పెళ్లి లేని రోజుల్లో... కాపురాలు ఇలాగే జరిగేవి!! | Human Evolution | Out of Coverage
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3A67-Ju6Y7I
Transcript:
(00:00) మనిషి మాట్లాడడానికి తన ఒపీనియన్ కూడా చెప్పడానికి ఇబ్బంది పడే అంశం ఏదైనా ఉందంటే అది శృంగారం. దాన్ని మించిన ఇబ్బందికరమైన టాపిక్ మరేదీ లేదు. చాలా మంది ఈ టాపిక్ వైపు చూడడానికి కూడా ధైర్యం చేయరు. అలాంటి టాపిక్ ను ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి మన పూర్వీకుల లవ్ స్టోరీ ఎలా ఉండేది ఎవరు ఎవరితో లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు.
(00:24) నాటి జంగిల్ ప్రేమ్ కహానీ ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో చూద్దాం. భూమ్మీద తొలి మనిషి జాతి పుట్టి 70 లక్షల ఏళ్ళు మన పూర్వీకులైన హోమోసేపియన్స్ ఆవిర్భవించి సుమారు 75వేల ఏళ్ళు మరి పెళ్లి వ్యవస్థ ఎప్పుడు పుట్టిందో తెలుసా నిన్న గాక మొన్న 4వేల ఏళ్ల కిందటనే మరి అంతకుముందు 70వేల ఏళ్ల పాటు ఆడ మగ రిలేషన్ ఎలా ఉండేది సంతానాన్ని ఎలా ప్రొడ్యూస్ చేశారు ఎవరెవరి మధ్య ఆ బంధం ఉండేది ఇంత పెద్ద టాపిక్ డిస్కస్ చేయాలంటే నమ్మక కాలు ఊహలు అంచనాలు ఏమాత్రం పనికిరావు ఆధారాలు కావాలి రీసెర్చ్డ్ ఎవిడెన్స్ కావాలి అలాంటి ఇన్ఫర్మేషన్ తోనే ఈ విషయంలోకి
(01:08) ప్రవేశిద్దాం. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ దాటొద్దు అన్నది ఒక రూల్ కరెంట్ తీగను ముట్టుకోవద్దు అనేది ఇంకో రూల్ ఒక చెట్టు ఆకును టచ్ చేయొద్దని ఇంకో చెట్టు పండుకుని తినొద్దు అనేది మరొక రూల్. ఏ విషయంలోనైనా సరే ఒక పని చేయొద్దు అని రూల్ పెట్టారు అంటే దాని అర్థం అది తప్పు అని అది చేయకూడదని చేస్తే ఏదో నష్టం జరుగుతుందని అర్థం ఇక్కడే మైండ్ బ్లోయింగ్ విషయం కూడా ఉంటుంది.
(01:37) ఫలానా పని చేయొద్దని రూల్ పెట్టారంటే అంతకుముందు అది చేశారని అర్థం. అది చేయడం వల్ల నష్టం జరుగుతుందని గుర్తించారని అర్థం. కాబట్టే దాన్ని చేయొద్దని రూల్ పాస్ చేశారని అర్థం. దీన్ని ఇప్పుడు మనుషుల లైంగిక జీవితానికి అప్లై చేయండి ఇవాళ రక్త సంబంధీకుల మధ్య పెళ్లిళ్లు నిషేధం ఒకే కుటుంబంలోని వారు పెళ్లి చేసుకోవద్దు అంటున్నారంటే దాని వల్ల ఏదో నష్టం జరుగుతుందని అర్థం నష్టం జరుగుతోందని గుర్తించారంటే అంతకుముందు దాన్ని చేశారు అని అర్థం సుమారు 45 వేల ఏళ్ల క్రితం నాటి హోమోసేపియన్స్ ఈ తప్పును గుర్తించారు.
(02:14) మరి అంతకుముందు లక్షల ఏళ్లుగా పరిణామం చెందుతూ వచ్చిన 23 రకాల మానవజాతులన్నీ ఇన్ బ్రీడింగ్ కొనసాగించాయి. రక్త సంబంధికుల మధ్య ఆ రిలేషన్ ఉండేది అందులో ఎలాంటి సందేహం లేదు మన పూర్వీకులైన హోమో సేపియన్స్ కాలంలోనే జీవించిన నియాన్ ఎర్థస్ డెని సోవన్స్ అనే మానవజాతులు కూడా ఈ పని చేసాయి. 2013 లో కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రసిద్ధ జన్య శాస్త్రవేత్త మార్ట్ గోమరి స్లాట్కిన్ బృందం సైబీరియాలో లభించిన 50 వేల ఏళ్ల నాటి ఒక నియాన్తల్ మహిళ డిఎన్ఏ ను విశ్లేషిస్తే సంచలన విషయం బయటపడింది ఆమె తీవ్రమైన ఇన్ బ్రీడింగ్ వలనే పుట్టిందని తేలింది అంటే ఆమె
(02:52) పుట్టుకకు రక్త సంబంధీకులే కారణం అని తేల్చారు మరి ఎందుకు నాటి మనుషులు ఇలా ఉండేవారు అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు మనకు దీనికి సమాధానం ఇప్పటి మన మైండ్ సెట్ తో వెతకూడదు ఇలాంటి పని తప్పు అనే సమాజంలో మనం పుట్టాం. ఆ దృష్టితోనే పెరిగాం కాబట్టి వారిని ఒక ఏవగింపుతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సబ్జెక్టును వారి పరిస్థితుల్లో నుంచి చూస్తేనే నాటి సమాజం తీరు అర్థమవుతుంది.
(03:19) ఇప్పటి మనిషి నేను జంతువును కాదు అంటాడు కానీ అప్పటి మనిషి అడవుల్లో తిరిగే అన్ని జంతువుల్లో వాడు కూడా ఒకడు అంతే అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు ఇది నెంబర్ వన్ అప్పుడు మనుషుల సంఖ్య చాలా తక్కువ ఇది నెంబర్ టూ ఉన్న కొద్దిమంది కూడా ఒకే చోట కలిసి ఉండేవారు కాదు వేరు వేరు ప్రాంతాల్లో చిన్న చిన్న గుంపులుగా నివసించేవారు ఇది నెంబర్ త్రీ ప్రకృతి ప్రకారం మనిషికి ఆకలి అయినప్పుడు తినడం దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం అత్యంత సహజమైన విషయాలు ఇదే విధంగా ఆడ మగ కలయక అనేది కూడా ఒక ఆకలి అంతే ఆ ఆకలి వేసినప్పుడు ఆ సమూహంలో ఉండే వారితోనే
(03:58) కలిసేవారు. శృంగారం అనేది ప్రకృతి ధర్మం ఈ సృష్టి కొనసాగడానికి నేచర్ పెట్టిన నియమం అది అన్ని జంతువులు దీన్ని కొనసాగిస్తాయి వాటిలాగే మనిషి కూడా చేశాడు లక్షల ఏళ్ల పాటు ఇదే కొనసాగిస్తూ వచ్చాడు కానీ ఎప్పుడైతే కాల్చిన ఉడికించిన ఆహారం తినడం మొదలుపెట్టాడో బ్రెయిన్ సైజు దాని పని విధానం ఊహించని విధంగా వేగంగా పెరుగుతూ వచ్చింది.
(04:25) దాంతో మనిషి రేషనల్ థింకింగ్ చేయడం మొదలు పెట్టాడు. తాను అనుకున్న దానికి ఏదైనా తేడాగా జరిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించి పరిష్కారం కనుగొనడం మొదలు పెట్టాడు. ఈ ఆలోచన విధానంతోనే రక్త సంబంధీకుల కలయిక వల్ల ఏదో తప్పు జరుగుతుందని గుర్తించాడు. తల్లి నుంచి తండ్రి నుంచి 23 క్రోమోజోమ్స్ చొప్పున కలిస్తే ఒక బిడ్డ పుడుతుంది. ఇందులో డామినెంట్ జీన్స్, రెసిసివ్ జీన్స్ అని రెండు ఉంటాయి.
(04:51) డామినెంట్ అంటే బలమైనది. రెసిసివ్ అంటే బలహీనమైనది. ప్రతి మనిషి శరీరంలోనూ ఇవి రెండు ఉంటాయి. అయితే మనం ఎవరితో కలిసి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నామో వారిలో డామినెంట్ జీన్స్ కనీసం ఒక్కటైనా ఉండాలి. అప్పుడు అది రసం మీద ఆధిపత్యం చెలాయించి దాన్ని అనిచేస్తుంది. అలా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు. కానీ ఎప్పుడైతే ఇద్దరిలోనూ డామినెంట్ జీన్స్ లేకుండా రెసిసివ్ జీన్స్ మాత్రమే ఉంటాయో వారికి పుట్టే పిల్లలు కాళ్ళు చేతులు వంగిపోవడం ముక్కు మూతి వంకరగా రావడం లేదంటే తీవ్రమైన వ్యాధితో పుడతారు.
(05:26) లక్షల ఏళ్ల పాటు ఒకే గుంపులని వారు తమలో తామే పిల్లలను కనడం వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తడం మొదలు పెట్టింది. పుట్టే బిడ్డలు తీవ్రమైన వైకల్యంతో పుడుతూ వచ్చారు. అదే సమయంలో వేరే గుంపులోని వారితో సంతానం కలిగినప్పుడు మునుపెన్నడు లేనంత ఆరోగ్యంగా బలంగా పిల్లలు పుట్టడాన్ని గుర్తించారు. ఓహో అంటే ఒకే గుంపులో ఉండేవారి పిల్లల్ని కనడం వల్లనే ఈ పరిస్థితి వస్తుందన్నమాట అని అర్థం చేసుకున్నాడు నాటి మనిషి.
(05:53) ఒకే కార్బన్ పేపర్ తో మళ్ళీ మళ్ళీ మళ్ళీ జిరాక్స్ తీస్తూ వెళ్తే ఏమవుతుందో మనకు తెలిసిందే. రాను రాను క్వాలిటీ తగ్గిపోద్ది. ఇది మనిషికి అర్థమైంది సుమారు 40 వేల ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని 2018 లో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రసిద్ధ హ్యూమన్ సైంటిస్ట్ ఎరిక్ రింకాస్ బయట పెట్టారు. అలా మనుషులు బుద్ధి తెచ్చుకున్నారని 2017 నాటి సంఘీ పరిశోధన తీర్చి చెప్పింది.
(06:21) రష్యా లోని సంఘీర్ ప్రాంతంలో దొరికిన 34 వేల ఏళ్ల నాటి నలుగురు హోమో సేపియన్స్ DNA ను పరీక్షిస్తే వారిలో ఎలాంటి ఇన్ బ్రీడింగ్ జరగలేదని తేలింది. ఆ విధంగా మన పూర్వీకులు రక్త సంబంధీకులు ఒక జంటగా ఉండొద్దు అని నిర్ణయించారు. ఈ పని చేయకపోవడం వల్లనే నియాన్ డెప్తస్ డెని సోవాన్స్ వంటి మానవజాతులు అంతమైపోయాయనే బలమైన వాదన కూడా ఉంది.
(06:45) ఇక్కడి వరకు ఒక టాపిక్ క్లియర్ గా తేలిపోయింది. రక్త సంబంధీకుల చాప్టర్ ముగిసింది. మరి పెళ్లి వ్యవస్థ పుట్టింది 4000 ఏళ్ల కిందటనే ఇన్ బ్రీడింగ్ వల్ల నష్టం జరుగుతుందని గుర్తించింది మాత్రం 40 వేల ఏళ్ల క్రితమే మరి ఈ గ్యాప్ లో ఆడమగ సంబంధాలు ఎలా ఉండేవి ఎవరు ఎవరితో కలిసి ఉండేవారు ఒకరికి ఒకరే అనే నియమం ఉండేదా జంతు లక్షణాలు పూర్తిగా మాయం కానీ ఆ రోజుల్లో జంతువుల తీరుగానే వ్యవహరించేవారా అనేది ఇప్పుడు చూద్దాం.
(07:13) ఇది క్లియర్ గా అర్థం కావాలంటే మళ్ళీ సైన్స్ వైపు నుంచే ఆరంభించాలి. దీనికి సైంటిస్టులు ఆసక్తికరమైన విషయం కనుగొన్నారు. అదే టెస్టిక్యులర్ సైజ్ దీని ప్రకారం పురుషుల శరీర నిర్మాణం స్వేచ్ఛ సంపర్కం జరిగే ఇతర జంతువులకు దగ్గరగా ఉంటుందని తేల్చారు. దీని అర్థం ఏంటంటే జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు జీవితాంతం కేవలం ఒక్కరితోనే శృంగారం జరిపే విధంగా మనిషి శరీరం డిజైన్ కాలేదు అని.
(07:41) అంటే ఎందరితోనైనా ఎఫ్ఐర్ పెట్టుకునేలా మనిషి బాడీ ఉందని తీర్చారు. ఇది ఎలా కనుగొన్నారు అంటే పరిణామంలో జరిగిన మార్పుల ఆధారంగా గుర్తించారు. ఒక పురుషజీవి వృషణాలు దాని మొత్తం శరీరంలో ఎంత సైజులో ఉంటాయో అది దాని మేటింగ్ కెపాసిటీని తెలియజేస్తుంది. ఇందుకోసం మనిషికి దగ్గరగా ఉండే చింపాంజీలు గొరిల్లాలను సైంటిస్టులు పరిశీలించారు. గొరిల్లా శరీర ఆకారం చాలా పెద్దది.
(08:06) కానీ దాని శరీరం సైజు తో పోలిస్తే దాని వృషణాలు కేవలం 0.02% మాత్రమే ఉంటాయి. అదే చింపాంజీల్లో చూస్తే దాని శరీర బరువులో వృషణాలు ఏకంగా 0.3% ఉంటాయి. ఇక మనిషి విషయానికి వస్తే ఇదే సైజు 0.08% 08% గా ఉంది. ఈ పరిశోధన కీలక విషయాలను వెలడించింది. గొరిల్లా దాదాపు 200 kgీల వరకు బరువు ఉంటుంది. చింపాంజీ 50 నుంచి 60 మాత్రమే మనిషి సగటు 80 నుంచి 90 kgీల బరువు ఉంటాడు.
(08:39) మరి అంత బరువున్న గొరిల్లా వృష్ణాలు ఎందుకు చింపాంజీ కన్నా మనిషి కన్నా తక్కువగా ఉన్నాయి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే గొరిల్లా గుంపు మొత్తంలో ఒకే ఒక మొగ గొరిల్లా ఉంటుంది. దాన్ని సిల్వర్ బ్యాక్ అంటారు. ఆ గుంపులో ఉన్న ఆడ గొరిల్లాలఅన్నీ దానికి మాత్రమే సొంతం వేరే మగ గొరిల్లాకు అక్కడ ప్రవేశం లేదు అంటే ఆ గుంపులో మగదానికి పోటీ లేదు కాబట్టి అది నిశ్చింతగా కూల్ గా కాపురం చేసుకోవచ్చు కానీ చింపాంజీల లెక్క పూర్తిగా వేరు వీటి సమాజంలో లైంగిక నియంత్రణ ఉండదు.
(09:14) ఒక ఆర చింపాంజీ కొన్ని గంటల గ్యాప్ లోనే ఐదారు మగ చింపాంజీలతో సంపర్కం జరుపుతుంది. ఇలా రోజు కొత్త వాటితో కలియక జరుగుతూ ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంటుంది జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి. ఇలా లెక్కకు మించిన మగవాడితో సంపర్కం జరిగినప్పుడు పుట్టబోయే బిడ్డ దేనిది అవుతుంది ఇది కీలకమైన పాయింట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆరచింపాంజి గర్భాశయంలో స్పెర్మ్ కాంపిటీషన్ జరుగుతుంది అంటే వీర్యకణాల మధ్య పోటీ జరుగుతుంది.
(09:42) బలమైన వీర్యకణాలు బలహీనమైన వాటిని డామినేట్ చేస్తాయి. వాటిని పక్కకు నెట్టేసి అండాన్ని చేరుకొని ఫలదీకరణం చెందిస్తాయి. ఇది ఎవరి స్పెర్మ్ అవుతుందో పుట్టబోయే బిడ్డకు తండ్రి అదే అవుతుంది. ఇదే సూత్రం మనుషులకు కూడా అప్లై అవుతుంది. ఒక్కరితోనే శృంగారం జరిపే విధంగా మనిషి శరీరం డిజైన్ కాలేదని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ విషయం సైన్స్ కూడా చెప్పాల్సిన పని లేదు.
(10:04) ఒకరికన్నా ఎక్కువ మందితో ఎఫైర్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నారు. రోజు చూస్తూనే ఉంటాం. ఇలా ఒక స్త్రీ ఒకరికన్నా ఎక్కువ మందితో కలిసినప్పుడు పుట్టబోయే బిడ్డ ఎవరిది అనే ప్రశ్న ఇక్కడ కూడా వస్తుంది. ఇవాళ అంటే Dఎన్ఏ టెస్ట్ తో ఎవరి బిడ్డ ఎవరో తెలిచేయొచ్చు కానీ అప్పటి రోజుల్లో ఇది ఏ మొగాడికి తెలిసే ఛాన్సే లేదు. అయితే బయాలాజికల్లీ శరీరానికి చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి.
(10:30) ఈ క్రమంలోనే మనిషి శరీరంలో ఒక మార్పు జరుగుతూ వచ్చింది. ఇతరుల వీరయ్య కణాలను డామినేట్ చేయాలంటే వాటిపై యుద్ధం చేయాలి అంటే బలమైన వాటిని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు ఆ సైన్యాన్ని సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సంఖ్య పెరగడం కోసమే పురుషుడి వృషణాల సైజు పెరుగుతూ వచ్చిందని సైంటిస్టులు తేల్చారు. ఇది మాత్రమే కాదు మరో మెయిన్ పాయింట్ కూడా కనుగొన్నారు.
(10:52) జీవితాంతం ఒక్కరితోనే జతకట్టే జీవులు సైజులో సేమ్ ఉంటాయి. ఉదాహరణకు రెండు పావురాలు చూడండి మగా ఆడ సేమ్ ఉంటాయి. ఇదేవిధంగా పెండ్లు కూడా సేమ్ ఆకారంలో ఉంటాయి. వీటిని మోనోగామి అనిమల్స్ అంటారు. ఇక ఒకరికన్నా ఎక్కువ మందితో జతకట్టే జీవులు సైజులో ఆడవాటికన్నా మగవి కాస్త ఎక్కువ సైజులో ఉంటాయి. ఉదాహరణకు మనుషులు, కోళ్ళు, సింహాలు, వగైరా వీటిలో ఆడ జీవుల కన్నా మగవి కాస్త పెద్ద సైజులో ఉంటాయి.
(11:22) వీటిని పాలిజీని అనిమల్స్ అంటారు. నాటి పురుషుడు పరిస్థితి ఇలా ఉండేది. మరి స్త్రీ పరిస్థితి ఎలా ఉండేది వారు ఎవరిని కోరుకునేవారు అంటే ఇక్కడ బయాలజికల్లీ మాత్రమే కాదు సోషల్ గా కూడా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఇవి రెండిటిని కలిపి నాటి మహిళలు ఎవరితో కలవాలనేది డెసిషన్ తీసుకునేవారు. ఇవాళ స్త్రీలు మగాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే హ్యాండ్సమ్ బిహేవియర్ ఎత్తు, రంగు, శాలరీ ఇలా ఎన్నో లెక్కలేనన్ని విషయాలు చూస్తారు.
(11:51) కానీ నాటి మహిళలు మగవాడిలో ఎక్కువ శాతంగా కేవలం రెండే విషయాలు చూసేవారు. వాడు ఆకర్షణీయంగా ఉన్నాడా లేదా అనేది ఒకటైతే వాడు కండలు తిరిగిన దేహంతో ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది రెండోది. ఇవాళ పెళ్లి ఉంది కాబట్టి పిల్లల విషయంలో భార్య భర్త ఇద్దరి రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ కానీ అప్పుడు పిల్లల బాధ్యత మెజారిటీగా తల్లిదే అలాంటి సమాజంలో తనకు పుట్టే పిల్లలు అనారోగ్యంగా పుడితే ఆ కష్టం పిల్లలకు మాత్రమే కాదు తల్లికి కూడా అందుకే బలమైన పిల్లలు కావాలని కోరుకునేవాళ్ళు దీంతో పాటు మరో కారణం ఏంటంటే బలమైన దేహం ఉండి ఆరడుగుల ఆజానుబాహుడిగా ఉన్నవాడు తప్పకుండా రోజు
(12:31) వేటాడగలడు. మంచి తిండి తెచ్చి తనకు తన పిల్లలకు పెట్టగలడు. ఈ రెండు కారణాలతో అత్యంత బలమైన బాహువులు కలిగిన వాళ్ళనే ఆడవాళ్ళు కోరుకునేవాళ్ళు ఎంచుకునేవాళ్ళు వాడే ఆల్ఫా మేల్ సందీప్ బోంగా డైరెక్ట్ చేసిన యనిమల్ సినిమాలో ఈ ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి ఆల్ఫా మేల్స్ను ఆడవాళ్ళు కోరుకుంటే మేలైన ఆడవాళ్ళను తమకన్నా వయసులో కాస్త తక్కువగా ఉన్న ఆడవాళ్ళను మగవాళ్ళు కోరుకునేవారు.
(12:59) సన్నటి నడుము బిగ్ పెల్విస్ ఉండేవారని ఎక్కువగా కోరుకునేవారు. ఇలాంటి వారు ఎక్కువ మంది పిల్లలను కనగలరని నమ్మేవారు. ఇలాంటి దేహ సౌష్టవం ఉన్నవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు బాగుంటాయని వారు సులభంగా పిల్లలను కనగలరని సైన్స్ కూడా చెప్తోంది. దీనితో పాటు మరో కీలకమైన విషయం నమ్మకం నమ్మకంగా ఉండే ఆడవాళ్లనే మగాళ్ళు ఎక్కువగా ఇష్టపడేవారు దీని కారణం పిల్లలు తన వల్లే పుట్టారా లేదా అనేది మగవాడికి ఎప్పటికీ తెలిసేది కాదు కాబట్టి తనను మోసం చేయకుండా ఉండే స్త్రీలను మగాళ్ళు ఎక్కువగా కోరుకునేవారు ఇలా ఎవరి ఇష్టాలు వారివి ఎవరి కోరికలు వారివి ఎవరి అవసరాలు వారివి ఇలా బాగానే సాగిపోతున్న
(13:37) మానవ సమూహంలోకి మనిషి జీవితంలోకి పెళ్లి అనేది ఎలా వచ్చి చేరింది ఒకరికి ఒకరే ఉండాలనే అవసరం గన పరిస్థితి గాన లక్షల ఏళ్లలో మనిషికి ఏనాడు కలగలేదు. అలాంటిది 4వేల ఏళ్ల క్రితం అంత అవసరమే వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా కష్టంలో వాల్యూ ఉందనిపిస్తే ఒక కామెంట్ తో బూస్ట్ ఇవ్వండి.
(14:01) అవుట్ ఆఫ్ కవరేజ్ ఛానల్ లోని ఆసక్తికర వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయండి. సెలవు
No comments:
Post a Comment