Friday, November 6, 2026

🐦‍🔥నరకానికి ఒక Marketing Problem ఉంది. "ఇది నరకం. ఇక్కడ కాలుతుంది. ఇక్కడ ఏడుస్తారు." అని board పెడితే, అక్కడికి ఎవడూ వెళ్లడు.




PRATIKULA VEDAM
3 hours ago
🐦‍🔥నరకానికి ఒక Marketing Problem ఉంది. "ఇది నరకం. ఇక్కడ కాలుతుంది. ఇక్కడ ఏడుస్తారు." అని board పెడితే, అక్కడికి ఎవడూ వెళ్లడు.

అందుకే దానికి పూలబాట వేసి, దానికి ప్రేమ, పెళ్లి, Romance అని ముద్దు పేర్లు పెట్టడం జరిగింది. ఒకసారి ప్రశాంతంగా కూర్చుని, మీ జీవితాల్ని, మీ బంధాల్ని అత్యంత నిజాయితీతో పరిశీలించండి.

🤯అసలు ఈ నాటకం అంతా ఎక్కడ మొదలవుతుంది?
మీ లోపల ఒక అంతుపట్టని వెలితి ఉంది. ఒక శూన్యం. "నేను సరిపోను, నాకు ఏదో తక్కువైంది, నేను ఒంటరిని" అనే ఒక అకారణమైన భయం. పుట్టినప్పటి నుండి చచ్చేదాకా మనిషిని వెంటాడే ఏకైక మానసిక జబ్బు ఇది. ఈ జబ్బుకి మీరేం చేస్తారు? ఆ లోపల ఉన్న శూన్యాన్ని face చేయడానికి వణికిపోయి, దాని నుండి పారిపోవడానికి Market లోకి పరుగెడతారు. బట్టలు కొంటారు, కార్లు కొంటారు, Bank balance పెంచుకుంటారు. కానీ ఆ వస్తువులు ఎన్ని వచ్చినా, ఆ వెలితి అలాగే ఉంటుంది. అప్పుడు ఈ సమాజం మీకు ఒక Ultimate Product ని అమ్ముతుంది. దాని పేరే Relationship. "నీకు ఒక తోడు కావాలి, నీ ప్రాణానికి ప్రాణమిచ్చే మనిషి దొరికితే నీ జీవితం సంపూర్ణం అవుతుంది" అని మీ బుర్రలోకి ఎక్కిస్తారు. మీ భయానికి అదొక Perfect మందులా కనిపిస్తుంది.

💘ఇప్పుడు మీరు 'ప్రేమ' అని పిలుస్తున్న ఈ వ్యవహారాన్ని Logical గా decode చేద్దాం.
మీరు ఒకరి దగ్గరికి వెళ్లి I love you అని చెప్తున్నారంటే, దాని వెనక ఉన్న అసలు సైకాలజీ ఏంటి? "నా లోపల ఉన్న ఈ శూన్యాన్ని నేను భరించలేకపోతున్నాను. నా భయాన్ని కవర్ చేయడానికి నువ్వు ఒక ముసుగులా కావాలి. నన్ను నేను మర్చిపోవడానికి నువ్వు నాకు కావాలి." ఇది ప్రేమెలా అవుతుంది? ఇది పక్కా ఒక Transaction.


🍚ఒక బిచ్చగాడు, చేతిలో చిప్ప  పట్టుకుని వెళ్తూ, ఇంకో చిప్ప పట్టుకున్న బిచ్చగత్తెను చూసి "మనం ఇద్దరం కలిస్తే కోటీశ్వరులైపోతాం" అనుకున్నట్లు ఉంటుంది ఈ Logic. But ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తులు కలిస్తే, ఒక సంపూర్ణత్వం ఎలా వస్తుంది? రెండు సున్నాలు  కలిస్తే అదింకో పెద్ద బండ సున్నా అవుతుంది తప్ప, 100 ఎలా అవుతుంది?

💑ఇక పెళ్లి అనే institution ని చూడండి.
ఇదొక Mutual Exploitation Contract. పరస్పర దోపిడీ ఒప్పందం. "నా శారీరక, సామాజిక అవసరాలు నువ్వు తీర్చు.. నీ మానసిక అభద్రతలను నేను మోస్తాను." ఇదే కదా పెళ్లి అంటే? ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు వాడేసుకోడానికి రాసుకున్న ఒక Agreement కి, రెండు పూల దండలు మార్చి, మంత్రాలు చదివి, "పవిత్ర బంధం" అని ఒక Tag తగిలిస్తాం. మీకు కావాల్సింది ఒక జీవిత భాగస్వామి కాదు, మీ నొప్పిని మర్చిపోవడానికి వేస్కునే ఒక Tablet.

💊కానీ ఆ Tablet పని చేయనప్పుడు, Sex ని ఆశ్రయిస్తారు. మీ జీవితంలో, మీ బుర్రలో ఎప్పుడూ ఒకటే గోల. గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం. ఆ బుర్ర ఎప్పుడూ వాగుతూనే ఉంటుంది. కానీ ఆ Sex జరిగే కొద్ది నిమిషాలు మాత్రం, ఆ బుర్ర ఆలోచించడం ఆపేస్తుంది. "నేను" అనే వాడు కాసేపు మాయమైపోతాడు. కేవలం శరీరం మాత్రమే Active గా ఉంటుంది. ఆ క్షణంలో ఉండే ఆ నిశ్శబ్దాన్ని, ఆ Relief ని మీరు 'సుఖం' అని భ్రమపడుతున్నారు. కానీ నిజానికి అది సుఖం కాదు, అది Anaesthesia. అంటే మత్తు మందు.

👩🏻‍⚕️🚑Operation Theatreలో మత్తు ఇచ్చినప్పుడు రోగికి నొప్పి తెలియదు. But ఆ మత్తు దిగగానే, రోగం అక్కడే ఉంటుంది, నొప్పి మళ్లీ మొదలవుతుంది. Sex అయిపోయిన వెంటనే ఒక వింతైన ఖాళీతనం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే మీ మత్తు దిగిపోయింది, మీ శూన్యం మళ్ళీ మీ కళ్లముందు నిలబడింది.


🙆🏻‍♂️కాబట్టి నరకం అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న జైలు కాదు. "నా లోపాన్ని, నా ఖాళీతనాన్ని బయట ఉన్న ఇంకొక మనిషి భర్తీ చేసేయగలడు / చేసేయగలదు" అని గుడ్డిగా నమ్మడమే నరకం. ఆ నమ్మకంతో ఒకరి వెంట ఒకరు పరిగెత్తి, వాళ్లని పీడించి, వాళ్ల చేతిలో పీడించబడి, ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ, చివరకు ఇద్దరూ ఏడుస్తూ కూర్చోవడం. Infact ఇదంతా మీ ఇష్టప్రకారమే జరుగుతుంది. So సమాజాన్ని, సినిమాల్ని తిట్టకండి. వాళ్ళు కేవలం Suppliers మాత్రమే. Demand మీ లోపలే ఉంది. ఒకవేళ ఏ సినిమా వాడైనా ఈ నిజాన్ని blunt గ చెప్తే, ఆ సినిమాని మీరే Flop చేస్తారు, ఎందుకంటే మీ భ్రమలని ఎవరైనా బద్దలు కొడితే మీరు తట్టుకోలేరు.

💞మరి నిజమైన ప్రేమ అంటే ఏంటి?
నిజమైన ప్రేమకు అవసరంతో పనిలేదు. ఎవరికైతే ఇంకొక మనిషితో మానసికంగా ఎలాంటి అవసరం లేదో, ఎవరైతే తనలో తాను ఒంటరిగా, ఆనందంగా, సంపూర్ణంగా ఉండగలడో.. వాడు మాత్రమే ప్రేమించగలడు. ఎందుకంటే వాడికి ఎదుటి మనిషి నుండి లాక్కోవడానికి ఏమీ లేదు. వాడు ఎదుటి వారిని ఒక 'వస్తువు' లాగా వాడుకోడు.

కానీ మనం? ఇంకా భయంలోనే ఉన్నాం. ఆ భయాన్ని దాచుకోవడానికి అందమైన పేర్లు పెట్టుకుని ఆడుకుంటున్న ఒక క్రూరమైన ఆట ఇది. ఈ ఆటను మీరు ఎప్పటికీ గెలవలేరు, ఎందుకంటే ఎదుటి వాడిని వాడుకోవాలి అని ఈ ఆట మొదలుపెట్టినప్పుడే మీరు ఓడిపోయారు.

📌ఇక్కడ పాయింట్ ఏంటంటే.. మనిషి తన బలహీనతను గుర్తించకుండా, దానికి అందమైన పేర్లు పెట్టుకుంటాడు.

🤍అభద్రతను ప్రేమ అంటాడు.

❤️స్వాధీనపరచుకోవడాన్ని హక్కు అంటాడు.

💙ఆధారపడటాన్ని అనుబంధం అంటాడు.

💛కోల్పోతాననే భయాన్ని నిజమైన ప్రేమ అంటాడు.

అంతేకాదు, ఇవన్నీ సహజమని సమాజం కూడా మనకి నేర్పిస్తుంది.

ఎందుకంటే తన బంధనాలను బంధనాలుగా గుర్తించిన మనిషి, వాటి నుంచి ఎలాగైనా సరే  బయటపడటానికి ప్రయత్నిస్తాడు.

కానీ వాటినే ఆనందమని నమ్మే మనిషి, తన సంకెళ్లను తానే కాపాడుకుంటూ ఉంటాడు.

- PRATIKULA VEDAM
18


 https://youtube.com/post/UgkxpBe7EUoGVCuANgJE8nlb4LxWdd7FrWqH?si=hvbr9vxYjlNUJKk8


No comments:

Post a Comment