Friday, November 6, 2026

Revolutionary Philosopher | Friedrich Nietzsche | విప్లవాత్మక, విషాదభరిత తత్త్వవేత్త। ఫ్రెడరిక్ నీషే

Revolutionary Philosopher | Friedrich Nietzsche | విప్లవాత్మక, విషాదభరిత తత్త్వవేత్త। ఫ్రెడరిక్ నీషే

Author Name:Kiran Prabha

Youtube Channel Url:https://www.youtube.com/@KoumudiKiranprabha

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WZ0EIvsnRP4





Title: Revolutionary Philosopher | Friedrich Nietzsche | విప్లవాత్మక, విషాదభరిత తత్త్వవేత్త। ఫ్రెడరిక్ నీషే

Author Name: Kiran Prabha

Description: #philosophy #nietzsche #inspiration
Discover the life of Friedrich Nietzsche—the man behind some of philosophy’s most provocative ideas.
This biographical show traces his journey through intellectual rebellion, personal struggles, and the search for meaning.
Beyond the famous quotes, explore the experiences and relationships that shaped his extraordinary mind.
Follow a life marked by fierce conviction, profound loneliness, and the courage to question accepted truths.
Meet not just the philosopher who challenged the world, but the human being behind his enduring legacy.

KiranPrabha Talk Shows List:
https://koumudi.net/talkshows/index.htm
Koumudi Web Magazine:
https://koumudi.net/

Transcript:
(00:00) ఫ్రెడరిక్ విల్హెల్మ్ నీషే ఫ్రెడరిక్ నీషే నీషే 19 వ శతాబ్దపు సుప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త సుప్రసిద్ధ తత్వవేత్త ఈ రెండు పదాలకు నిషే జీవితంలో అనేక కోణాలు కనిపిస్తాయి. సుప్రసిద్ధ అవును ఇప్పుడు నిషేను సుప్రసిద్ధ అంటున్నాం కానీ ఆయన జీవించిన కాలంలో ఆయన ఆశించినంత గుర్తింపు రాలేదు పైగా దేవుడు మరణించాడు ఈ భూగోళం మీద అసలు శిసలు క్రైస్తవుడు ఒక్కడే ఉన్నాడు అతడేమో సిలువ వేయబడ్డాడు ఇలాంటి భావాల ప్రకటనతో
(00:48) వివాదాస్పదుడయ్యాడు. ఆయన మరణించాక ఆయన రచనలకు చెల్లెలు చేసిన వక్రభాష్యాల వల్ల నాజీలను సమర్ధించిన వాడిగా హిట్లర్ భావాలకు పునాదులు వేసిన వాడిగా ఎంతోమందితో అసహ్యించుకోబడ్డాడు. దాదాపు 60 సంవత్సరాల నుంచే ఆయన భావాలు సరైన కోణంలో ప్రజలకు చేరి ప్రసిద్ధ అన్న విశేషణానికి పూర్తి అర్హత ఉన్నవాడిగా గుర్తింపు పొందాడు.
(01:24) ఇంకా తత్వవేత్త ఆయనను కేవలం తత్వవేత్త అని పేర్కొనడం కూడా ఆయన బహుముఖ ప్రజ్ఞత్వానికి న్యాయం చేకూర్చదు నిజానికి ప్రపంచ తాత్విక చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన తత్వవేత్తే అయినా క్రమబద్ధమైన తాత్విక వ్యవస్థను నిర్మించిన సంప్రదాయ తత్వవేత్త కాదు సోక్రటీస్ లాగా ఉపన్యాసాలు ఇవ్వలేదు అరిస్టాటిల్ లాగా గురుకులాలు స్థాపించలేదు. తన భావాలను సూక్తులు రూపకాలు కథలు కవితాత్మక వచనం వ్యంగ్యం మానసిక విశ్లేషణ ఇలాంటి ప్రక్రియల ద్వారా తన భావాలను అక్షరబద్ధం చేశాడు. అందువల్ల ఫ్రెడరిక్
(02:13) నీషే ను వివిధ కోణాల్లో ఎలా అన్వయించుకోవచ్చు అంటే జీవితం నీతి నియమాలు సత్యం మతం మానవ స్వభావం వీటి గురించి మౌలికమైన ప్రశ్నలు సంధించినందుకు తత్వవేత్త అనొచ్చు పాశ్చాత్య మతం విద్య జ్ఞానం జాతీయత ఆనాటి ఆధునిక సంస్కృతి వీటిని విశ్లేషించినందుకు సాంస్కృతిక విమర్శకుడు అనవచ్చు. క్రైస్తవ మత వ్యవస్థను లోతుగా అధ్యయనం చేసి తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు మత విమర్శకుడు అనవచ్చు.
(02:56) మనిషి మాటల వెనుక దాగిన భయం, అసూయ, ప్రతీకారం, అధికార కాంక్షలను బహిరంగ చర్చకు నిలిపినందుకు మానవ మనస్తత్వ పరిశీలకుడు అనవచ్చు. గ్రీకు రోమన్ జర్మన్ భాషలు సాహిత్యం సాంస్కృతిక అధ్యయనం చేసినందుకు ఆ రంగంలో ఆచార్యుడిగా పనిచేసినందుకు ప్రాచీన భాషా సాహిత్య పండితుడు అనవచ్చు చిన్న చిన్న వాక్యాల్లో లోతైన సంచలనాత్మక భావాలను వ్యక్తీకరించినందుకు సూక్తి రచయిత అనవచ్చు మనిషి తన భయాలు పరిమితులు వారసత్వం వచ్చిన విలువలు వీటిని అధిగమించాలి అని ప్రచారం చేసినందుకు స్వీయ
(03:45) అధిగమన తత్వవేత్త అనవచ్చు ఎవ్వరూ ప్రశ్నించకూడదు అని భావించిన దేవుడు మతం సంప్రదాయాలు ఇలాంటి భావాలను నిర్భయంగా ఎక్స్రే తీసినందుకు సంప్రదాయాలను సవాలు చేసినందుకు భావ విప్లవకారుడు అనవచ్చు ఫ్రెడరిక్ నిషేని ఇన్ని కోణాల్లో పరిచయం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు వీటన్నింటిని ఒక్కొక్క వాక్యంలో చెప్పాలంటే ప్రశ్నలతో ప్రపంచాన్ని కుదిపిన తత్వవేత్త దేవుడి మరణాన్ని ప్రకటించి మనిషి బాధ్యతను గుర్తు చేసిన సంస్కర్త తత్వాన్ని కవిత్వంగా కవిత్వాన్ని సవాలుగా మార్చిన రచయిత విలువలను వారసత్వంగా
(04:31) స్వీకరించకుండా మీకు మీరే సృష్టించుకోండి అన్న తిరుగుబాటుదారుడు దట్ ఈస్ ఫ్రెడరిక్ నీషే 1844 నుంచి 1900 సంవత్సరం దాకా అంటే కేవలం 55 సంవత్సరాలు మాత్రమే జీవించిన అందులో చివరి నాలుగవ వంతు జీవితాన్ని అంటే చివరి 11 సంవత్సరాలను తనకు తానే తెలియని స్థితిలో గడిపిన ఫ్రెడరిక్ నీషే జీవన రేఖలు ఈనాటి కార్యక్రమం ప్రధానాంశం నీష్ షె ఆంగ్లంలో స్పెల్లింగ్ ఎన్ ఐ ఈ టిజెడ్ ఎస్ సి హెచ్ ఈ దీన్ని వివిధ భాషల్లో వివిధ రకాలుగా ఉచ్చరిస్తారండి
(05:20) నీచ్ అని నీచే అని నీచా అని కూడా అంటారు తెలుగులో నీషే అన్న వాడుక ఎక్కువగా ప్రచారంలో ఉంది కాబట్టి నేను కూడా నీషే అంటున్నాను శ్రోతలు గమనించగలరు. ఆయన ప్రతిపాదించిన తత్వ సిద్ధాంతాల విశ్లేషణ ఆయన రాసిన ఇతర పుస్తకాల సమీక్ష ఇవి ఈనాటి కార్యక్రమం ప్రధానోద్దేశం కాదండి ఆధునిక సమాజానికి ఆధునిక తరానికి కూడా మార్గదర్శకత్వం అనదగిన భావాలను 140 సంవత్సరాల క్రిందటే ప్రతిపాదించిన నిషే తాను చెప్పినట్లు తాను ఎందుకు జీవించలేకపోయాడు జీవితాంతం ఆయనను వెంటాడిన విషాదాలు ఏమిటి వైరుధ్యాలు ఏమిటి వివాదాలు ఏమిటి
(06:07) ఇలాంటి వెలుగు నీడల ఫ్రెడరిక్ నీషే జీవన రేఖలు ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాటిల్లోకి వెళ్ళబోయే ముందు నీషే సొంత సంతకాలు అనదగిన కొన్ని భావాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను దేవుడు మరణించాడు మనమే ఆయనను చంపేసాం. ది గే సైన్స్ అనే పుస్తకంలోనూ దస్ స్పోక్ జరుతుస్త్ర అనే పుస్తకంలోనూ ఆయన కథల్లోని పాత్రల ద్వారా ఈ మాట చెప్పిస్తాడు నీషే నీషే చదువుకునే రోజుల్లోకి వచ్చిన 1860 ప్రాంతాలకు శాస్త్ర విజ్ఞానం శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. వర్షాలు ఎలా పడతాయి
(06:55) వ్యాధులు ఎందుకు వస్తాయి ఇలాంటి అనేక ప్రకృతి పరిణామాలకు శాస్త్రీయ కారణాలు కనిపెట్టారు శాస్త్రజ్ఞులు తద్వారా సమాజంలో మనుషులు ప్రతిదానికి మతాన్ని దేవుడిని నమ్మడం తగ్గించేశారు నీషే తన కథలోని పాత్రల ద్వారా పలికించిన దేవుడు మరణించాడు అంటే మనుషుల మనసుల్లో దేవుడు అంటే ఉన్న భయం నమ్మకం తగి తగ్గిపోతున్నాయి అని ఆయన భావన దీన్ని దేవుని నిందించడం అనే కోణంలో కాకుండా మీ జీవితానికి మీ మంచి చెడులకు మీరే పూర్తి బాధ్యత వహించాలి అని నీషే మాటల అంతరార్థంగా చెప్పుకోవచ్చు
(07:40) నీషే తాత్విక వచనాల్లో ఇంకొక ప్రసిద్ధమైన పదం ఎటర్నల్ రిటర్న్ సరళంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఈ క్షణం మనం తింటున్న ఆహారం మన నవ్వులు మన బాధలు ప్రతిదీ కూడా భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇలాగే పునరావృతం అవుతుందని ఊహించుకోండి జస్ట్ ఇమాజిన్ నీ జీవితం మళ్ళీ మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుందని తెలిస్తే నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం పట్ల సంతోషిస్తావా బాధపడతావా అంత అంతరార్థం ఏమిటంటే ఈ క్షణం ఇదే రూపంలో ఇదే భావోద్వేగంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది
(08:26) అనుకుంటే ఏ క్షణాన్ని వృధా చేయం పొరబాట్లు చేయకుండా ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా సంతోషంగా జీవిస్తాం. ఇంకా నీషే చెప్పిన మరొక అత్యంత ప్రసిద్ధమైన భావన ఉబర్ మెంచ్ ఇంగ్లీష్లో సూపర్మన్ నీషే దృష్టిలోని సూపర్మాన్ గాలిలో ఎగరడు కళ్ళల్లో నుంచి లేజర్ కిరణాలు వదలడు అతడు మనలోనే ఉంటాడు మనతోనే ఉంటాడు మానసికంగా ఆ సూపర్ మాన్ ఒక హిమాలయం అందరూ వెళ్తున్నారు కదా అని గుడ్డిగా అదే దారిలో వెళ్ళడం కాకుండా తనకు ఏది ఒప్పో ఏది తప్పో ఆలోచించి సొంతదారిని ఎంచుకుంటాడు.
(09:13) జీవితంలో కష్టాలు నష్టాలు వస్తే రాని అనుకుంటాడు వాటిని సవాలుగా తీసుకొని మరింత బలాన్ని సంతరించుకుంటాడు. తనలో తలెత్తే ప్రతికూల భావోద్వేగాలని నెగిటివ్ ఎమోషన్స్ ని పూర్తిగా నియంత్రించుకోగలుగుతాడు. ఇంత మానసిక బలంతో తనకు తానే నయా నాయకుడు అయ్యేవాడే సూపర్ మాన్ ఇవ్వండి నీషే అనగానే గుర్తొచ్చే కొన్ని భావాలు, వాక్యాలు, పదాలు ఇలాంటివి వందల కొద్దీ ఉన్నాయి.
(09:49) ద విల్ టు పవర్ ఎమోర్ఫాతి మాస్టర్ స్లేవ్ మొరాలిటీ దట్ వచ్ డస్ నాట్ కిల్ అస్మే అస్ స్ట్రాంగర్వితౌట్ music్యూజిక్ లైఫ్ ఇస్ ఏ మిస్టేక్హిహస్ ఏవై టు లివ్కెన్ బేర్ ఆల్మోస్ట్ ఎనీహౌ ఇలాంటివన్నీ కూడా నీషే అనగానే గుర్తొచ్చే కొన్ని ప్రసిద్ధ వాక్యాలు ఫ్రెడరిక్ నీషే గురించి తొలిసారిగా వింటున్నా శ్రోతలకు ఈ ఉపోద్ఘాతంతో ఆయన గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఆయన జీవితాన్ని విహంగ వీక్షణం లాగా చూస్తే ఈ దృశ్యాన్ని ఊహించుకోండి 1889 జనవరిమూడు ఇటలీలోని ట్యూరిన్ నగరం
(10:38) అంతకు ముందు 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ప్రపంచమంతా స్ఫూర్తి పొందుతున్న అనేక పుస్తకాలు రాసిన ఎక్కువ మందికి తెలియకుండా నిరంతర సంచారిగా జీవిస్తున్న 44 సంవత్సరాల ఫ్రెడరిక్ నీషే ఆ నగర వీధుల్లో కుప్పకూలిపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తన స్నేహితులకు విచిత్రమైన ఉత్తరాలు రాశాడు.
(11:07) కొన్నింటి మీద డైనోసస్ అని మరికొన్నింటి మీద ద క్రూసిఫైడ్ వన్ అంటే సిలువ వేయబడినవాడు అని సంతకం చేశాడు. అప్పటిదాకా ప్రపంచం ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పుస్తకాలు అమ్ముడు పోలేదు తల్లికి చెల్లికి దూరమయ్యాడు. తనకంటూ కుటుంబం లేదు స్థిరమైన నివాసం లేదు ఇంకా ఆశ్చర్యకరంగా ఏ దేశపు పౌరసత్వము కూడా లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్ గా 10ఏళ్ళు పనిచేసి మానేశాడు.
(11:37) ప్రేమించిన అమ్మాయి తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది. తనకు మార్గదర్శకులని తానే గౌరవించిన గురువులందరినీ దూరం చేసుకున్నాడు. గాఢమైన స్నేహ సంబంధాలకు చేదు ముగింపులు ఇచ్చాడు. జీవితమంతా తీవ్రమైన తలనొప్పులు కంటి సమస్యలు, తరచు వాంతులు ఇంకా అనేకానేక శారీరక బాధలతో పోరాడాడు. ఈ బాధల బందినాలో ఉండే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి గాడ్ ఇస్ డెడ్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ఉబర్మెన్ విల్ టు పవర్ బికమ హూ యు ఆర్ అంటూ మానవ విలువల పునాదులను ప్రశ్నించిన ఆలోచనలను ప్రపంచానికి ఇచ్చాడు. ఒక మతబోధకుడి
(12:24) కొడుకుగా జన్మించి సొంత ఆలోచనల సోపానాలఎక్కి మత మౌఢ్యాలను సూటిగా వాడిగా వేడిగా విమర్శించాడు. వేదన నుంచి పారిపోవడం కాదు వేదనతో సహా జీవితాన్ని అనుభవించాలి అని చెప్పాడు తాను అలాగే వేదనల రాదారిలోనే నిరంతరం పయనించాడు. ఆయన జీవించి ఉన్నప్పుడు గుర్తింపుకు నోచుకోలేదు కానీ ఆయన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభమయ్యే సమయానికి అవి తనవే అని గుర్తించలేని మతి భ్రమించిన స్థితిలోకి వెళ్ళిపోయాడు.
(13:03) మరణించాక ఆయన రచనలు నాజీలకు అనుకూలంగా వక్రీకరించబడితే మళ్లీ పండితులు ఆయన రాత ప్రతుల్ని పరిశీలించి నీషేని ఆ వక్రీకరణల నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి నీషే జీవితం ఒక విచిత్రమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. తన కాలానికంటే చాలా ముందుగా ఆలోచించిన వ్యక్తి తన కాలంలో తప్పుగా అర్థం చేసుకోబడడం తప్పదా? అంుచేత ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక తత్వవేత్త జీవితం గురించే కాదు తన మానసిక స్థైర్యంతో నైతిక వ్యవస్థలను ఎదుర్కొంటూ తన శారీరక పోరాటంతో అనారోగ్యాలను ఎదుర్కొంటూ తన రచనలతో
(13:50) భవిష్యత్తును జయించిన ఒక ఒంటరి మేధావి విషాద గాధ ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను పరిశీలి ీలించిన వనరుల జాబితా చెప్తాను స్టాన్ఫోర్డ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీ ద ఫిలాసఫికల్ రివ్యూ లోని కొన్ని వ్యాసాలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించిన ఒక వ్యాసం బిబిసి డాక్యుమెంటరీ ఇంకా నీషియా రాసిన పుస్తకాల్లోని కొన్ని అధ్యాయాలు వీటన్నింటి నుంచి తీసుకున్న సమాచారాన్ని క్రమ పద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఫ్రెడరిక్ నిషే విలక్షణ వివాదాస్పద
(14:35) తత్వవేత్త జీవనరేఖల్లోకి వెళ్దాం. ఫ్రెడరిక్ విల్ హేల్ నిషే 1844 అక్టోబర్ 15 న అప్పటి ప్రష్యా రాజ్యంలో రాకెన్ అనే చిన్న ఊర్లో పుట్టాడు. ప్రస్తుతం ఆ ఊరు జర్మనీలో ఒక భాగం. ఆ రోజు ప్రష్యా రాజు పుట్టిన రోజు కూడా ఆ రాజుగారి పేరు కలిసి వచ్చేలాగా విల్హెల్మ్ అని పెట్టుకున్నాడు తండ్రి కార్ల్ లూడ్విగ్ నిషే ఆయన స్థానిక చర్చిలో పాస్టర్ గా పని చేస్తుండేవాడు ప్రభుత్వమే ఆయనకు భత్యం ఇస్తూ ఉండేది.
(15:17) ఆ కుటుంబం అంతా కూడా తరతరాలుగా క్రైస్తవ మతబోధకుల కుటుంబం. నీషే చిన్నప్పటి నుంచే ఇంట్లో బైబిల్ బోధనల మధ్య పెరిగాడు సహజంగానే కొడుకు తనలాగే క్రైస్తవ మతబోధకుడు కావాలి అనుకునేవాడు తండ్రి చిన్నతనంలో ఆ సూచనలు కనిపించాయి కూడా నీషే చాలా చిన్న వయసులోనే బైబిల్ లోని సుదీర్ఘమైన వాక్యాలు అలవోకగా చెప్పగలిగేవాడు వయసుకు తగినట్లుగా చిలిపిగా హుషారుగా కాకుండా గంభీరంగా ఉండేవాడు పిల్లలు అతన్నని లిటిల్ పాస్టర్ అని పిలుస్తుండేవాళ్ళు భవిష్యత్తులో క్రైస్తవ మతం మీద అత్యంత తీవ్రమైన విమర్శలు గుప్పించేవాడిగా మారబోయే వ్యక్తిని చిన్నతనంలో మాత్రం
(16:04) లిటిల్ పాస్టర్ అనుకోవడం అది నీషే జీవితంలోని తొలి వైరుధ్యం నీషే అమ్మ నాన్నలకు 1846 లో ఎలిజిబెత్ అనే పాప జన్మించింది అంటే నీషే కంటే రెండు రెంళ్ళు చిన్నదైన చెల్లెలు భవిష్యత్తులో నీషే చివరి సంవత్సరాల్లో ఆయన సంరక్షణ చూసుకోవడంలోనూ నీషే మరణించాక ఆయన రచనలను నాజీలకు అనుగుణంగా మార్చి రాయడంలోనూ ఈ చెల్లెలు ఎలిజబెత్ కీలకమైన పాత్ర పోషించింది.
(16:38) ఆ తర్వాత రెండేళ్లకు 1848 లో లూడ్విగ్ అనే తమ్ముడు జన్మించాడు. దురదృష్ట వశాత్తు 1849 లో అంటే నీషేకి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి కార్ల్ మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు. మరణానికి కొద్ది నెలల ముందు నుంచి తీవ్రమైన బాధకు లోనయ్యాడు. ఆయన చనిపోయిన ఆరు నెలలకు నీషే తమ్ముడు లూడ్విక్ కూడా తన సంవత్సరంన్నర పిన్న వయసులోనే కన్ను మూసాడు.
(17:13) ఊహ తెలిసి తెలియని వయసులోనే నీషే కళ్ళ ముందు సంభవించిన తండ్రి తమ్ముడు ఇద్దరు కుటుంబ సభ్యుల మరణాలు ఆయనను మానసికంగా కుంగతీశయి. ఆ విషాద ఛాయలు ఆ రోజే కాదు జీవితాంతం ఆయనను వెంటాడాయి. తల్లి ఫ్రాన్సిస్కా ఇద్దరు పిల్లల్ని తీసుకుని నాంబర్గ్ అనే ఊరికి తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఐదారఏళ్లకు ఆ తల్లి కూడా అంటే నీషే అమ్మమ్మ కూడా చనిపోయాక ఒక రెండు అంతస్తుల ఇంట్లోని ఒక అపార్ట్మెంట్ లో అద్దెక్కు వెళ్లారు అదే ఊరిలో తర్వాత రోజుల్లో ఆ ఇల్లంతా వాళ్లే కొనుక్కున్నారు.
(17:55) నీషే తరువాతి దశాబ్దాల్లో దేశ దేశాలు తిరిగిన తల్లి మాత్రం అదే ఇంట్లో చనిపోయేదాకా ఉంది. ఆ ఇల్లు ప్రస్తుతం నాంబర్గ్ లోనే నీషే అధ్యయన కేంద్రంగా కొనసాగుతోంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆ ఊరిలోనే గడిచాక 1858 లో అంటే తన 14 సంవత్సరాల వయసులో నిషేని తల్లి ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండడం వల్ల స్కాలర్షిప్ కూడా వచ్చింది నీషే కి ఒకప్పుడు ఆ బోర్డింగ్ స్కూల్ భవనాలు మత శిక్షణ కేంద్రాలుగా ఉండేవి ఆ స్కూల్లో జీవితం క్రమశిక్షణతో కఠినంగా ఉండేవి నీషే అక్కడ గ్రీకు లాటిన్ హిబ్రూ, ఫ్రెంచ్
(18:44) భాషలు నేర్చుకున్నాడు. దీని వల్ల జరిగిన ఉపయోగం ఏమిటంటే గ్రీకు రోమన్ భాషల్లోని ప్రాచీన గ్రంథాల మూల ప్రతుల్ని ఆయా భాషల్లోనే చదవగలిగాడు నిషే ఇది ఆయన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన పునాది అయ్యింది. మనం గమనించాల్సింది స్కూల్లో ఆయన ఫిలాసఫీ పాఠ్యాంశాలుఏమి చదవలేదు చదివిందంతా భాషా శాస్త్రమే వాటిలోనే ప్రావీణ్యత సంపాదించాడు.
(19:14) స్కూల్లో ఉండగానే సంగీతం కవిత్వం కూడా అలవాటయ్యాయి. పియానో నేర్చుకుని స్నేహితులతో కలిసి మ్యూజిక్ క్లబ్ కూడా మొదలుపెట్టాడు. కవిత్వంలో కూడా ఎవరూ ఎక్కువగా చదవని పుస్తకాలు చదివేవాడు. టీచర్ ఒకసారి మందలించాడు అలా ఎవరికీ తెలియని కవుల వెంట పడతావ ఎందుకు ప్రసిద్ధమైన జర్మన్ కవుల పుస్తకాలు చదువు అని ఆ రోజుల నుంచే నీషే కి అందరూ నడిచే త్రోవలో కంటే అరుదైన దారుల్లో నడవడం అలవాటయింది.
(19:49) ఆరు ఏళ్ళు ఆ స్కూల్లో చదువుకున్నాక 1864 లో బాన్ యూనివర్సిటీలో చేరాడు తన 20 సంవత్సరాల వయసులో అక్కడ భాషా శాస్త్రాన్ని కొనసాగించడంతో పాటు క్రైస్తవ ధర్మశాస్త్రం థియాలజీ కూడా అభ్యసించాడు. అప్పటికి కూడా నీషే పాస్టర్ అవుతాడనే ఆశ తల్లికి ఉండేది. కానీ సరిగ్గా ఆ యూనివర్సిటీ రోజుల్లోనే నెమ్మది నెమ్మదిగా అతడిలో క్రైస్తవ మత విశ్వాసాలు సన్నగిెల్లడం మొదలయింది.
(20:24) జీసస్ జీవితాన్ని అతీంద్రియ విశ్వాసంతో కాకుండా చారిత్రక దృక్పథంతో పరిశీలించవచ్చు అన్న ఆలోచన నీషే ని కదిలించింది. ఒక సెమిస్టర్ తర్వాత థియాలజీ అంటే క్రైస్తవ మత ధర్మశాస్త్రం కోర్సు నుంచి తప్పుకున్నాడు. ఆ రోజుల్లోనే బాన్ యూనివర్సిటీ నుంచి లేపిగ్ యూనివర్సిటీకి మారాడు దేవుడు మనిషిని సృష్టించడం కాదు మనిషే తన అవసరాలు, ఆశలు, భయాలను దేవుడి రూపంలో ప్రతిబింబించాడు అన్న వాదనను బలంగా నమ్మాడు.
(21:03) తల్లికి చెల్లికి నీషే లోని ఈ పరిణామం ఆందోళన తీవ్ర నిరాశ కలిగించాయి. 1865 లో నీషే తన చెల్లెలు ఎలిజిబెత్కు రాసిన ఉత్తరంలో దేన్నైనా గుడ్డిగా నమ్మితే మనశశాంతి లభించవచ్చు కానీ నిజాన్ని అన్వేషించాలంటే ప్రశ్నించి తీరాలి అని రాశాడు. ఇక్కడి నుంచే నీషే ప్రయాణం స్పష్టమైనట్లుగా కనిపిస్తుంది. సౌకర్యవంతమైన నమ్మకాల కంటే అసౌకర్యమైన ప్రశ్నలే ముఖ్యం అని ప్రగాఢంగా నమ్మాడు.
(21:42) నీషే లోని ఈ భావాలకు ఊతం ఇచ్చింది ప్రోత్సహించింది ఆర్థర్ షోపెన్ హోవర్ రాసిన పుస్తకాలు. అప్పటికీ ఐదేరేళ్ల ముందే మరణించిన షోపెన్ హోవర్ కి ఏకలవ్య శిష్యుడయ్యాడు నీషే ఆయన చెప్పిన నిరాశావాద తత్వం మొదట్లో నీషేని బాగా ఆకర్షించింది. ఆయన మీద ఒక ప్రత్యేక ప్రశంసా వ్యాసం కూడా రాశాడు. అయితే తరువాతి తరువాతి సంవత్సరాలలో తన సొంత ఆలోచనల్లో మరిన్ని మార్పులు వచ్చాక షోపెన్ హోవర్ ని తిరస్కరించాడు.
(22:18) ఈ విధంగా గురువు నుంచి ప్రారంభించి గురువును దాటి ముందుకు వెళ్ళడం అనే లక్షణం నీషే మేధోపయనంలో పదే పదే కనిపిస్తుంది. ఇంకా కాలేజీలో ఉండగానే ప్రష్యా మిలిటరీ లో స్వచ్ఛందంగా పని చేయడానికి అని వెళ్ళాడు 1867 లో అయితే అక్కడ గుర్రపు స్వారీ నేర్చుకునే సమయంలో ప్రమాదావశాత్తు కాళ్ళకు దెబ్బలు తగిలి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది దాంతో మిలిటరీకి వీట్కోలు చెప్పేసి మళ్ళీ కాలేజీ చదువు కొనసాగించాడు.
(22:52) 1868 లో తన జీవితాన్ని మార్చిన మరొక వ్యక్తిని కలిశాడు ఆయనే సంగీత విద్వాంసుడు రిచర్డ్ వాగ్నర్ నీషే వాగ్నర్ ని కేవలం సంగీతకారుడిగానే చూడలేదు సంగీతం కవిత్వం నాటకం కల్పన వీటన్నింటిని కలిపి ఒక సరికొత్త సంస్కృతిని సృష్టించగల మేధావిగా గౌరవించాడు. తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయిన నీషే కి తనకంటే 30 సంవత్సరాలు పెద్దవాడైన వాగ్నర్ లో పితృ ప్రేమ కనిపించి ఉండొచ్చు.
(23:29) వాగ్నర్ తో కలిసిన స్నేహం నీషే తొలి సంవత్సరాల రచనల మీద స్పష్టంగా కనిపిస్తుంది అయితే తరువాతి సంవత్సరాల్లో వాగ్నర్ తో కూడా విభేదించడం నీషే స్వాభావిక లక్షణంగా అనుకోవచ్చు. ప్రస్తుతం మన కథాక్రమంలో ఇంకా నీషే రచయితగానో తత్వవేత్తగానో మారలేదు దానికి మరి కొంచెం సమయం ఉంది. ఈలోగా జరిగింది ఏమిటంటే ఇంకా డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేయకపోయినా 24 సంవత్సరాల వయసులోనే ప్రొఫెసర్ గా ఉద్యోగం తెచ్చుకున్నాడు.
(24:05) విద్యాబోధనలో ప్రాథమిక శిక్షణ కూడా లేకపోయినా నీషే కి పాఠాలు బోధించిన గురువుగారి సిఫారసు తోటి స్విట్జర్లాండ్ లోని బాసెల్ యూనివర్సిటీలో భాషా శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. తన 24 సంవత్సరాల వయసులో సొంత దేశమైన ప్రష్యాని వదిలి స్విట్జర్లాండ్ కి వెళ్ళాడు. అంత చిన్న వయసులో యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడం ఆ రోజులకి చాలా అరుదైన సందర్భం అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది.
(24:40) కారణాలు ఎక్కడా స్పష్టంగా నమోదు చేయబడలేదు ఏమైందంటే బాసెల్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరాక స్వచ్ఛందంగా ప్రష్యా పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దీనికి బలమైన కారణం ఏమీ కనిపించదు అయితే స్విస్ పౌరసత్వానికి మొదట్లో ప్రయత్నించిన అవసరమైన నివాసకాలం పూర్తి కాకపోవడంతో తిరస్కరణ ఎదురయింది. ఆ తర్వాత అర్హత వచ్చినప్పటికీ మళ్ళీ దరఖాస్తు చేయలేదు దీనికి కూడా స్పష్టమైన కారణం కనిపించదు.
(25:14) ఫలితంగా భవిష్యత్తులో పరిమితులను ప్రశ్నించిన ఈ తత్వవేత్త ఏ దేశానికి చట్టబద్ధమైన పౌరుడు కాకుండానే మిగిలిపోయాడు మిగిలిన జీవితం కొనసాగించాడు. దేశ పౌరసత్వాన్ని వదులుకున్నప్పటికీ దేశభక్తిని మాత్రం వదులుకోలేదు. 1870 లో ఫ్రాన్స్ ప్రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమయింది. అప్పటికీ తన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం వల్ల యుద్ధంలో సైనికుడిగా కాకుండా స్వచ్ఛంద వైద్య సేవకుడిగా యుద్ధరంగానికి వెళ్ళాడు నీషే గాయపడిన సైనికులకు దగ్గరుండి చికిత్స చేశాడు.
(25:56) యుద్ధం వివిధ వర్గాల ప్రజల మీద చూపించే భయంకరమైన ప్రభావాన్ని అతి దగ్గరగా చూశాడు. అయితే ఆ సేవలు ఎక్కువ కాలం కొనసాగకుండానే శ్వాసకోశ వ్యాధి రక్త విరోచనాలు మొదలయ్యాయి. యుద్ధం నుంచి వెనక్కురాక తప్పలేదు అప్పటినుంచి అంటే తన 26 సంవత్సరాల వయసు నుంచే అనారోగ్యం వదలకుండా వెంటాడింది. తీవ్రమైన తలనొప్పి కంటిచూపు సమస్యలు, వాంతులు, జీర్ణకోశ సమస్యలు ఆయనకు జీవితకాలం నేస్తాలు అయ్యాయి.
(26:32) అయితే ఆ రోజుల నుంచి కూడా నీషే శారీరక బాధల్ని ఇతరతర కష్టాలని కూడా ఎప్పుడూ శాపంగా చూడలేదు. మనిషి తనకు ఎదురైన కష్టాలను ఏ రూపంలో మార్చుకుంటాడు అని ప్రశ్నించుకున్నాడు. ఇలాంటి ప్రశ్నల పర్యవసానమే తరువాతి సంవత్సరాల్లో రాసిన ట్విల్ లైట్ ఆఫ్ ది ఐడోల్స్ లో ఆయన రాసిన ప్రసిద్ధ వాక్యం. నన్ను చంపలేనిది ఏదైనా సరే అది నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది అంటే బాధను ఎదుర్కొని దాన్ని సృజనాత్మక శక్తిగా మార్చుకోగలిగిన వ్యక్తి తనను తాను జయించినట్లే అని ఆయన భావం ఇంతవరకు నీషే ఏమి పుస్తకాలు రాసినట్లు చెప్పుకోలేదు కదా
(27:17) 1872 లో తన 27 ఏళ్ల వయసులో తన మొదటి పుస్తకం ద బర్త్ ఆఫ్ ట్రాజిడీ ప్రచురించాడు. ప్రాచీన గ్రీక్ ట్రాజిడీ ఎందుకు పుట్టింది ఎందుకు క్షీణించింది అనే ప్రశ్నలను ఆ పుస్తకంలో విశ్లేషించాడు. అయితే ఈ పుస్తకం విమర్శకుల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంది. యువ స్కాలర్స్ కూడా ఈ పుస్తకంలోని అంశాలతో విభేదించారు.
(27:46) ఈ వివాదాల వల్ల ఆయన క్లాసులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ విధంగా నీషే కి అధ్యాపకుడిగా ప్రాముఖ్యత తగ్గినా తత్వవేత్తగా సొంత గొంతుక మొదలయింది. ఇక్కడి నుంచి ప్రారంభించి వ్యాసాలు పుస్తకాలు రాశాడు కానీ మిగతా ప్రసిద్ధ రచయితల్లాగా నీషే పుస్తకాలకు విపరీతమైన ఆదరణ కానీ ప్రచారం కానీ లభించలేదు ఆయన నివసించిన సంవత్సరాల్లో ఆ తరువాత 1878 లో ప్రచురించిన హ్యూమన్ ఆల్ టు హ్యూమన్ తోటి నీషే రచనా ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది.
(28:29) పెద్ద పెద్ద వ్యాసాలలాగా కాకుండా చిన్న చిన్న పేరాగ్రాఫ్ లు లేదా కేవలం ఒక వాక్యం రూపంలో అనేక అంశాల మీద తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు నిషే ఈ పుస్తకానికి రెండో భాగం మూడో భాగం కూడా వరుసగా 1879 1880 లలో ప్రచురించాడు. ఈ పుస్తకం అంతర్జాలంలో లభ్యమవుతుందండి మీరు కూడా చదవచ్చు 140 సంవత్సరాల క్రిందటిదే అయినా అందులో మీషే వ్యక్తపరచిన భావాలు ఈ కాలానికి కూడా అచ్చుగుద్దినట్లు సరిపోతాయి.
(29:06) ఈ పుస్తకాలు రాస్తున్న సంవత్సరాల్లో ఆరోగ్యం మరింతగా క్షీణిస్తూ ఉండడంతో దీర్ఘకాలిక సెలవు తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అదే అనారోగ్యం తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేయాల్సిన స్థాయికి దిగజారింది. 1879 లో అంటే ఉద్యోగంలో చేరిన 10 ఏళ్లకు తన 34 ఏళ్ల వయసులో యూనివర్సిటీలోని అధ్యాపక వృత్తికి రాజీనామా చేయక తప్పలేదు. ఇప్పటివరకు చూసుకుంటే ఆర్థిక స్థిరత్వం లేదు.
(29:41) మానవతా దృక్పథంతో యూనివర్సిటీ కొద్దిపాటి పెన్షన్ మంజూరు చేసింది కానీ అది ఎటు సరిపోనిది. నీషే ఎప్పుడైతే క్రైస్తవ మతానికి దూరమయ్యాడో అతడి తల్లి చెల్లి కూడా నీషే గురించి పట్టించుకోవడం తగ్గించారు. అంటే 1879 కి ఉద్యోగం లేదు కుటుంబం లేదు ఏ దేశ పౌరసత్వము లేదు ఇక్కడి నుంచి తరువాతి 10 సంవత్సరాలు అంటే 1889లో మానసికంగా అనారోగ్యపరంగా కుప్పక కూలిపోయే వరకు సంచార జీవనమే మిగిలింది.
(30:17) ఆ పదఏళ్ళు అనారోగ్యంతో నిరంతర పోరాటం ఒకవైపు ఈరోజు కూడా నీషేని గుర్తించుకునేలాగా ఉదహరించుకునేలాగా చేస్తున్న సాహిత్య సృష్టి భావాల రూపకల్పన ఇంకొకవైపు కొనసాగాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన వాతావరణం కోసం ఫ్రాన్సు స్విట్జర్లాండ్ ఇటలీల మధ్య తిరుగుతూ ఉండేవాడు. చలికాలం అయితే కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలు వేసవి కాలం అయితే చల్లగా ఉండే ప్రదేశాల్లోనూ పర్యటించేవాడు.
(30:50) తెలిసిన వాళ్ళు మిత్రులు ఆర్థిక సహాయం చేస్తుండేవాళ్ళు ఎక్కడున్నా గాని చవకరకం గదుల్లో నివసించేవాడు ఎక్కువగా నడుస్తుండేవాడు ఆ నడక సమయంలో వచ్చిన ఆలోచనలనే నోట్ పుస్తకాల్లో రాసుకునేవాడు. దాదాపు నీషే తాత్విక చింతన అంతా పర్వత మార్గాల్లో సరస్సుల ఒడ్డున ఒంటరి గదుల్లో శారీరక బాధల మధ్య పుట్టిందే గాడ్ ఇస్ డెడ్ అన్న ప్రసిద్ధ వాక్యం ఉన్న పుస్తకం ద గే సైన్స్ 1882 లో ప్రచురితమయింది.
(31:26) ఈ సంవత్సరం అంటే 1882 లోనే నీషే జీవితంలో ఒక ప్రేమ కథా ప్రకరణం మొదలయింది. ఆమె పేరు లే సలోమి స్వతంత్ర భావాలు ఉన్న 21 సంవత్సరాల యువతి స్విట్జర్లాండ్ లో ఫిలాసఫీ చదువుకుంది ఆమె అనారోగ్యం దృష్ట్యా సలోమిని రోమ్ నగరానికి తీసుకెళ్ళింది ఆమె తల్లి అక్కడ సాహితీ సమావేశాల్లో సలోమికి పాల్రీ అనే జర్మన్ రచయిత వైద్యుడు తత్వవేత్త పరిచయమయ్యాడు.
(32:01) మొదటి చూపులోనే నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నాడు పాల్ రీ దానికి ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ కొంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకుందాం ఆ తర్వాత ఆలోచిద్దాం అంది. సరిగ్గా అదే సమయంలో మనం మాట్లాడుకుంటున్న నీషే కూడా రోమ్లోనే ఉన్నాడు. సలోమీకి పరిచయమైన పాల్రీ నీషేకి కూడా మిత్రుడే ఆ పాలరీ నేనే నీషేని సోలోమికి పరిచయం చేశాడు.
(32:37) ముగ్గురికీ ఇష్టమైన అంశం ఫిలాసఫీ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రత్యేక మేధోపరమైన సమూహాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రణాళిక రచించుకున్నారు. వివాహ బంధాలకు దూరంగా మేధోపరమైన స్నేహ సంబంధాలతో సహజీవనం కొనసాగించాలి అని కూడా అనుకున్నారు. ముగ్గురు కలిసి ఇటలీ స్విట్జర్లాండ్ లలో విస్తృతంగా పర్యటించారు. ఆ క్రమంలో నీషే సలోమి మీద అభిమానం పెంచుకున్నాడు.
(33:09) అది ప్రేమగా మారింది. పెళ్లి ప్రసక్తి కూడా తీసుకొచ్చాడు సలోమి దగ్గర. అయితే అప్పటికే ఆమెను ప్రేమించిన కలిసి ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరైన పాలరీ కి ఈ విషయం తెలిసింది. నీషేని హెచ్చరించాడు. సలోమి కూడా మనం కేవలం మేధోపరమైన స్నేహితులం మాత్రమే నేను ఎవరితోనూ వివాహ బంధంలోకి వెళ్లదలుచుకోలేదు అని నీషేకి స్పష్టంగా చెప్పింది.
(33:39) ఈ త్రికోణ ప్రేమ వైఫల్యాలు వ్యక్తిగత విభేదాలకు దారి తీశాయి సలోమి పాలలు నీషేని వదిలేసి వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వ్యవహారం అంతా ఒక సంవత్సరం లోపే జరిగింది. అప్పటికే శారీరక అనారోగ్యంతో పోరాడుతున్న నీషే ని సొలోమితో ప్రేమ వైఫల్యం మానసికంగా బాగా దెబ్బతీసింది. దీనికి తోడు ఈ విషయం తెలిసిన నీషే చెల్లెలు అన్నయ్యను విపరీతంగా మందలించింది.
(34:10) సలోమి వ్యక్తిగతంగా మంచిది కాదు అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఎందుకు బాధపడతావు అని ఆ తరువాత నీషే సలోమి పాలరీలతో స్నేహం పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాడు కానీ వాళ్లే దగ్గరకు రానివ్వలేదు ఆ తర్వాత సంవత్సరాల్లో సలోమి పాల్ని కూడా వదిలేసి వేరు వేరు వ్యక్తులతో సహజీవనం చేయడం అదంతా వేరే కథ మన నీషే విషయానికి వస్తే ఈ మానసిక కుంగుబాటు దశలోని నే 1883 లో ఆయన సాహిత్యం అంతటిలో మణిపూసగా నిలిచిన దస్పోక్ జరతోస్త్ర మొదటి భాగాన్ని కేవలం 10 రోజుల్లో రాశాడు.
(34:52) తన సొంత భావాలను వెల్లడించడానికే ఆ పుస్తకంలో జరతోస్త్ర అనే పాత్రను సృష్టించాడు అని అధ్యయనకారులు అభిప్రాయం. ఆ తర్వాత మరొక మూడు భాగాలు మొత్తం నాలుగు భాగాలుగా ప్రచురించాడు ఆ పుస్తకాన్ని స్నేహితులు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పదే పదే చదువుతున్న ఈ పుస్తకం ఆ రోజుల్లో అసలు ప్రజాధారణ పొందలేదు.
(35:19) మొదటి మూడు భాగాలకు చాలా తక్కువ అమ్మకాలు జరగడంతో 1885 లో నాలుగవ భాగాన్ని కేవలం 40 ప్రతులు మాత్రమే ముద్రించి సన్నిహితులకు కాపీలు పంపించాడు. అయితే నీషే కి తన భావాల మీద అపారమైన నమ్మకం ఉండేది. బయట ప్రపంచం నుంచి మాత్రం స్పందన లేదు. ఆరోగ్యం కాస్త తేరుకుంది అనుకున్నాక మళ్ళీ యూనివర్సిటీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. పుస్తక ప్రచురణకర్తలతో విభేదాలు వచ్చాయి.
(35:51) 1886 లో బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ని సొంత ఖర్చులతో ప్రచురించాడు. పాఠకులు తనని అర్థం చేసుకోవడం లేదు అని బాధపడ్డాడు. భవిష్యత్తులోనైనా తన రచనలకు తప్పక ఆదరణ లభిస్తుంది అనే నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. కొంతమంది మరణించాకనే పుడతారు అనే భావాన్ని తన రచనల్లో తరచు వ్యక్తం చేశాడు. నీషే విషయంలో తరువాతి సంవత్సరాల్లో నిజంగా అలాగే జరిగింది.
(36:24) మరణించాకనే ఆయన రాసిన పుస్తకాలకు ఆదరణ పెరిగింది. అంత నిరాదరణ కాలంలోనే 1887 లో ఆన్ ది జీనియాలజీ ఆఫ్ మొరాలిటీ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ రోజుల్లోనే నీషే చెల్లెలు తీవ్రమైన యూదు వ్యతిరేక భావాలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంది. వాళ్ళ మిత్రులతో కలిసి వాళ్ళద్దరూ జర్మన్ జాతీయ కాలనీ స్థాపించడానికి వెళ్ళారు. నీషేకి బావగారి మీద విపరీతమైన కోపం అసహ్యం కలిగాయి.
(36:56) ఈ విషయాలన్నీ చెల్లెలకు రాసిన ఉత్తరాల్లో స్పష్టంగా చెప్పాడు. యూదు వ్యతిరేక భావాలు ఉండడం వల్లనే ద్వేషపూరిత వాతావరణంలో తన పుస్తకాలను ఎక్కువమంది చదవడం లేదు అని నీషే భావన యూదు వ్యతిరేక భావనలకు అతడు వ్యతిరేకి 1888 నీషే జీవితంలో అత్యధికంగా రచనలు చేసిన చిట్టచివరి సంవత్సరం అనుకోవచ్చు. ఇటలీలోని ట్యూరిన్ నగరం తన ఆరోగ్యానికి సరిపడుతోంది అని తెలుసుకొని అక్కడ ఎక్కువ రోజులు కొనసాగాడు.
(37:31) అక్కడ ఉండగానే అసాధారణమైన వేగంతో రచనలు చేశాడు. ద కేస్ ఆఫ్ వాగ్నర్ ట్విలైట్ ఆఫ్ ఐడోల్స్ ద యాంటైక్రిస్ట్ లాంటి పుస్తకాలన్నీ ఆ సంవత్సరాల్లో రాసినవే అయితే అవన్నీ అప్పుడు ప్రచురితం కాలేదు కానీ వాటన్నింటి రాత ప్రతుల్ని మాత్రం పూర్తి చేశాడు. ఆ రోజుల్లోనే తను రాసుకున్న ఎక్కే హోమో చాలా వరకు ఆయన ఆత్మకథ అంటారు. దానిలోని అధ్యాయాల పేర్లు నేను ఎందుకు ఇంత తెలివిగలవాడిని అయ్యాను నాకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నేను ఇన్ని మంచి పుస్తకాలు ఎలా రాస్తున్నాను ఇట్లా ఉంటాయి ఆ పుస్తకంలో అధ్యాయాల పేర్లు ఆ సమయానికి తనని తాను ఎక్కువగా ఊహించుకోవడం ఎవరూ గుర్తించడం లేదనే ఆత్మ న్యూనత ఎక్కువై
(38:16) ఉండొచ్చు రాబోయే రోజుల మానసిక వ్యాధికి సూచనలు కూడా అయి ఉండొచ్చు. నీషే జీవితంలో పతాక సన్నివేశం అనదగిన సంఘటన 1893 జనవరి 3న జరిగింది. ఉపోద్ఘాతంలో చెప్పాను కదా ఆ రోజు క్యూరిన్ నగర వీధుల్లో నీషే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు అని పోలీసులు ఆయన దగ్గరికి వచ్చారు. సరిగ్గా ఆ రోజు ఏం జరిగింది అనేది ఎవ్వరూ ఖచ్చితంగా చరిత్రలో నమోదు చేయలేదు.
(38:47) అత్యధికంగా ప్రచారంలో ఉన్న కథనం ఏమిటంటే అప్పటికే నీషే మానసికంగా బలహీనంగా ఉన్నాడు. అతని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఆ రోజు ప్యూరిన్ నగర వీధుల్లో ఒక గుర్రబండీ తోలే వ్యక్తి గుర్రాన్ని తీవ్రంగా కొట్టడం చూశాడు నిషే. గబగబా పరిగెత్తుక వెళ్లి గుర్రం మెడను కౌగలించుకొని ఆ తర్వాత నేల మీద కుప్ప కూలిపోయాడు. ఇది నిజంగా జరిగింది అని చెప్పలేం కాదని చెప్పలేం ప్రచారంలో ఉన్న నిర్ధారణ కాని సంఘటన అంతే పక్కనఉన్న వాళ్ళు ఎవరో అతన్ని తన గదికి చేర్చారు నిజానికి ఆ క్షణంలోనే మానసికంగా తన మీద తనకి నియంత్రణ కోల్పోయాడు నిషే.
(39:31) తర్వాత రెండు మూడు రోజుల్లో మిత్రులకు విచిత్రమైన ఉత్తరాలు రాశాడు ప్రష్యా రాజుని రోమ్ కి పిలిపించి హత్య చేయాలి అని కూడా రాశాడు కొంతమందికి వాటిల్లోని తీవ్రతను గమనించి మిత్రులే అతన్ని స్విట్జర్లాండ్ లో అతడు పనిచేసిన యూనివర్సిటీ సమీపంలోని ఒక మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన తల్లి నీషేని జర్మనీలో తన ఇంటి దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది.
(40:01) అంతే ఆ రోజు నుంచి 1900 సంవత్సరంలో మరణించేదాకా నీషే తనని తాను గుర్తుపట్టలేదు మానసికంగా ఆ రోజే ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. ఒక ఏడాది తర్వాత తల్లి నంబర్గ్ లోని తమ ఇంటికి తీసుకొచ్చేసింది కొడుకుని ఆయనకు సుఖవ్యాధి వచ్చిందని దానివల్ల అలా అయ్యాడని బైపోలార్ డిసార్డర్ అని నరాల బలహీనత వల్ల మెదడు దెబ్బ తిన్నదని రకరకాల వాదనలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అవేవి కూడా నిర్ధారణ కానివే నీషే ఈ స్థితిలో ఉన్న సంవత్సరాల్లోనే అతడి మిత్రులు అతడి రాత ప్రతుల్ని పుస్తకాలుగా ప్రచురించారు విచిత్రంగా ఆ పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. నీషే జీవితాంతం కోరుకున్న
(40:49) గుర్తింపు అప్పుడు వస్తుంది కానీ దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేడు ఆయన. 1893 లో ఆయన చెల్లెలి భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఇంటికి తిరిగివచ్చింది తల్లితో కలిసి అన్నయ్య సంరక్షణ చూసుకోసాగింది. అంతవరకు మిత్రులు బాధ్యత తీసుకున్న నీషే పుస్తకాల ప్రచురణ రాత ప్రతుల సంరక్షణ అన్నీ కూడా తన చేతుల్లోకి తీసుకుంది చెల్లెలు ఎలిజిబెత్ 1897లో తల్లి మరణించాక చెల్లి ఆయనకు ఏకైక సంరక్షకురాలు అయింది.
(41:27) అప్పుడప్పుడు అభిమానులు వచ్చి చూసి వెళ్తుండేవాళ్ళు కానీ ఆయనకు అవేమి తెలియవు వాళ్ళతో అర్థవంతంగా మాట్లాడే స్థితిలో కూడా లేడు శారీరకంగా జీవించి ఉన్న తత్వవేత్త తన సొంత కీర్తికి నిశశబ్ద ప్రతిమగా మారిపోయాడు 1898 99 ఆ రెండేళ్లల్లో నీషే కి కనీసం రెండుసార్లు గుండెపోటు వచ్చింది. శరీరంలో ఒకవైపు పూర్తిగా చచ్చుబడిపోయింది పక్షవాతం వచ్చింది.
(41:58) నడవడం మాట్లాడడం కూడా కష్టమైపోయింది. 1900 సంవత్సరం ఆగస్టులో న్యూమోనియా సోకింది. ఆగస్టు 24 25 రాత్రి మరొకసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. 1900 సంవత్సరం ఆగస్టు 25 మధ్యాహ్న సమయంలో నీషే నిజంగా మరణించాడు. భౌతికంగా నిష్క్రమించాడు. అప్పటికీ ఆయన వయసు కేవలం 55 సంవత్సరాలు తాను జన్మించిన రాకెన్ గ్రామంలోనే తండ్రి సమాధి పక్కనే అతన్ని కూడా ఖననం చేశారు.
(42:31) అంటే పాస్టర్ కుమారుడిగా ప్రారంభమైన జీవితం క్రైస్తవ మతంపై అత్యంత తీవ్రమైన విమర్శలతో ముగిసింది. కానీ నీషే కథ అంతటితో ఆగలేదు. నిజానికి పాఠకుల మీద ఆయన రచనల శక్తివంతమైన ప్రభావం ఆయన మరణించిన తర్వాతనే ప్రారంభమయింది. ఇదండీ ఫ్రెడరిక్ నిషే జీవితం ఒక విషాదాంత వైరుధ్యం. ఆత్మబలం గురించి రాసిన తత్వవేత్త జీవితమంతా అనారోగ్యంతో బాధపడ్డాడు.
(43:06) తనని తాను జయించాలి అని చెప్పిన వ్యక్తి చివరి 11 సంవత్సరాలు తన మీద తనే నియంత్రణ కోల్పోయాడు. ఏకాంతాన్ని సృజనాత్మకంగా మార్చుకున్న రచయిత ఒంటరితనంతో బాధపడ్డాడు. క్రైస్తవ మతబోధకుడి కుమారుడు దేవుడు మరణించాడు అని ప్రకటించాడు. జర్మన్ భాషలో గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన రచయిత జర్మన్ జాతీయవాదాన్ని విమర్శించాడు. యూదు వ్యతిరేకతను నిరసించిన వ్యక్తి తన మరణానంతరం యూదు వ్యతిరేకులకు స్ఫూర్తి ప్రదాత అన్న అపప్రధకు లోనయ్యాడు.
(43:40) కానీ ఇన్ని వైరుధ్యాల మధ్య ఒక అవిచ్చిన్న సూత్రం ఉంది. జీవితాన్ని తిరస్కరించవద్దు బాధతో నిండి ఉన్నప్పటికీ మరో ప్రపంచం ఎక్కడో ఉంది అనుకుంటూ నీ ప్రస్తుత జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు నీకు వారసత్వంగా వచ్చిన విలువలను గుడ్డిగా స్వీకరించవద్దు వాటిని పరీక్షించు నీ ఉద్దేశాలను ప్రశ్నించు నీ ఆగ్రహాలను గుర్తించు నీ బలహీనతలకు నైతిక విలువలు అని పేరు పెట్టి దాచుకోవద్దు నీ జీవితానికి బాధ్యత నువ్వే తీసుకో నీపై నువ్వ నువ్వే ప్రయోగం చేయి నిన్ను నువ్వు అధిగమించు చివరకు నీ జీవితంలోని ప్రతిక్షణం మళ్ళీ మళ్ళీ వస్తుందని తెలిస్తే దానికి అవును
(44:26) అని చెప్పగలిగేలాగా జీవించు బహుశా నీషే తత్వంలోని అత్యంత సులభమైన అదే సమయంలో అత్యంత కఠినమైన సవాలు కూడా ఇదే ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మండి అని మనల్ని అడగడు మన నమ్మకాలనే ప్రశ్నించమంటాడు ఒక రెడీమేడ్ అర్థాన్ని ఇవ్వడు అర్థాన్ని సృష్టించుకునే బాధ్యతను మన చేతుల్లో పెడతాడు. అందుకే ఫ్రెడరిక్ నీషే మరణించిన 10 పాతిక సంవత్సరాలు దాటినప్పటికీ ఆయన మనకు సమాధానాలు చెప్పే తత్వవేత్తగా కాకుండా మన సమాధానాలను అసౌకర్యంగా ప్రశ్నించే తత్వవేత్తగా గుర్తుండిపోతాడు.
(45:10) ఇవ్వండి 19 వ శతాబ్దపు విలక్షణ తత్వవేత్త ఫ్రెడరిక్ నిషి గురించి నేను సేకరించి మనకున్న సమయంలో మీకు అందించగలిగినన్ని విశేషాలు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు 10 మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ

No comments:

Post a Comment