల ఒక రెండు నెలల తర్వాత తనకి ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి అన్నా నాకు మొన్న వేసింది కదా వయరా అనేసి మనం ఫోన్ చేసామ అనుకోండి ఇంకా మనకు ఫోన్ ఎత్తడు అలాగని మెసేజ్ చేసామా రిప్లై ఇవ్వరు ఇంక మొత్తానికి ఇంకా వాళ్ళకి నీకు సంబంధం ఇంకా విడిపోయినట్టే నువ్వు ఎక్కడైనా కనిపించినా కానీ నీ మొఖాన్ని కూడా చూడకుండా సైడ్ అయిపోతుంటారు కాబట్టి ఎవరికైనా నువ్వు ఏదైనా అప్పు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు డబ్బు పోతే పోయింది కానీ ఆ మనిషితో నీకు సంబంధం లేకపోయినా పర్లేదా అనేసి ఆలోచించుకో ఎందుకంటే చాలా చాలా వరకు మన యొక్క బంధం అనేది ఎప్పుడు ఉడిపోతుంది
(19:42) అంటే డబ్బు విషయంలోనే నువ్వు ఎవరికన్నా గుడ్డిగా నమ్మి వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి నీకు మనీ ఇవ్వరు ఇవ్వకపోగా వాళ్ళని నువ్వు కనీసం వాళ్ళ మొఖం కూడా నువ్వు చూడడానికి లేకుండా మొఖం తిప్పేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించు నీకు డబ్బు పోయినా గాని తను నీకు అవసరమా లేదు నాకు తను డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు తను మాట్లాడకపోయినా పర్లేదు అనుకున్నప్పుడే ఇవ్వి అంతేగానీ మనీ ఇచ్చిన తర్వాత వాళ్ళు నీ ఫోన్ స్వీకరించకండా కనీసం ఇంకా వాళ్ళకి నీకు బంధం అనేది ఉండదు కాబట్టి ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకో
(20:13) నాకు వాళ్ళు లేకపోయినా పర్లేదు అనుకుంటే నువ్వు మనీ ఇచ్చేయచ్చు లేదు ఆ మనిషి నాతో ఉండాలి అని అనిపించినప్పుడు మాత్రం దయచేసి నిజంగానే చెప్తున్నాను లేదు అని చెప్పేయడం నేర్చుకో చాలా మంది ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో ఏమన్నా బిజినెస్లు చేద్దాని చూస్తూఉంటారు. కానీ ఇలా చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నా ఫ్రెండే కదా లేదంటే నా చుట్టమే కదా నా అక్కే కదా నా చెల్లే కదా నా తమ్ముడే కదా అనేసి మీరైతే ఇద్దరు కలిసి ఒక ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా అన్న ఫీలింగ్ తో అయితే స్టార్ట్ చేస్తారు కానీ అది చాలా రాంగ్ ఎందుకంటే ఇప్పుడు ఏద ఇద్దరు కలిసి
(20:47) ఒక బిజినెస్ చేసినప్పుడు మీ ఇద్దరికీ కూడా ఒక సంవత్సరం చేస్తారు లాభాలు బాగా ఎక్కువ రావచ్చు అప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నా అన్న ఫీలింగ్ తో ఉండకపోవచ్చు అది నువ్వు గ్రహించు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా నువ్వు ఒక్కడివే సింగల్ గా కాకుండా వేరే వాళ్ళతో నీ బంధువైనా ఫ్రెండ్ అయినా ఎవరితోటైనా కానీ నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలి లేదంటే ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ రాతిపూర్వకంగా అయితే రాసుకో అంతేగాని నా అన్న నావారే నా బంధువులే అన్న ఆలోచన అయితే నీ మనసులో ఉండొచ్చు కానీ అవతలవారి మనసులోనో బుద్ధిలోన అది ఉండదు కాబట్టి
(21:21) నువ్వు ఏదనా చేయాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ రాతపూర్వకంగా రాసుకోండి ఒక బాండో లేకపోతే ఏదో ఒకటి రాసుకొని దీని ప్రకారం చేద్దాం అనేసి అయితే ఉంచండి అంతేకా అంతేగనీ నువ్వు నావాళ్లే కదా అనేసి నువ్వు వెనక్కి తగ్గి అలా చేయొద్దు ఇప్పుడు నువ్వైతే ఇలా ఆలోచించొచ్చు నా వాళ్ళ మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా అనేసి సంతకం లేకనే నువ్వు బిజినెస్ అయితే స్టార్ట్ చేసేస్తావ్ నిజంగా నీ వాళ్లే కదా అక్కడ కాబట్టి అవతల వ్యక్తి కూడా నా వాళ్ళకి వాడు నా అన్న ఉద్దేశంతో నాకోసం ఇస్తున్నప్పుడు నేను కూడా నా వాళ్ళ కోసమే కదా ఒక సంతకం చేసేస్తాను అనేసి ఆలోచిస్తాడు కదా కానీ
(21:56) వారు నిజంగా సంటకం చేయడానికి భయపడుతున్నాడు అంటే అక్కడ నువ్వు ఒకసారి ఆలోచించు ఎప్పుడు కూడా ఏవైనా బిజినెస్లు చేయాలన్నా ఎవరికన్నా అప్పు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా రాతపూర్వకంగా అయితే ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకైతే కొనసాగు అంతేగాన నా అన్న ఆలోచనతో మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఓన్లీ గుడ్ నమ్మకంతో మాత్రమే నువ్వైతే మోసపోవద్దు మిమ్మల్ని మీ స్నేహితుడు లేదా బంధువులు మీరు ఎక్కువగా ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు నీ మనసులో చాలా బాధ అనిపిస్తంది స్తది కానీ ఏడిస్తే లోకమైపోతానేమో లేకపోతే నన్ను వాడు ఇలా
(22:30) మోసం చేశాడు అనేసి అందరూ నవ్వుతారేమో అన్న ఒక ఇదితో అయితే నీలో నువ్వే కుంగిపోతూ నీ లోపల మనశశాంతి లేకుండా చాలా నరకయాతనం అయితే అనుభవిస్తుంటావ్ ఆ టైంలో నిజంగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి యస్ ఏ ఫ్రెండ్ గా నేను చెప్పేది ఒక్కటే నీకు నిజంగా అలాంటి నమ్మక ద్రోహం జరిగినప్పుడు దయచేసి దృడంగా తయారవ్వు కానీ అవన్నీ తర్వాత చేసే పనులు కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే నీకు నిజంగా నిజంగా ఆ టైం లో ఏడుప వస్తే గనుక ఏడ్చి అందరూ అంటారు అరేయ్ మగవాళ్ళు ఏడవకూడదు అని కానీ ఎవరు చెప్పారు నిజంగా బాధ అనిపిస్తే ఆ బాధను తగ్గించుకోవడంలోనే నిజంగా మనశాంతి
(23:06) ఉంటది. అలా కాకుండా నువ్వు నీ బాధన అంతా దిగముకొని దాన్ని నువ్వు ఇంకా బలంగా మార్చుకుంటున్న ఆ బాధని నువ్వు నీ గుండెల్లో మోసుకున్నంత సేపు కూడా నీకు మనసు అంత అనేది ఉండదు కాబట్టి నీకు నిజంగా బాధ అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని నీకు జరిగిన అన్యాయం తెలుచుకొని ఒక్కడిగా ఏదైనా ఒక రూమ్లో ఉండయినా సరే నీ బాధ అంతా తగ్గే వరకు అయితే ఒకసారి ఏడ్చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఆ బాధని నిలబెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలని అంతేగానీ నువ్వు అదంతా మనసులో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఆ బాధ నిన్ను పని చేయనివ్వదు అలాగే నీ యొక్క ఎమోషన్స్
(23:41) ని కూడా చాలా ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అలా చేయొద్దు మనం చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఒక తప్పు చేశరఅనుకోండి మొత్తం ప్రపంచాన్నే మొత్తం వీళ్ళంతా అంతే అనేసి అయితే మనం అవమానిస్తుంటాం. కానీ నిజానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సపోజ ఎక్కడో ఒక డాక్టర్ తప్పు చేశడని మొత్తం డాక్టర్లంతా ఇంతే అనేసి మనమైతే ఇంకా హాస్పిటల్ కి వెళ్ళడం అయితే మానేయట్లేదు కదా అలాగే ఏదైనా ఒక స్కూల్లో ఒక టీచర్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండొచ్చు అలాగనేసి మొత్తం టీచర్స్ అందరూ ఇంతే అనేసి మనమైతే స్కూల్ కి మన పిల్లల్ని పంపించకుండా
(24:13) ఉండట్లేదు కదా అలాగే ప్రతిది కూడా ఎక్కడో ఒక్కొక్కరు అలా ఉంటారు తప్పితే మొత్తం ప్రపంచం అంతా ఇంతే అనేసి ఎప్పుడు కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఈ వీడియో ద్వారా నేనైతే మీ అందరికీ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనేసి అయితే చెప్పాలనుకున్నాను. ఎప్పుడు కూడా నిన్ను నీ వెనక ఎలా మాట్లాడుతున్నారో నీ ముందు కూడా అలా మాట్లాడేవాడే మనకు నిజమైన స్నేహితుడు.
(24:35) అదేవిధంగా నిన్ను అస్తమాల పొగిడే వారిని కూడా ఒకసారి గమనించు ఎందుకంటే నీ ప్రతి మాటకి పొగుడుతున్నారంటే వాళ్ళు నీకు ఏదో అపాయం సృష్టిస్తున్నారని అర్థం. నేనైతే ఇలా మీ అందరూ కూడా ఎప్పుడు కూడా అపరిమత్తంగా ఉండాలనేసే నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మి మీరైతే మీ ప్రాణాల మీదకుి తీసుకురాకండి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోండి.
(24:59) ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకైతే కొంచెం హోప్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏదైనా చిన్న అంశమైనా నచ్చితే దాన్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒక షేర్ అయితే చేయండి. అలాగే ఇలాంటి జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఆల్

No comments:

Post a Comment