Wednesday, September 2, 2026

తల్లిదండ్రుల పాపాలకు పిల్లలు శిక్ష అనుభవిస్తారా? అసలు నిజం ఏమిటి? | కర్మ సిద్ధాంతం

తల్లిదండ్రుల పాపాలకు పిల్లలు శిక్ష అనుభవిస్తారా? అసలు నిజం ఏమిటి? | కర్మ సిద్ధాంతం

Author Name:Gotohistory

Youtube Channel Url:https://www.youtube.com/@Gotohistory.v2y

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WYuPmC1a5Jo



Transcript:
(00:00) మన జీవితంలోకి వచ్చే ప్రతి బంధం అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఈ బంధం వెనుక ఏదైనా కర్మ ఉందా లేదా అదృష్టమా అలాగే తల్లిదండ్రులు చేసిన కర్మలకు పిల్లలు కూడా శిక్షలు అనుభవిస్తారు. మన జీవితంలో కొంతమంది మనం కోరుకోకుండానే వస్తారు. కొంతమందిని మొదటిసారి కలిసిన ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
(00:23) మరి కొంతమంది మనకు ఎంతో దగ్గరవుతారు. వాళ్ళ కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. మరికొందరితో మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే మనస్పర్ధాలు వస్తాయి. ఎంత దూరం వెళ్ళాలని ప్రయత్నించిన కొన్ని బంధాలు మన జీవితాలను వదిలిపెట్టవు. అసలు ఎందుకు మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కేవలం అదృశ్చితంగా వస్తాడా లేక మనకు తెలియని ఏదైనా పాత అనుబంధం, పాత కర్మ, పాత రుణం ఈ బంధాల వెనక దాగి ఉందా? హిందూ ధార్మిక సాంప్రదాయాలను దీనిని వివరించడానికి మనం ఉపయోగించే ఒక భావన రుణానుబంధం.
(00:54) ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక 10 మినిట్స్ కూల్ గా ఒక లైక్ చేసి వినండి. రుణానుబంధం అంటే కేవలం డబ్బు అప్పు ఇవ్వడం కాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేసిన సహాయం చేసిన ఉపకారం చేసిన అన్యాయం, నెరవేరని బాధ్యత, ప్రేమ, అనురాగం, ద్వేషం [సంగీతం] ఇవన్నీ ఒక రకమైన బంధాన్ని సృష్టిస్తాయని ఈ భావన చెబుతుంది. అందుకే కొన్ని బంధాలు మన జీవితంలోకి వచ్చి చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి.
(01:18) మనం వాళ్ళను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నామో తెలియదు. వాళ్ళ కోసం ఎందుకు ఇంతగా త్యాగం చేస్తున్నామో అర్థం కాదు. మరికొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చూసినప్పుడే మనసులో కారణం తెలియని అసహనం కలుగుతుంది. ఈ భావన ప్రకారం ఇవన్నీ గతజన్మ కర్మలతో సంబంధం కలిగి ఉండవచ్చని భావిస్తారు. ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒక గ్రామంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు.
(01:40) అతను చాలా మంచివాడు. తనకు చేతనైనంతవరకు సహాయం చేసేవాడు. ఒకసారి అతని దగ్గరికి చాలా దూరం నుంచి ఒక వృద్ధుడు వచ్చాడు. అతనికి తినడానికి ఆహారం లేదు ఉండడానికి చోటు లేదు. ధర్మయ్య అతని ఇంట్లోనే అతనికి ఆశయం ఇచ్చాడు. కొన్ని రోజులు అతన్ని తన కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాడు. ఆ వృద్ధుడు వెళ్లే సమయంలో ధర్మయ్య చేతులు పట్టుకొని నువ్వు నాకు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి వెళ్ళిపోయాడు.
(02:06) అలా కాలం గడిచింది సంవత్సరాలు గడిచాయి. ధర్మయ్య మరణించాడు. తర్వాత జన్మలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని మంచితనం వల్ల దానధర్మాల వల్ల మంచి జీవితం అనుభవిస్తాడు అని మనం అనుకుంటాం. కానీ అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. తన కుటుంబ భారం మొత్తం తన మీదే పడింది. కానీ అతని జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
(02:28) అతను చిన్న వయసులోనే ఒక అపరిచిత కుటుంబాన్ని కలిసాడు. ఆ కుటుంబంలోని ఒక వృద్ధురాలు అతన్ని చూసిన వెంటనే ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుంది. ఎందుకో తెలియదు కానీ ఆమెకు ఆ బాలుడిపై ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. ఆమె తన పిల్లల కంటే కూడా అతన్ని ఎక్కువగా చూసుకునేది. ఆ బాలుడికి కూడా ఆమెను చూసినప్పుడల్లా ఒక వింతైన ఆత్మీయత కలిగేది.
(02:51) వాళ్ళద్దరికీ ఈ అనుబంధం ఎందుకు ఏర్పడిందో తెలియదు. కానీ ఈ రుణానుబంధం అనే భావన ప్రకారం గతంలో ఒకరికి మరొకరు చేసిన సహాయం లేదా ఏర్పడిన బంధం ఏదో ఈ రూపంలో మళ్ళీ కలుసుకునేలా పరిస్థితిని సృష్టించవచ్చని చెబుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. రుణానుబంధం అంటే ప్రతి మనిషి జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి గతజన్మలో కూడా తప్పకుండా పరిచయమైన వాడే అని నిర్ధారించడానికి మనకు మార్గం లేదు.
(03:13) ఇది ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే. దీనిని అక్షరాలా నిరూపించబడిన శాస్త్రీయ నియమంగా చూడకూడదు. ఏది ఏమైనా ఈ భావన మనకు ఒక మంచి ఆలోచనను మాత్రం నేర్పుతుంది. మన బంధాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఈరోజు ఒకరితో ఎలా ప్రవర్తిస్తున్నామో అది కేవలం ఈ రోజుతో ముగిసిపోవచ్చు. కానీ దాని ప్రభావం ముందు మళ్ళీ మనకు ఎదురు రావచ్చు.
(03:34) ఒక తండ్రి తన కొడుకును ప్రేమతో పెంచుతాడు. అతని కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. ఒక తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్నే అంకితం చేస్తుంది. ఒక స్నేహితుడు మనకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తాడు. ఒక అపరిచితుడు మనం పడిపోయినప్పుడు చెయ్యి అందిస్తాడు. ఈ ఉపకారాలన్నిటికీ కేవలం అతను మంచి మనిషి అని మాత్రమే చూడకుండా మన జీవితంలో ఏర్పడే అనుబంధాలుగా కూడా చూడవచ్చు.
(03:58) అదేవిధంగా మనం ఇతరులకు చేసిన అన్యాయం కూడా ఒక బంధాన్ని సృష్టించవచ్చు. ఒక వ్యక్తిని మోసం చేశం. ఒకరి నమ్మకాన్ని ఒమ్ము చేశం. ఎవరినైనా అనవసరంగా బాధించాం. మనవల్ల ఎవరో కన్నీరు పెట్టుకున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ చర్యలకు ఫలితం ఉండవచ్చు. కానీ రుణానుబంధం భావనలో అయితే ఈ అసంపూర్ణ బంధాలు భవిష్యత్తులో ఏదో రూపంలో మళ్ళీ మన జీవితాన్ని తాకవచ్చని భావిస్తారు. అందుకే కొందరు ఇలా అంటారు.
(04:20) కొన్ని బంధాలు ప్రేమతో కలుస్తాయి. కొన్ని బంధాలు బాధ్యతతో కలుస్తాయి. కొన్ని బంధాలు తీర్చుకోలేని రుణంతో కలుస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి కష్టమైన బంధాన్ని మనం పూర్వజన్మ రుణం అని అనుకోవడం సరైనది కాదు. ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతుంటే అతనితో గతంలో ఏదో సంబంధం ఉందని ఊహించి ఆ బాధను సహించవలసిన అవసరం లేదు.
(04:43) ధర్మం అంటే అన్యాయాన్ని సహించడం కాదు. ఎవరైనా మనపై హింస చేస్తుంటే మనం దాన్ని రుణానుబంధం అని చెప్పుకొని మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. అవసరమైనప్పుడు దూరంగా వెళ్ళడం, సహాయం కోరడం, అన్యాయాన్ని అడ్డుకోవడం కూడా ధర్మం. రుణానుబంధ భావన యొక్క అసలు ఉద్దేశం మనిషిని బంధంలో బానిసగా మార్చడం కాదు. మన సంబంధాలలో బాధ్యత కృతజ్ఞత కరుణను పెంచడం ఇప్పుడు తల్లిదండ్రులు మరియు పిల్లల విషయానికి వస్తే కొన్ని ధార్మిక భావనాల ప్రకారం తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య బంధం కూడా ఒక లోతైన రుణానుబంధంగా భావించబడుతుంది.
(05:14) పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమ, సంరక్షణ, విద్య, ఆహారం జీవితాన్ని పొందుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. ఈ బంధంలో పరస్పర బాధ్యత ఉంటుంది. కానీ దీనిని పిల్లలు తల్లిదండ్రుల పాపాలన్నిటిని తీర్చడానికి పుడతారు అని అర్థం చేసుకోవడం సరైన విషయం కాదు. తల్లిదండ్రుల కర్మకు తల్లిదండ్రులే బాధ్యులు.
(05:34) పిల్లల కర్మకు పిల్లలే బాధ్యులు. అయితే ఒక కుటుంబంలో ఒకరి చర్యల వల్ల మరొకరి జీవితం ప్రభావితం చేయవచ్చు. అందుకే రుణానుబంధాన్ని అర్థం చేసుకోవడం అంటే కర్మ బదిలి అనే భావన కంటే బంధం మరియు బాధ్యత అనే కోణంలో చూడడం మరింత అర్థవంతంగా ఉంటుంది. మన జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని చూసి ఇతను నాకు ఏ రుణం తీర్చడానికి వచ్చాడు అని అనుకోవడం కంటే ఈ వ్యక్తితో నేను ఎలా ధర్మంగా ప్రవర్తించాలి అని మనల్ని మనం అడగడం మంచిది.
(05:59) ఎవరైనా మనకు సహాయం చేశారా కృతజ్ఞత చూపుదాం. ఎవరైనా మనపై ఆధారపడి ఉన్నారా మన బాధ్యతను నెరవేరుద్దాం. మనవల్ల ఎవరైనా బాధపడ్డారా సాధ్యమైతే క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకుందాం. ఎవరైనా మనల్ని బాధిస్తున్నారా ధర్మబద్ధంగా మనల్ని మనం రక్షించుకుందాం. ఇదే రుణానుబంధ భావనను ఆధ్యాత్మిక దృష్టితో చూడడం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి.
(06:19) మన జీవితంలోకి వచ్చిన ప్రతి మనిషి ఎందుకు వచ్చాడో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. అది గత జన్మ కర్మనా ఈ జన్మలోని పరిస్థితులా మన నిర్ణయాల ఫలితమా లేక కేవలం జీవితంలోని సహజ పరిణామమా అని ప్రతిదానికి మనం ఖచ్చితమైన సమాధానం చెప్పలేం. ఒక విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది మనతో ఉన్న మనుషులతో మనం ఎలా ప్రవర్తించాలి అనేది మన చేతిలో ఉన్నంతవరకు ప్రేమను ఇవ్వాలి.
(06:42) చేతనైనంత సహాయం చేయాలి. అన్యాయం చేయకూడదు. ఎవరిని అనవసరంగా బాధించకూడదు. ఎవరైనా మనకు చేసిన మంచిని మర్చిపోకూడదు. ఎవరైనా మనవల్ల బాధపడి ఉంటే అహంకారంతో దాన్ని సమర్ధించకుండా తప్పును అంగీకరించాలి. ఎందుకంటే రుణానుబంధం నిజమా కాదా అన్న ప్రశ్న కంటే మన చేతుల మీద కొత్త రుణాలు కొత్త బాధలు కొత్త అన్యాయాలు ఏర్పడకుండా జీవించడం మరింత ముఖ్యమైనది.
(07:05) అందుకే మన జీవితంలోకి వచ్చే ప్రతి బంధాన్ని ఒక భారంగా చూడకండి. కొన్ని బంధాలు మనకు ప్రేమను నేర్పిస్తాయి. కొన్ని బంధాలు బాధ్యతను నేర్పిస్తాయి. కొన్ని బంధాలు మన తప్పులను చూపిస్తాయి. కొన్ని బంధాలు మనలోని కరణను మేల్కొలుపుతాయి. కొన్ని బంధాలు మనల్ని మనమే మార్చుకునేలా చేస్తాయి. ఇదే రుణానుబంధం అనే భావనలో దాగి ఉన్న అధ్యాత్మిక సందేశం.
(07:25) మనకు ఎవరి మీద ఏ రుణం ఉందో తెలియలేకపోవచ్చు. కానీ మనవల్ల మరొకరిపై కొత్త రుణం పడకుండా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అదే నిజమైన కర్మజ్ఞానం అదే ధర్మం. మరి కర్మ ప్రభావం నుండి ఉపసమనం ఎలా పొందాలి? ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. కర్మ ఫలితం తప్పదా? గతంలో చేసిన కర్మల ప్రభావం నుండి మనిషికి ఎప్పటికీ విముక్తి లేదా? సనాతన ధర్మం దృష్టిలో సమాధానం అంత నిరాశనకంగా లేదు.
(07:48) మన గత కర్మలన్నిటిని మనం మార్చలేకపోవచ్చు. అప్పటికే జరిగిన కొన్ని సంఘటనలను వెనక్కి తీసుకురాలేము. కానీ ఈ క్షణం నుంచి మనం ఎలా జీవించాలో మాత్రం మార్చుకోవచ్చు. అందుకే కర్మ గురించి తెలుసుకున్న తర్వాత భయపడడం కంటే మన జీవన విధానాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. మొదటిది పశ్చాత్తాపం. మనవల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే నేను తప్పు చేయలేదు అని సమర్ధించుకోవడం కాదు.
(08:09) మన తప్పును నిజాయితిగా గుర్తించడం మొదటి అడుగు. చేసిన తప్పు కోసం హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడాలి. రెండవది తప్పును సరిదిద్దే ప్రయత్నం. ఎవరినైనా బాధ పెట్టామా సాధ్యమైతే క్షమాపణ చెప్పాలి. ఎవరికైనా నష్టం చేశమా సాధ్యమైనంతవరకు ఆ నష్టాన్ని పూర్చాలి. కేవలం క్షమించు అని చెప్పడం మాత్రమే కాదు మళ్ళీ అదే తప్పు చేయకుండా మన ప్రవర్తనను మార్చుకోవాలి.
(08:29) మూడవది సత్కర్య మన జీవితంలో మంచి పనులను పెంచుకోవాలి. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం మనకు చేతనైనంత వరకు ఇతరులకు మేలు చేయడం ఇవన్నీ మన జీవితాన్ని ధర్మం వైపు నడిపించే మార్గాలు. నాలుగవది దానం మరియు సేవ దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు మన సమయం, మన శ్రమ, మన జ్ఞానం, మన ప్రేమ. ఇవి కూడా దానమే.
(08:56) మనవల్ల మరొకరి జీవితంలో కొంత వెలుగు వచ్చినప్పుడు మనలోని స్వార్థం తగ్గుతుంది. ఐదవది శివభక్తి మరియు ఆత్మ పరిశీలన. శివుడిని ప్రార్థించడం అంటే కేవలం నా కష్టాలను తొలగించు అని అడగడం మాత్రమే కాదు ఓ శివ నా తప్పులను గుర్తించే జ్ఞానం నీవు వాటిని సరిదిద్దే ధైర్యం నీవు ధర్మం వైపు నడిచే బుద్ధి నీవు అని ప్రార్థించడం. ప్రతిరోజు కొంత సమయం నిశబ్దంగా కూర్చొని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.
(09:20) ఈరోజు నేను ఎవరినైనా బాధించానా నా మాట వల్ల ఎవరికైనా కన్నీళ్లు వచ్చాయా నాకు చేతనైన సహాయం చేయకుండా నేను వెనక్కి తగ్గానా నా అహంకారం వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అని ఇలాంటి ప్రశ్నలు మనలో మార్పును తీసుకువస్తాయి. ఆరవది క్షమ మనల్ని బాధించిన వారిని క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్ధించడం కాదు మన హృదయంలోని ద్వేషాన్ని మోస్తూ మనం బాధపడకుండా ఉండడానికి క్షమ ఒక మార్గం అయితే అన్యాయం కొనసాగుతున్నప్పుడు దాన్ని సహించడం క్షమ కాదు అవసరమైనప్పుడు ధర్మబద్ధంగా మనల్ని మనం రక్షించుకోవాలి.
(09:49) ఏడవది ప్రస్తుతం మనం ధర్మబద్ధంగా జీవించడం. గతంలో ఏం జరిగిందో మనం మార్చలేకపోవచ్చు. కానీ ఈరోజు మనం చేసే పని మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే గత కర్మ గురించి భయపడుతూ కూర్చోకండి భవిష్యత్తు కర్మ గురించి భ్రమపడకండి. ఈ క్షణంలోని కర్మను పవిత్రంగా మార్చుకోండి. ఇక్కడే శివుడి ఆజ్ఞ అనే భావనకు ఒక అందమైన అర్థం వస్తుంది.
(10:10) మన జీవితంలోని ప్రతి పరిస్థితిని మనం నియంత్రించలేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో మనం చూపించే వివేకం, కరుణ, ధైర్యం, ధర్మం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి కర్మ ప్రభావం నుంచి ఉపసమనం అంటే ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ధర్మ మార్గంలో నడవాలి. మనలో మార్పు రావడం కూడా ఒక గొప్ప ఉపసమనమే కదా. నిన్న కోపంగా మాట్లాడిన మనిషి ఈరోజు ఓర్పుగా మాట్లాడితే నిన్న స్వార్థంగా జీవించిన మనిషి ఈరోజు సేవ చేయడం ప్రారంభిస్తే నిన్న అన్యాయం చేసిన మనిషి ఈరోజు ధర్మాన్ని ఎంచుకుంటే ఇక అక్కడి నుంచే అతని జీవితం ఒక కొత్త దిశలో నడవడం ప్రారంభిస్తుంది.
(10:42) చివరిగా ఒక విషయం ఎవరైనా జీవితంలో కష్టాలను ఎదుర్కుంటున్నప్పుడు ఇదినే కర్మ అని చెప్పి వారిని మరింత బాధ పెట్టకండి. వారి కర్మ ఏమిటో మనకు తెలియలేకపోవచ్చు. కానీ వారి బాధను తగ్గించడానికి మనం చేసే ప్రయత్నం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే బాధలో ఉన్న వారికి సహాయం చేయండి. తప్పు చేసినప్పుడు ఒప్పుకోండి సాధ్యమైనప్పుడు నష్టాన్ని సరిచేయండి, ద్వేషాన్ని తగ్గించండి, సేవను పెంచండి, ధర్మాన్ని ఎంచుకోండి.
(11:06) ముఖ్యంగా నా కర్మకు నేనే బాధ్యత వహిస్తాను. నా చేతుల వల్ల మరొకరికి అన్యాయం జరగకుండా జీవిస్తాను అనే సంకల్పం చేసుకోండి. బహుశా కర్మ ప్రభావం నుంచి ఉపసమనం పొందే అత్యంత గొప్ప మార్గం ఇదే కావచ్చు. అలాగే తల్లిదండ్రులు చేసిన కర్మకు పిల్లలు కూడా శిక్షలు అనుభవిస్తారు. దీనికి చక్కటి ఉదాహరణ శాంతి పర్వంలోని కర్మబోధ. మహాభారత యుద్ధం ముగిసింది.
(11:28) కురుక్షేత్రం అంతా నిశబ్దంగా మారిపోయింది. కానీ ఆ నిశబ్దం వెనుక వేలాది కుటుంబాల కన్నీళ్లు దాగి ఉన్నాయి. తన సొంత బంధువులు, గురువులు సోదరులు మరణించిన దృశ్యాలను చూసిన యుధిష్టురుడి మనసు తీవ్ర ఆవేదనతో నిండిపోయింది. రాజ్యం తన చేతికి వచ్చిన ఆ రాజ్యాన్ని అనుభవించాలనే కోరిక అతనిలో లేకుండా పోయింది. నావల్లే ఇంత రక్తపాతం జరిగింది. నేను ధర్మాన్ని అనుసరించానా లేక నా చేతుల మీద కూడా ఈ పాపభారం పడిందా? ఒక మనిషి చేసే కర్మకు నిజంగా అతడే బాధ్యుడా లేక దైవం కూడా ఇందులో భాగమా అనే ప్రశ్నలు అతని మనసును వెంటాడసాగాయి.
(12:01) ఆ సమయంలో యుధిష్ఠిరుడు బాణాల శయపై ఉన్న భీష్మ పితామహుడు వద్దకు వెళ్లి తన సందేహాలను అడిగాడు. పితామహ మనిషి కర్మకు తానే కర్త అయితే దైవం పాత్ర ఏమిటి? మనిషి చేసే ప్రతి పని అతని స్వేచ్ఛతోనే జరుగుతుందా లేక మనం చేయబోయే పనులను దైవం ముందుగానే నిర్ణయిస్తుందా? ఒక వ్యక్తి చేసిన పని ఫలితాన్ని అతడే అనుభవిస్తే జీవితంలో మన నియంత్రణకు అందని ఎన్నో సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని యుధిష్టిరుడు ప్రశ్నించాడు.
(12:26) అప్పుడు భీష్మ పితామహుడు మనిషి కర్మ దైవం పురుషార్థం మధ్య దాగి ఉన్న సున్నితమైన సంబంధాన్ని వివరించడం ప్రారంభించాడు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కేవలం దైవం అని చెప్పి మనిషి బాధ్యతను పూర్తిగా తొలగించలేమని అదే సమయంలో మనిషి శక్తితోనే ప్రపంచంలో ప్రతి సంఘటన జరుగుతుందని కూడా చెప్పలేమని ఆయన బోధించాడు. విత్తనం నేలలో పడితే అది మొలకెత్తడానికి విత్తనం మాత్రమే సరిపోదు.
(12:53) నేల, నీరు, సూర్యకాంతి, కాలం వంటి అనేక కారణాలు అవసరం. అదేవిధంగా ఒక కార్యం ఫలించడానికి మనిషి ప్రయత్నం ఒక కారణం అయితే పరిస్థితులు కాలం, దైవిక వ్యవస్థ వంటి అనేక కారణాలు కూడా కలిసి పని చేస్తాయి. అయితే దాని అర్థం దేవుడే అన్ని చేస్తున్నాడు కాబట్టి మనిషి ఏం చేసినా బాధ్యత లేదు అని కాదు. మనిషికి ఆలోచించే శక్తి, మంచి చెడును గుర్తించే వివేకం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇవ్వబడ్డాయి.
(13:16) అందుకే అతని ఉద్దేశం ప్రయత్నం చర్యలకు అతడే బాధ్యత వహించాలి. యుధిష్టుడికి భీష్ముడు చెప్పిన ఈ బోధనలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మన చేతిలో లేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ మన చేతిలో ఉన్న నిర్ణయాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించడం మాత్రం మన బాధ్యత. ఒక మనిషి కోపంతో మరొక మనిషిని బాధించినప్పుడు నన్ను కోపగించింది దైవమే అని చెప్పి తన తప్పును దైవంపై వేయలేడు.
(13:39) అతనికి కోపం వచ్చిన పరిస్థితి అతని చేతిలో లేకపోయినా ఆ కోపంలో ఎలా ప్రవర్తించాలో నిర్ణయించే అవకాశం అతనికి మాత్రమే ఉంది. అదే అతని పురుషార్థం అదే అతని కర్మ అదే అతని బాధ్యత. ఈ బోధన మనకు చెప్పేది ఒక వ్యక్తి చేసిన కర్మకు అతడే ప్రధానకర్త అతడే ఫలితాన్ని అనుభవిస్తాడు. అది పుణ్యమైన పాపమైన అయితే అతని కర్మ వల్ల కుటుంబం పిల్లలు తర్వాతి తరాల జీవితాలపై ప్రభావం పడవచ్చు.
(14:03) ఒక తండ్రి అన్యాయంగా సంపాదిస్తే ఆ సంపదతో కుటుంబం జీవించవచ్చు. కానీ ఆ అన్యాయం బయటపడినప్పుడు కుటుంబం మొత్తం దాని పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక తల్లి ప్రేమతో ధర్మంతో పిల్లలను పెంచితే ఆ విలువలు పిల్లల జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కర్మ బదిలీ కంటే కర్మ ప్రభావం అనే తేడాను మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే శాంతి పర్వంలోని కర్మబోధ.
(14:25) మనకు ఇచ్చే లోతైన సందేశం. దైవాన్ని నమ్మడం అంటే మన బాధ్యతను వదిలేయడం కాదు. కర్మను నమ్మడం అంటే బాధితుడిని నిందించడం కాదు. మనకు వచ్చిన పరిస్థితుల్లో మనం చేసే ఎంపికలే మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ విశ్వంలో జరిగే ప్రతిదానికి ఒక దైవిక వ్యవస్థ ఉందని నమ్మవచ్చు. కానీ ఆ వ్యవస్థలో మనకు ఇచ్చిన వివేకాన్ని ఎలా ఉపయోగించాలో మాత్రం మన బాధ్యత.
(14:48) మనం చేసే ప్రతి పని మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని మన కుటుంబాన్ని మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేయవచ్చు. అందుకే నిజమైన ధర్మం ఏమిటంటే అన్ని దేవుడే చూసుకుంటాడు అంటూ చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు దేవుడు నాకు వివేకం ఇచ్చాడు కాబట్టి నేను ధర్మాన్ని ఎంచుకుంటాను అని జీవించడం యుధిష్టుడి సందేహాలకు భీష్ముడు ఇచ్చిన ఈ బోధన మనకు చివరిగా చెప్పేది ఇదే దైవాన్ని విశ్వసించు కానీ కర్మను నిర్లక్ష్యం చేయకు గతాన్ని మార్చలేకపోయినా ఈ క్షణంలో నువ్వు చేసే నిర్ణయం నీ చేతిలో ఉంది.
(15:17) అదే నీ పురుషార్థం అదే నీ ధర్మం అదే నీ కర్మ అని అందుకే గత కర్మ గురించి భయపడుతూ కూర్చోకండి భవిష్యత్తు కర్మ గురించి భ్రమపడకండి ఈ క్షణంలోని కర్మను పవిత్రంగా మార్చుకోండి ఓం నమఃశివాయ

No comments:

Post a Comment