పురుషుడు స్త్రీ అధికారాన్ని ఎలా లాగేసుకున్నాడు? | How Did Patriarchy Begin? |
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lEB7I9eYAk4
Transcript:
(00:01) బిడ్డ పుట్టిన తర్వాత పంతులు నామకరమణ చేస్తున్నప్పుడు తండ్రి గారి నామధేయం అడుగుతాడు. పిల్లలను స్కూల్లో చేర్పిస్తున్నప్పుడు కూడా పక్కన సన్ ఆఫ్ అని మాత్రమే రాస్తారు. మీ ఇంటి పేరుఏంటి బాబు అని ఎవరైనా అడిగితే నాన్నగారి ఇంటి పేరు మాత్రమే చెప్తాం. కానీ చైనాలోని మసోవ తెగలో ఇప్పటికీ అమ్మ వారసత్వం మాత్రమే నడుస్తుంది.
(00:24) వందఏళ్ల క్రితం వరకు మన దేశంలోనే కేరళలోని నాయర్ తెగలో తల్లితరమే గుర్తింపుగా కొనసాగింది. మరి కాస్త వెనక్కి వెళ్తే అంటే వ్యవసాయం కనిపెట్టిన 12వ000 ఏళ్ల కాలానికి వెళ్తే అప్పుడు కేరళలో చైనాలో మాత్రమే కాదు ఈ భూమండలం మొత్తం మీద ఆమె రాజ్యమే నడిచింది. అమ్మ రాజ్యమే కొనసాగింది. వారసత్వం ఆడవాళ్ళ వైపే కొనసాగేది దాన్నే మాతృస్వామిక వ్యవస్థ అంటారు.
(00:51) మరి అలాంటి సింహాసనాన్ని ఆమె ఎలా కోల్పోయింది? ప్రచారంలో ఉన్నట్టుగా మగాడు ఆమె నుంచి నిజంగానే అధికారం లాగేసుకున్నాడా? అదే నిజమైతే స్త్రీ ఎదిరించలేదా? మగాడి ఆధిపత్యాన్ని ఆమె ఎలా అంగీకరించింది. అసలు పితృస్వామ్య వ్యవస్థ ప్రారంభం కావడానికి ఎలాంటి పరిస్థితులు దారితీసాయి? పాప పుణ్యాలు ధర్మ అధర్మాలు పంచాల్సి వస్తే ఎవరి ఖాతాలోకి వెళ్తాయి ఎంత వెళ్తాయి చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ టర్నింగ్ పాయింట్ గురించి సంపూర్ణ సమాచారం ఈ వీడియోలో చూద్దాం.
(01:23) మనిషి అడవుల్లో సంచార జీవిగా ఉన్నప్పుడు పెళ్లి పెటాకులు ఏమీ లేవు. అప్పుడు మనిషికి మూడే మూడు పనులు ఉండేవి. పొద్దంతా అడవిలో తిరిగి తిండి సంపాదించుకోవడం రాత్రి నిద్రపోవడం కోరిక కలిగినప్పుడు జత కట్టడం ఇవి మాత్రమే మనిషి చేసే పనులు ఈ కాలంలోనే మాతృస్వామ్యానికి పునాది పడింది. ఇది ఎవరో కూర్చొని ప్లాన్ చేసిన వ్యవస్థ కాదు చట్టాలు చేసి ఆమె చేతికి అప్పగించిన అధికారం కూడా కాదు ఇది నేచర్ సృష్టించిన ఒక అనివార్యత.
(01:50) దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది లైంగిక స్వేచ్ఛ. ఒక సమూహంలోని వారు ఎవరితోన జతకట్టే పరిస్థితి ఉండేది. దీనివల్ల పుట్టే పిల్లలకు తల్లి ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది కానీ తండ్రి ఎవరు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. ఇది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇలా ఫలానా బిడ్డ ఎవరిది అన్నప్పుడు అదిగో ఆమె కన్నది అని చెప్పుకునేవారు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఇతను ఎవరి కొడుకు అన్నప్పుడు ఫలానా ఆమె కొడుకు అని మాత్రమే చెప్పేవారు.
(02:21) అలా అతని అమ్మ ఎవరో తెలుస్తోంది అతని అమ్మమ్మ ఎవరో కూడా తెలుస్తోంది. అక్క చెల్లి ఎవరో అన్నాదమ్ములు ఎవరో కూడా క్లియర్ గా తెలుస్తుంది కానీ తండ్రి ఎవరో మాత్రం తెలియట్లేదు. కాబట్టి అనివార్యంగా నాటి సమాజంలో వంశ వృక్షాన్ని లెక్కించడానికి తల్లి మాత్రమే ఏకైక ఆధారం అయింది. ఆ విధంగా పిల్లలందరూ తల్లి పేరుతోనే గుర్తించబడ్డారు.
(02:44) ఒక తెగలోని బంధుత్వాలు రక్త సంబంధాలు అన్నీ తల్లి లైన్ ద్వారానే లెక్కించబడ్డాయి. ఇక రెండో రీజన్ మనిషి శరీరంలోని ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చి పాలిచ్చేటప్పుడు ఆమె శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విపరీతంగా విడుదల అవుతుంది. తల్లి బిడ్డల మధ్య ప్రేమ బంధాన్ని బలంగా నిలిపేది ఇదే. ఈ హార్మోన్ కారణంగానే బిడ్డ మీద తల్లికి తల్లి మీద బిడ్డకు ఎనలేని ప్రేమ భావం ఏర్పడుతుంది.
(03:11) సెక్యూరిటీ భావం పెరుగుతుంది. దాంతో పాటు నాటి రోజుల్లో దాదాపు 10ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలు తల్లినంటే గడిపేవారు. అలా ఆమెతో మరింత బాండింగ్ ఏర్పడింది. ఆ విధంగా అమ్మ చెప్పిందే చేయడం ఏదైనా తెలియని విషయంలో అమ్మ నుంచే సలహాలు తీసుకోవడం మొదలైంది. అలా తెలియకుండానే అమ్మ ఆజ్ఞలు పాటించడం ఆమె అనుమతితోనే పనులు చేయడం ప్రారంభమైంది. ఆ విధంగా గుంపు మొత్తాన్ని ఒక తాటి మీద ఒక మాట మీద ఉంచే సైకలాజికల్ పవర్ స్త్రీకి సొంతమైంది.
(03:43) ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది వేట అడవుల్లో ఆదిమానవుల జీవనం అనగానే ఈటలు కర్రలు పట్టుకొని వేటకు వెళ్ళిన మగాళ్ల చిత్రాలు జంతువులతో తలపడుతున్న విజువల్స్ మాత్రమే మన కళ్ళ ముందు కదలాడతాయి. ఇది నిజమే కానీ దీంట్లో చాలా మందికి తెలియని ఇంకో ఫాక్ట్ ఉంది. మగాల వేట అనేది గ్యారెంటీ లేని జాబ్ గా ఉండేది. పొద్దంతా తిరిగినా కూడా ఒక్కోసారి ఒక్క వేట జంతువు కూడా చిక్కదు.
(04:08) కొన్నిసార్లు ఒట్టి చేతులతోనే నీరసంగా ఇల్లు చేరుకునేవారు అప్పుడు ఇంటిని చక్కదిద్ది పిల్లల కడుపు నింపి వేటకల్లి వచ్చిన మొగాల కడుపు నింపింది ఎవరు ఇంటి వద్ద ఉన్న ఆడవాళ్లే ఎలా అంటే వారు నివాసాలకు దగ్గరగా ఉండే అడవుల్లోకి వెళ్లి దుంపలు పండ్లు ఆకుకూరలు వంటివి తెచ్చేవారు అలా వేటలో మొగాడి గురి తప్పిన ప్రతిసారి ఆడవాళ్ళ చేతిలో తిండి పెట్టేవి.
(04:33) పురుషులది గ్యారెంటీ లేని ఆహారం అయితే స్త్రీలది 365 డేస్ గ్యారెంటీ ఇచ్చిన ఆహారం అయింది. మానవ పరిణామ శాస్త్ర పరిశోధకుల ప్రకారం ఆనాటి సమాజంలో మొత్తం ఆహారంలో దాదాపు 60% వరకు ఆహారాన్ని మహిళలే సేకరించేవారు. అలాగని మహిళలు వేటకు వెళ్ళలేదని కాదు ఆరోగ్యం సహకరించినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళేవారు కానీ ఎప్పుడైతే గర్భవతి అవుతారో అప్పటి నుంచి పిల్లలు పుట్టి వాళ్ళు కాస్త ఎదిగేంత వరకు ఇంటి వద్దనే ఉండేవారు.
(05:01) ఆ సమయంలో ఇలాంటి పండ్లు దుంపలు సేకరించేవారు. ఈ మూడు కారణాలతో గుంపుపై స్త్రీల నియంత్రణ ఏర్పడింది. వారు చెప్పినట్టే గుంపులోని వారందరూ వినే పరిస్థితి వచ్చేసింది. ఇక్కడే మనకు అత్యంత కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది. శారీరకంగా మహిళల కన్నా బలంగా ఉండే పురుషులు జంతువులను సైతం వేటాడగలిగే పరాక్రమం ఉన్న మగాలు ఒక మహిళా నాయకత్వాన్ని ఎలా ఒప్పుకున్నారు? ఈ ప్రశ్న రావడానికి కారణం మనం నేటి పితృస్వామి మైండ్సెట్ తో ఆనాటి కాలాన్ని అంచన వేస్తాం.
(05:30) అందుకే ఆ డౌట్ వస్తుంది. కానీ ఆనాటి సమాజంలో ఆధిపత్యం అనే భావనే లేదు అధికారం అనే ఫీలింగే లేదు. ఈ పూట మనకు తిండి దొరికిందా లేదా కడుపు నిండిందా లేదా అన్నదే అప్పటి మనిషి ఆలోచన. అందుకే ఆమె చెప్పింది వినడానికి అతనికి నామముషి అనిపించలేదు. అంతేకాదు తనను కన్న తల్లి పట్ల ఉన్న అపారమైన గౌరవం వల్ల ఆమె మాటకు లోబడి ఉండడానికి ఆమె చెప్పిన దారిలో నడవడానికి మనసు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.
(05:56) పైగా పురుషుడు దాన్ని ఒక రెస్పెక్ట్ గా భావించాడు. అలా మాతృస్వామ్యం ఈ నేలపై విలసిల్లింది. ఈ వ్యవస్థ ఏదో కొన్ని వందలు వేల సంవత్సరాలు నడిచిన ముచ్చట కాదు ఆధునిక మానవ పరిణామ క్రమంలో దాదాపు 90% మాతృస్వామ్యమే కొనసాగింది. క్రీస్తుపూర్వం 2 లక్షల ఏళ్ల నుంచి మొన్న 12వేల ఏళ్ల క్రితం వ్యవసాయం కనిపెట్టేదాకా మాతృస్వామ్యమే కొనసాగిందని పరిశోధకులు ఘంటాపదంగా చెబుతున్నారు.
(06:24) ఆ విధంగా ఇప్పటివరకు మానవాళి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం నడిచిన ఏకైక సామాజిక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మాతృస్వామ్యమేన అని చెప్తున్నారు. మరి ఇలా కొనసాగిన ఆ వ్యవస్థలో స్త్రీ తన అధికారాన్ని ఎలా చూపించేది అనేది ఇక్కడ కీలకమైన విషయం. దీనికి అవుట్ అండ్ రైట్ గా ఒకే సమాధానం లేదు. ఎందుకంటే అది ఫిక్స్డ్ కాదు. అడవుల్లో ఉన్నప్పుడు ఆధిపత్యం లేదు.
(06:46) కానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే క్రమంలో కొద్దిగా మార్పు మొదలైంది అని చెప్తారు. అది కూడా కొద్దిమంది మాత్రమే ఆధిపత్యం చూపించేవారు గానీ మెజారిటీగా మాతృస్వామ్య వ్యవస్థలో పురుషుడిని పూర్తిగా అని చేయలేదని చెప్తున్నారు. మాతృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా సమతావాద సమాజంగానే కొనసాగిందని అంటారు. అది రాజ్యాధికార వ్యవస్థ కాదు ఒక కేరింగ్ సిస్టం అని చెప్తారు.
(07:11) ప్రతి తెగలోనూ ఒక వృద్ధురాలైన స్త్రీ లీడర్ గా ఉండేది. ఆమెను క్లాన్ మదర్ లేదా తెగ తల్లి అనేవారు ఆమెకు సర్వాధికారాలు ఉండేవి. అయితే ఆ అధికారాలు ఎవరినో శిక్షించడానికి కాకుండా ఒక తల్లి తన ఇంట్లోని పిల్లలందరినీ ఎలా సమానంగా చూసుకుంటుందో ఆ క్లాన్ మదర్ కూడా తెగలోని ప్రజలందరినీ సమానంగా చూసుకునేది అని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే ఆ సొసైటీలో నాది అనే ప్రైవేట్ ప్రాపర్టీ లేదు.
(07:36) అడవిలో దొరికిన ఆహారమైనా వేటాడి తెచ్చిన మాంసమైనా అంతా తెగ తల్లి ముందు పెట్టాలి. ఆమె దాన్ని తెగలోని ప్రతి ఒక్కరికి వారి అవసరాన్ని బట్టి సమానంగా పంచిపెట్టేది. ఇక్కడ వారి అవసరాన్ని బట్టి అనే పదం వాడాను కదా దాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా ఒక వృద్ధురాలైన తల్లి సూచనలతో ఆమె పాలనతో సమూహాలు తెగలు అన్నీ ముందుకు సాగాయి.
(08:01) ఈ సమాజానికి సంబంధించి మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేసే సైంటిస్టులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. పితృస్వామ్యం మొదలైన తర్వాత కాలం నాటి మనుషుల అస్తి పంజరాలతో మాతృస్వామ్యం బలంగా ఉన్న కాలానికి సంబంధించిన మానవ అస్తి పంజరాలను పోల్చి చూశారు. ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా కొనసాగింది. ఇందులో తేర స్పష్టంగా బయటపడింది.
(08:23) పితృస్వామ్య కాలం నాటి అస్తి పంజరాల్లో మెజారిటీగా కొట్టుకు చచ్చిన ఆనవాళ్లే కనిపించాయి. రాళ్లుు ఆయుధాలతో తలలు పగిలి ఎముకలు విరిగి చనిపోయినట్టు గుర్తించారు. కానీ మాతృస్వామ్యం నాటి అస్తి పంజరాల్లో ఇలా గాయాలతో చనిపోయిన ఆనవాళ్ళు చాలా తక్కువగా బయటపడ్డాయి. దీని అర్థం మాతృస్వామ్యంలో యుద్ధాలు పెద్దగా జరగలేదన్నమాట. అవును మరి మెజారిటీ స్త్రీ నైజం సహజంగానే ప్రేమను పంచుతుంది తప్ప ద్వేషాన్ని కాదు కదా రక్షణను కోరుకుంటుంది తప్ప వినాశనాన్ని కాదు కదా తెగలో ఏ సమస్య వచ్చినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా సాధ్యమైనంత వరకు సామరస్యంగా చర్చల ద్వారానే పరిష్కరించుకునేవారు. అందుకే
(09:02) మాతృస్వామ్యంలో యుద్ధాల అవసరం పెద్దగా రాలేదని చెప్తారు. మరి ఇలా వేల సంవత్సరాల పాటు ఇంత అద్భుతంగా శాంతియుతంగా సాగిన మాతృస్వామ్య వ్యవస్థ ఒక్కసారిగా ఎలా కుప్పకూలిపోయింది పురుషులు ఈ వ్యవస్థను ఎందుకు తిరస్కరించారు అధికారాన్ని ఎలా లాక్కున్నారు అనేది మానవ చరిత్రలోని అతిపెద్ద సంచలనమైన ప్రశ్న [గురకలు] ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఫ్రెడరిక్ యంగిల్స్ ది ఆరిజన్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ది స్టేట్ అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు.
(09:34) అందులో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుంది. మాతృస్వామ్య వ్యవస్థ కూలిపోవడాన్నే ఆయన స్త్రీ జాతి చారిత్రక ఓటమి అన్నారు. ది హిస్టారిక్ డిఫీట్ ఆఫ్ ది ఫీమేల్ సెక్స్ అని స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఇంతటి మార్పుకు ఈ చారిత్రక ఓటమికి పురుషాధిక్య సమాజ ఆవిర్భావానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక విప్లవం అదే వ్యవసాయం అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇక్కడ మీకు ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాలి.
(10:04) మనం తరచు కొన్ని వార్తలు చూస్తుంటాం చికెన్ వండలేదని భార్యను చంపేసిన భర్త కాఫీ అడిగిందని అత్తను చంపేసిన కోడలు ఇలాంటి వార్తలు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం ఈ మాత్రం దానికే ప్రాణిస్తారా అని కానీ ఇక్కడే కీలకమైన విషయం ఉంటుంది. అందరూ పైకి కనిపించేదాన్ని మాత్రమే చూస్తారు కానీ నిజంగా చూడాల్సింది లోపలి విషయాన్నే ఇందాక చెప్పిన రెండు ఉదాహరణల్లో ప్రాణం తీయడానికి చికెన్ ఉండకపోవడం కాఫీ ఇవ్వకపోవడం అనేది కేవలం ట్రిగ్గర్ పాయింట్స్ మాత్రమే కానీ ఆ గొడవ మొదలై కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది.
(10:36) వారి మధ్య ఏళ్ల పాటు కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అది కాస్త చిక రూపంలోనో కాఫీ రూపంలోనో ముగిసిపోతుంది అంతే ఇదే ఉదాహరణ మాతృస్వామిక వ్యవస్థకు అప్లై చేస్తే ఇది అంతం కావడానికి బీజం ఎప్పుడు పడింది అనేది అర్థమవుతుంది. అది వ్యవసాయం కనిపెట్టడానికన్నా ముందే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కన్నా ముందుగానే పడింది.
(11:00) గుహంలో ఉండేటప్పుడు మగాళ్ళు వేటకు వెళ్లి తెచ్చిన దాన్ని గుంపు పెద్దగా ఉన్న ఆమె ముందు పెట్టేవారు. ఆమె దాన్ని అక్కడ ఉన్నవారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమానంగా పంచి ఇచ్చేది. కానీ వేటకు వెళ్ళే వారిలో కొందరికి అది అన్యాయంగా అనిపించొచ్చు. వేటాడుతున్నప్పుడు నాకు గాయాలు అయ్యాయి. జంతువు నోటికి చిక్కకుండా కాస్త తప్పించుకున్నాను. ఇన్ని దెబ్బలు తిని ప్రాణాన్ని పనంగా పెట్టి తెచ్చిన నాకు సరైన వాట రాలేదని అనిపించొచ్చు.
(11:24) ఎంతటి న్యాయమూర్తులైనా ప్రతిసారి సమానంగా పంచడం ఎవరి వల్ల కూడా కాదు. ఒక్కోసారి తేడా ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి అని ఇందాక చెప్పాను గుర్తుందా గుంపులో ఉన్నవారి అవసరాలను బట్టి అమ్మ అందరికీ సమానంగా పనిచేదని చెప్పుకున్నాం. అప్పుడు అమ్మ గుంపులోడి వారి పరిస్థితిని అవసరాన్ని మాత్రమే చూస్తే వేటక వెళ్లివచ్చిన వాళ్ళు తమకు తగ్గిన వాటాన్ని చూసేవారు.
(11:49) మాతృస్వామ్యంపై రగిలిన మొట్టమొదటి అసంతృప్తి ఇదేననే అభిప్రాయం ఉంది. ఇలా మొదలైన అసంతృప్తి కాలక్రమంలో పెరుగుతూ వచ్చింది. ఇలాంటి ఫీలింగ్ ఎవరిలోనైనా ఒక్కసారి మొదలైతే ఇక ఆ తర్వాత నుంచి ఆ గుంపు పెద్దను నెగిటివ్ గానే చూడడం మొదలు పెడతారు. వారు చెప్పే ప్రతి పని మన మనసుకు ఒక ఆదేశంగా అధికారంగా ఆధిపత్యంగా అనిపించడం మొదలు పెడుతుంది. కానీ ఎదిరించే పరిస్థితులు లేనప్పుడు మౌనంగా కాలం వెలదీస్తారు.
(12:16) అలా అదొక నివురు కప్పిన నిప్పుల రగులుతూ వచ్చింది. ఇలా లక్షల ఏళ్లు గడుస్తూ వచ్చేసాయి. ఈ క్రమంలోనే 12వేల ఏళ్ల క్రితం వ్యవసాయం పుట్టింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను తప్పకుండా చూడండి. ఎప్పుడైతే ఈ వ్యవసాయం వచ్చిందో అంతకు ముందు పెన్నర చూడని ఊహించిన పెనుమార్పులు మానవ సమాజంలోకి వచ్చేసాయి. అప్పటివరకు ఒక్క పూట తిండి కోసం నానా అవస్థలు పడే మనుషులకు ఇప్పుడు కావాల్సినంత మిగులు ధాన్యం వచ్చి పడింది.
(12:44) ధాన్యం పశువుల రూపంలో సంపద పోగుపడడం మొదలైంది. నాటి సమాజంలోనైనా నేటి సమాజంలోనైనా మనిషి మొదటి ఆరాటము పోరాటం ఆకలి కోసమే అది తీరిన తర్వాత ఇక వారి దృష్టి పడేది ఆధిపత్యం మీదనే మిగులు ధాన్యం వచ్చిన తర్వాత మగాడి ఆలోచన విధానం మారుతూ వచ్చింది. మహిళ తన పిల్లల్ను చూసుకోవడం, ఆహారం సిద్ధం చేయడం, ఇంటి పనులు చేయడంలో ఉండిపోతే మగాడు పొలం పనిలో మునిగిపోయాడు.
(13:10) నాగలి దున్నడం, పశువులను మచ్చ చేసుకోవడం, పెంచడం వంటి పనుల్లో బిజీ అయ్యాడు. ఇంత కష్టం చేసి పంట కోసి, కుప్పూర్చి ధాన్యం సిద్ధం చేసిన తర్వాత తీసుకెళ్లి ఎవరి ముందు పోయాలి? ఆమె ముందే వాటాలు ఎవరు వేయాలి? ఆమెనే ఎవరు చెప్పినట్టు వినాలి? ఆమె చెప్పినట్టే. గొడ్డుల ఇంత కష్టపడుతున్నది నేను ఆధిపత్యం మాత్రం ఆమెదా అనే ఉక్రోషం మగాడిలో మరింతగా పెరిగిపోతూ వచ్చింది.
(13:37) ఆల్రెడీ వేట పంపకాల నుంచి మొదలైన అసంతృప్తి ఉండనే ఉంది. ఈ విధంగా ఆ అసంతృప్తి డబుల్ అయింది. ఈ పరిస్థితులకు తోడు మానవ సమూహాల్లో యుద్ధాలు మొదలయ్యాయి. అడవుల్లో ఉన్నంతవరకు ఇది నా భూమి అనాల్సిన అవసరం ఏ మనిషికి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఒక్క చోట నివసించలేదు. కానీ వ్యవసాయం కనిపెట్టిన తర్వాత ఒక్క చోటనే ఉంటున్నాడు. భూమిని చదను చేయడానికి రాళ్లుు రప్పలు తొలగించడానికి నేలను సారవంతం చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
(14:05) ఇవన్నీ చేసుకొని సిద్ధమైన తర్వాత ఇతర గుంపులు వచ్చి దాడి చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకునేవారు వారి పశువులను కూడా సొంతం చేసుకునేవారు. ఇలాంటప్పుడు శత్రువులతో యుద్ధం చేయడానికి బరిలో నిలిచేది ప్రాణాలను పనంగా పెట్టేది ప్రధానంగా మొగాడే అయ్యాడు. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిపి చూడండి వ్యవసాయం చేసి పంట పండించేది నేనే ప్రధాన సంపద అయిన పశువులను పెంచేది మేపేది కూడా నేనే శత్రువులు వస్తే ప్రాణాలకు తెగించి యుద్ధం చేసేది కూడా నేనే మనిషి జీవితానికి బతకడానికి అవసరమైన అన్ని పనులు నేనే చేస్తున్నప్పుడు ఆమె చెప్పినట్టు నేనెందుకు వినాలి ఆమె ఆదేశాలను నేను ఎందుకు పాటించాలి ఈ
(14:40) ప్రశ్నలే మాతృస్వామిక వ్యవస్థను కూలదేదోయడానికి ప్రధాన కారణం అయ్యాయి. ఒక్కసారి మన కష్టాన్ని ఎవడైనా దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని రక్షించుకునేందుకు యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణ త్యాగం కూడా అవసరమైనప్పుడు అని వార్యంగా దానిపై ఎనలేని ప్రేమ పెరిగిపోతుంది. అది క్రమంగా బలమైన స్వార్థంగా మారుతుంది.
(15:03) వ్యవసాయ భూములపై పశువులపై శత్రువుల దాడులు పెరిగిన తర్వాత ఇది నాది ఎవడైనా టచ్ చేస్తే పుచ్చ లేచిపోతాయని మనిషి చెప్పడం మొదలు పెట్టాడు. అలా మొదటిసారిగా ఈ భూమిపై కంచలు ఏర్పడ్డాయి. ఈ చదువు చేసిన భూమి మొత్తం నాది నేను కష్టపడ్డాను చేతులు వేస్తే నరికేస్తాను అని ఎదుటి వారిని హెచ్చరించడం ప్రారంభించాడు. అలా మొదటిసారిగా నాది అనే స్వార్థం ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో పుట్టింది.
(15:33) ఈ నాది అనే భావన మొదట్లో వేరే తెగలవారిని అడ్డుకోవడానికి మాత్రమే పుట్టినప్పటికీ ఆ తర్వాత సొంత గుంపులో కూడా ఈ వైరస్ వ్యాపించింది. నేను పండించిన పంట, నేను తెచ్చుకున్న వేట, నేను తెంపుకున్న పండ్లు అప్పటివరకు మన తెగ మన ఆహారం అనుకున్న మనుషులు కాస్త ఇది నా భూమి, ఇది నా పంట, ఇవి నా పశువులు అని సరిహద్దులు గీసుకోవడం మొదలుపెట్టారు.
(15:55) ఇలా మనుషులకు తమ వ్యక్తిగత అవసరాలే ఫస్ట్ ప్రయారిటీ అవుతూ వచ్చినప్పటికీ శత్రు తగ్గల దాడులకు వచ్చినప్పుడు ఈ గుంపులోని వారంతా తమలోని విభేదాలను పక్కన పెట్టి వారిపై యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఆ యుద్ధం చేసేంత బలశాలుడు మగవాళ్ళు మాత్రమే ధాన్యం సంపద పశువులు సాగుభూములు పెరుగుతూ వచ్చే కొద్దీ వాటిని దోచుకునేందుకు కాపాడుకునేందుకు యుద్ధాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి.
(16:22) దాంతో ఒక తెగను కాపాడడానికి ప్రత్యేకంగా ఒక యువధలం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందులో సహజంగానే అందరూ మగాళ్లే ఉండేవారు అన్ని తెగల్లోనూ అన్ని గుంపుల్లోన ఇదే పరిస్థితి ఇలా క్రమంగా వార్ వన్ సైడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మొత్తం రివైండ్ చేసి చూడండి మగాడు వ్యవసాయంలో కండలు కరిగిస్తున్నాడు. ఆ ధాన్యంతో ఇంట్లో వాళ్ళ కడుపు నింపుతున్నాడు.
(16:43) అటు యుద్ధం చేస్తూ శత్రువులో నుంచి తెగను కాపాడుతున్నాడు. ఆ విధంగా ఒక సమాజాన్ని కాపాడేవాడు మగాడే అనే మార్పు ఆల్మోస్ట్ అందరూ గుర్తించే పరిస్థితి వచ్చేసింది. దాంతో అప్పటివరకు వృద్ధ తల్లి సలహాలతో ముందుకు సాగిన తెగలకు ఇప్పుడు వ్యవసాయం చేసి యుద్ధం చేసి అలసిపోయిన వృద్ధ వీరుడి సలహాలు అవసరమయ్యాయి. వ్యవసాయం ఎలా చేయాలో శత్రువుని ఎలా ఎదుర్కోవాలో అతనికే ఎక్కువ తెలుసు మరి.
(17:09) అలా ప్రతి తెగలో తల్లి స్థానంలో బలవంతుడైనా లేదా అనుభవజ్ఞుడైన మగాడు కూర్చోవాల్సి వచ్చింది. ఆ విధంగా పితృస్వామ్య వ్యవస్థ శకం ఆరంభమైంది. ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టుగా ఉందా లేక కాలం రాసిన రాతలాగా అనిపిస్తుందా మీకేమనిపిస్తుందో తర్వాత కామెంట్ చేయండి. మరి ఈ మార్పును స్త్రీ ఎలా అంగీకరించింది? వ్యతిరేకించలేదా అనే సందేహం సహజంగానే వస్తుంది.
(17:34) దీనికి సింపుల్ గా ఆన్సర్ చేయాలంటే ఆమె పరిస్థితులకు తలవంచిందని చెప్పుకోవాల్సి వస్తుంది. బయలాజికల్ గా స్త్రీ శరీరం పురుషుడి కన్నా సుమారు 20% తక్కువ బలంగానే ఉంటుంది. దీనికి వాడి ఒంట్లోని టెస్టోస్టిరాన్ ఇంకా బలమైన కండరాలు కారణం. ఇది పాయింట్ నెంబర్ వన్ మగాడి వేట జంతువుతో పోరాడితే మహిళ వేట పండ్లు ఆకూరల సేకరణ మాత్రమే. ఇది పాయింట్ నెంబర్ టూ వ్యవసాయంలో ప్రధాన శక్తి కూడా మగాడే మూడో పాయింట్ యుద్ధంలో ముందుండి తెగను కాపాడేది కూడా వాడే నాలుగో పాయింట్ వీటన్నిటితో పాటు ప్రధానమైన ఐదో పాయింట్ కూడా ఉంది.
(18:10) శత్రు తెగలు దాడికి వచ్చినప్పుడు ఈ తెగవారిని ఓడిస్తే ధాన్యం పశువులతో పాటు ఆడవాళ్ళను కూడా లూటి వస్తువులుగా లాక్కొని వెళ్ళిపోయేవారు. తమతో కాపురం చేయడానికో తమ తెగలో పనులు చేయించుకోవడానికో వారిని ఉపయోగించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో తెగను కాపాడడానికి మాత్రమే కాదు మహిళల మాన ప్రాణాలను కాపాడే రక్షకుడిగా కూడా మగాడు అవతరించాడు.
(18:33) ఈ ప్రమాదం ఆమెను అని భార్యంగా మగాడి చాటను దాక్కునేలా చేసింది. అలా ఆమె తనకు తెలియకుండానే తన అధికారాన్ని కోల్పోయింది. అతని అధికారాన్ని ఆధిపత్యాన్ని తనకు తెలియకుండానే అంగీకరించాల్సి వచ్చింది. ఈ విధంగా మానవ పరిణామ చరిత్రలోనే 90 శాతం కాలాన్ని ఏలిన మాతృస్వామిక వ్యవస్థ పునాదులు కదిలిపోయాయి. పితృస్వామిక వ్యవస్థ రాజ్యానికి పిల్లర్లు ఏర్పడ్డాయి.
(18:56) ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అధికార మార్పిడికి ఆడమగా మధ్య యుద్ధమే జరగలేదు. మగాడు మగాడు కొట్టుకొని ఆమె రాజ్యాన్ని కూల్చేశారు. అయితే ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిన చేంజ్ కాదు వందల సంవత్సరాల పాటు నిశశబ్దంగా కొనసాగిన సామాజిక మార్పు ఈ మార్పును మగాడు తెచ్చిన పెళ్లి శాశ్వతం చేసేసింది. దీన్ని ఒక వ్యవస్థగా మార్చేసింది.
(19:20) అయితే మగాడు తెచ్చిన పెళ్లి కన్నా ముందే ఆడవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి వ్యవస్థ ఉండేదని మీకు తెలుసా? మరి అది ఎలా ఉండేది భార్య ఇప్పటిలాగానే అప్పుడు కూడా భర్త వద్దకే వచ్చేదా లేదంటే భర్తే భార్య ఇంటికి ఇల్లరిక వెళ్ళిపోయేవాడా జస్ట్ వెయిట్ అండ్ సి ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్
No comments:
Post a Comment