Friday, June 25, 2021

మంచి మాట.. లు

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ॥

ఆత్మీయబంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పార్వతి తనయులు విగ్నేశ్వరుడు సుబ్రమణ్యస్వామి వారు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ప్రతి ఉదయం మనం మనసు ఎలా ఉంటుందో మన ప్రవర్తన అలానే ఉంటుంది నేను పదిమందికి ఉపయోగపడే పని చేయాలి. సహాయం చేయాలి అనుకుంటే మీ అడుగులు ఆటే పడతాయి.. నేను ఎవరినుండైనా సహాయం పొందాలి అనే భావనతో ఉదయం అనుకుంటే మీ అడుగులు కళ్ళు కూడా ఆటే దారితిస్తాయి.. ప్రతి ఉదయాన్ని మంచి ఆలోచనలతో పోసిటివ్ దృక్పధంతో ప్రారంభించండి
బుధవారం --: 23-06-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
నిప్పు , అప్పు , పగ , ఈ మూడు జీవితంలో వాటి అంతట అవి తరగవు పెరుగుతునే ఉంటాయి అందుకే నిప్పును అర్పాలి అప్పును తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి వీటిని ఏ మాత్రం మిగిల్చినా వృద్ది చెందుతాయి

నీతులు నీడను ఇవ్వవు , సామెతలు సంపదలను ఇవ్వవు ఆణిముత్యాలు ఆకలి తీర్చవు మంచి మాటలు మరణాన్ని ఆపవు కటేషన్లు కోర్కెలు తీర్చవు శ్లోకాలు స్థోమతలు ఇవ్వవు ప్రపచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తలరాతలు మార్చవు కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావది .

ఒకరిని సంతృప్తి చేయడానికి
మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి .
ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని మార్చుకుని త్యాగం చేసే అంత గొప్ప వ్యక్తిత్వం వారు ఎవ్వరు లేరు ఇక్కడ . పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు . మనసులో ఏది అనిపిస్తే అదే పైకి మాట్లాడతాను , అదే నా బలం నా బలహీనత మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే నేను బ్రతకలేను .

సేకరణ ✒️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాట... లు

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు మా ఇంటి దైవం రామభక్త శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు మరియు తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
మంగళవారం :- 21-07-2021

ఈ రోజు AVB మంచి మాట... లు

చూడు మిత్రమా!

ఇతరులు మన గురించి మాట్లాడే చెడు మన కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది అనుకోవాలి,, దుమ్మును దులుపుకోవాలి,, (దుమ్ము దులపాలి) కానీ అంటిచుకోకూడదు,,,,


ఒక్కో జంతువులో ఒక్కో లక్షణం ఉంటుంది,, కానీ మనిషిలో మాత్రం ప్రతి జంతువు లక్షణం ఉంటుంది,, జీవితంలో ఒకటే గుర్తుంచుకోండి,, బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి,, అది బ్రతుకంటే,,,,

చూడు మిత్రమా!!
జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా పరిగెత్తవచ్చు తప్పులేదు,, కానీ గమ్యం చేరే దారిలో వెనక్కి తిరిగకూడదు,, ఎందుకంటే మనల్ని ఓడించడానికి చాలామంది ఎప్పుడు మన వెనకాలే ఉంటారు,, జాగ్రత్త,,


భయం అనేది ఒక ఊరకుక్క లాంటిది,, అది భయపడితే వెంటబడుతుంది,, దైర్యంగా ఎదురు నిలబడితే పారిపోతుంది,, జీవితం కూడా అంతే,, సమస్యను చూసి బెదిరితే అది పెనుసమస్యగా మారుతుంది,, అందుకే ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కోవాలి,,,,

సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాట....లు

చంద్రః
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. మీరు ఎవరు చెప్పింది విన్నప్పటికి ఆచరించవలిసింది తప్పనిసరిగా నీ మనసు ఎలా చెపితే అలానే..నీ మనస్సు ఎప్పటికి అబద్దం చెప్పదు

సోమవారం --: 21-06-2021 :--

ఈ రోజు AVB మంచి మాట....లు


పట్టుకోవాలని చూడకండి ,
మీకు సరియైనది అయితే ఎపుడూ పరుగెత్తదు ! అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పవచ్చు , అపార్థం చేసుకునే వాళ్లకు చెప్పవచ్చు , కానీ నటించే వాళ్లకు మనం చెప్పలేం ... !
మీ విలువలు ఎవరికోసం తగ్గించుకోకుండా ఉండేందుకు ,
మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేమించుకోండి .

మనకు కష్టాలు కన్నీళ్లు అవహేళనలు నిందలు లాంటి శతృమూకలు నిన్ను చుట్టు ముట్టినా నీవు నీ చిరునవ్వు ఆత్మవిశ్వాసం నిజాయితీ అనే ఆయుధాలతో ముందుకెళ్లడం నేర్చుకో . జీవితంలో పొరపాటు అంటూ చేయని వారు ఎప్పటికి కొత్తగా ఆలోచించలేరు .

ఏ సందర్బంలోనైనా మనం చేయగల అతి గొప్ప పని ఒప్పు వరుసలో తర్వాత చేయగల పని తప్పు ఏ సందర్బంలోనైనా మనం చేయగల అతి హీనమైన పని అసలు ఏమీ చేయకుండా ఉండడం .


నీ జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదూ ఒకరిని బాధపెట్టి మనం అనందపడటం కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం .

నీవు సాధ్యమయినంత వరకు ఎదుటివారికి మంచి చెయ్యడానికి ప్రయత్రించండి మనం చేసిన మంచి తప్పకుండా మనం కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది .

నీకు పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకోసారు .

విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది .

నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైనా బాదైన బలవైనా నష్టం అయినా ఎంత కష్టం అయినా నీ జీవతం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్నా కూడా బానిస బ్రతుకు మాత్రం వద్దు

ఎత్తేసింది లాక్ డౌన్ ను మాత్రమే కరోనా వైరస్ ను కాదు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పని సరి భౌతిక దూరం పాటించండి వ్యాక్సిన్ వేయించుకోవడం మరచి పోవద్దు .

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

Tuesday, June 22, 2021

అగ్ర గామి మనసే!

🌟అగ్ర గామి మనసే!"💥
🕉️🌞🌎🏵️🌼🚩

అన్నిటికీ అగ్రగామి మనసే!’ అంటుంది బౌద్ధుల ధమ్మపదం. మనస్సులో క్రూరత్వం ఉంటే అది కొండరాయి కన్నా కఠినంగా ఉంటుంది. క్రూరత్వం తొలగి, మానవత్వానికి మళ్ళితే అది వెన్నముద్ద కన్నా మెత్తగా ఉంటుందని ప్రపంచానికి చాటిన వ్యక్తి సమ్రాట్‌ అశోకుడు. చరిత్రలో ధర్మరాజుగా పేరు పొందినవాడు.. పాలితులను ‘ప్రజలు’ (అంటే... కన్నబిడ్డలు) అని ప్రకటించిన తొలి చక్రవర్తి. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ప్రతి అడుగులో తన ప్రతిరూపాలను నిలుపుకోగలిగిన ఏకైక మహారాజు.
అశోకుడు వీరుడు. క్రూరుడు కూడా. వారసత్వం ప్రకారం మౌర్య సామ్రాజ్యానికి అతని అన్న సుమనుడు చక్రవర్తి కావాలి. కానీ, అంతఃపుర కుట్రలు జరిగాయి. అన్న సుమనుణ్ణి అశోకుడు చంపాడు. ఈ వార్త తెలిసి, నిండు గర్భిణి అయిన సుమనుడి భార్య ఆరుణి అంతఃపురాన్ని విడిచి పారిపోయింది. అశోకుడు తన సోదరుల్లో తమ్ముడు తిస్సను తప్ప మిగిలిన వారందరినీ చంపేశాడు. పారిపోయిన వదిన కోసం వెతికించాడు. ఆమెను ఒక బౌద్ధ భిక్షువు రక్షించాడు. భిక్షుణీ వేషం వేయించి, వైశాలిలోని బౌద్ధారామానికి చేర్చాడు. కొన్నాళ్ళకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డడి పేరు నిగ్రోధుడు.
పుష్కర కాలం గడిచింది. కళింగ యుద్ధం తరువాత అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. చండ అశోకుడు ధర్మ అశోకునిగా మారాడు. ఒక రోజు అశోకుడు తన భవనం పైనుంచి రాజవీధిలోకి చూస్తున్నాడు. ఆ వీధిలో ఒక యువ భిక్షువు నడచి వస్తున్నాడు. మంచి వర్చస్సు, శాంతి తేజస్సు అతని ముఖంలో తాండవిస్తోంది. అతని నడకలో ధర్మ రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వెంటనే పరివారాన్ని పిలిచి ‘‘ఆ యువ భిక్షువును మా మందిరానికి ఆహ్వానించండి’’ అని చెప్పి పంపించాడు అశోకుడు.
ఈ విషయం మంత్రులకు తెలిసింది. కలవరపడ్డారు. భయపడ్డారు. ఆ భిక్షువు ఎవరో వారికి తెలుసు. అశోకునికి తెలియదు. ఒకవేళ అతను ఎవరో తెలిస్తే... అశోకుడు ఏం చేస్తాడో? అనే భయం... ఎందుకంటే ఆ భిక్షువు అశోకుడి అన్న సుమనుడి కొడుకు నిగ్రోధుడు.
అశోకుని పరివారం వెళ్ళి... భిక్షువును లోపలికి తీసుకువచ్చారు. అఖండ జంబూ ద్వీపానికి చక్రవర్తి అయిన అశోకుడు ఆ భిక్షువుకు ఎదురుగా వచ్చాడు. భక్తితో అతని భిక్ష పాత్ర అందుకొని పట్టుకున్నాడు. వినమ్రంగా వంగి వంగి నడచి, తన సింహాసనం పక్కన ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ యువ భిక్షువు చేసిన ధర్మోపదేశం విని పరవశించిపోయాడు. వంగి అతని పాదాలకు తన శిరస్సును ఆనించి ప్రణమిల్లాడు. ఆ యువ భిక్షువు తన అన్న కుమారుడేనని తెలిసి, అతని పాదాల చెంత కూర్చొని విలపించాడు. విక్రోధుడు ఎప్పుడు ధర్మప్రబోధం చేసినా, అశోకుడు అతని పాదాల దగ్గరే కూర్చొనేవాడు. అశోకునికి విక్రోధుడు చేసిన ప్రబోధమే ధమ్మపదంలో ‘అప్రమాదవర్గ’గా ప్రసిద్ధి!
బుద్ధుని కాలంలో బౌద్ధ సంఘానికి మహాదానం చేసిన అనాథపిండుకునితో సమానంగా... వంద కోట్ల బంగారు నాణేలు దానంగా సమర్పించాలని అశోకుడు అనుకున్నాడు. అతనికి డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి తొంభై ఆరు కోట్లు దానం చేశాడు. ఆ తరువాత అశోకుని కుమారుడైన కుణాలుడి కొడుకు సంప్రదిన్‌ సింహాసనాన్ని అధిరోహించాడు. ఇక దానాలు చేయకుండా అశోకుణ్ణి ఒక గదికి పరిమితం చేశాడు.
‘ఇంకా నాలుగు కోట్ల దానం మిగిలి ఉంది. ఏం చేయాలి?’ అని అశోకుడు ఆవేదన పడ్డాడు.ప్రతిరోజూ బంగారు పళ్ళెంలో ఆహారం వచ్చేది. ఆ వచ్చిన పళ్ళేలను దానంగా పంపేవాడు. ఇది తెలిసి అతని మనుమడు వెండి కంచాల్లో ఆహారం పంపించాడు. అశోకుడు వాటినీ దానం చేశాడు. ఆ తరువాత రాగి కంచాలు, చివరకు మట్టి మూకుళ్ళు వస్తే వాటిని కూడా దానంగా సమర్పించాడు. ఆఖరికి ఆకుల్లో ఆహారం వచ్చేది. తాను తినకుండా ఆ ఆహారం మొత్తం దానం చేసేవాడు. ఒక రోజు ఆహార పదార్థాలకు బదులు సగం ఉసిరికాయ భోజనంగా వచ్చింది.
‘‘ఓ భిక్షువులారా! మహాదాత, మహా వీరుడు, నాలుగు సముద్రాలు ఎల్లలుగా ఉన్న భూమండలానికి అధిపతి అయిన అశోక మౌర్యుడు... చివరకు ఈ సగం ఉసిరికాయనే దానంగా
పంపగలుగుతున్నాడు’’ అనే సందేశాన్ని పంపిస్తూ, ఆ ఉసిరికాయ ముక్కను కూడా దానం చేశాడు అశోకుడు. ఆ సగం ఉసిరికాయకు గుర్తుగా పాటలీపుత్రంలో... అదే ఆకారంలో ఒక బౌద్ధ స్థూపాన్ని నిర్మించారు. అది అశోక ‘ఆమ్లకారామం’గా ప్రసిద్ధి చెందింది.

అశోకుని మరణానంతరం తన త్పపును తెలుసుకున్న సంప్రదిన్‌ నాలుగు కోట్ల నాణేల్ని సంఘానికి దానం చేసి, తన తాతగారి కోర్కెను తీర్చాడు. అలా అశోకుడు మహాదాతగా నిలిచాడు. భారతదేశ స్మృతిలో చిరంజీవి అయ్యాడు.*

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, June 19, 2021

మంచిమాట.

 

మంచిమాట.
మంచిని చూస్తూ ... చెడు సమయాన్ని దాటెద్దాం ....

🔸 ఆదివారం అయిపోతుందని చింత లేదు.

🔸 సోమవారం వస్తుందనే భయం లేదు.

🔸 డబ్బు సంపాదించాలనే మోహము లేదు .

🔸 ఖర్చు పెట్టే ఆసక్తి లేదు.

🔸 హోటల్ లో తినాలనే కోరిక లేదు.

🔸 బయట తిరిగే ఆలోచన లేదు.

🔸 బంగారం వెండి పై మోహము లేదు.

🔸 కొత్త బట్టలు ధరించాలనే ఆతృత లేదు.

🔸 సుందరంగా తయారవ్వాలనే చింత లేదు .

🔸 పూజా, వ్రతం, పరివారం జతలో ఉపవాసం ... రోజూ కాసేపు ఏదో ఒక మంచి విషయం ..

🔸 ఆరోగ్యం పై మరింత శ్రద్ధ

🔸 కాలుష్య రహిత వాతావరణం

🔸 పరుగుతో నిండిన జీవనం సమాప్తి

🔸 ఏ నౌకర్లు లేరు..ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు

🔸 ఆసక్తి కల వారు దాన ధర్మాలు చేస్తున్నారు - మానవత్వం మరియు మంచి పంచుతున్నారు ....

ఈ చెడు కాలం లో ఎంతో కొంత మంచి నేర్చుకుని ... మనం అనుకునే మంచి కాలం లో కూడా పాటిద్దాం .. మంచిని మరింత మంచితో నిoపుదాం....

ఉషోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

విలువైన కాలం

విలువైన కాలం
మనిషిగా జన్మనెత్తాం. బతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసిఉండాలి . కాలం చాలా విలువైనది. పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించినవారే విజయసోపానాలు అధిరోహించగలిగేది!

ఇద్దరు ఒకే రోజున, ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు. అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకల్యాణం కోసం అహర్నిశలూ తపిస్తారు.
నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పనిచేయవలసిన అవసరం ఉండదు.

కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణమూ వృథా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. భూమ్మీదకు ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాలనిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులూ ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్షు గురించి ఆలోచన అనవసరం. అయితే గియితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి.

కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులుంటాయి. ధర్మం మారుతుంది. సంఘం మారుతుంది. మనిషి మారతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది.

కాలం చాలా గొప్పది. కాని దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు. అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుడి కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు. కాలాన్ని దివ్యం చేశారు. కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చిపారేస్తుంది. కాలమే పెను మార్పులకు గురిచేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టేసి చోద్యం చూస్తుంది. మనమొక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని, జారిపోకుండా వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.

దెబ్బ తగిలింది... మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు. దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్నా కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలమూ చికిత్సలో భాగమే.

ప్రతి క్షణం మనం కాలంలోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడుకాలం, మంచి కాలమని మనిషి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటాడు. నిజానికి కాలం నిమిత్తమాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి.

దైవాంశ సంభూతులం కాని మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయంకోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన వివేకం. అదే నిజమైన ప్రజ్ఞ!

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచి మాట... లు

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ॥

రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ॥

కేతుః
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం

వేంకటేశ్వర శ్లోకః
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శనివారం శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. మంచిని చేయండి మానవత్వం పెంచండి 💐🤝🙏

శనివారం --:
19-06-2021 :--

ఈ రోజు AVB మంచి మాట... లు

ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం ఇతరులను నవ్విస్తే అది ఆనందం నీవ్వు నవ్వుతూ ఇతరులనీ నవ్విస్తూ పది కాలాల పాటు నడిస్తే అదే అనుబంధం ఈ రోజు నుండే నీ చిరునవ్వుతో ప్రారంభించు నేస్తమా !

పుట్టుకతో పూల వనం కాదు! ఏ ఒక్కరి జీవితం . అందరి జీవితాలు పడి లేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమిపై సమస్యలు లేని మనిషేలేడు అందుకే రేపటిరోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించటం అలవరుచుకోవాలి అదే మన జీవన రహస్యం .

ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి .

మీరు గతాన్ని తలపోస్తూ భవిష్యత్తును ఆలోచిస్తూక్షణాన్ని వదిలివేయరాదు . ఈ రోజు నుండే మీరు ప్రతీరోజును స్వీకరించి సద్వినియోగం చేసుకోవటం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ క్షణం మీరు ఆలోచించేలోపే గతిస్తుంది చేసిన ఫలితం మాత్రమే కనిపిస్తుంది .

సేకరణ✒️ *మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

Friday, June 18, 2021

శివాజీ

 *జూన్ 22 హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా మెగామైండ్స్ మీకందిస్తుంది.. చదవండి శేర్ చేసి మద్ధతు తెలుపండి*


*శివాజీ పట్టాభిషేకం - హిందూ సామ్రాజ్య దినోత్సవం*

https://www.megamindsindia.in/2019/06/hindu-samrajya-diwas-speech.html


*హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీ*

https://www.megamindsindia.in/2020/06/about-hindu-smrajya-diwas-megaminds.html


*చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర*

https://www.megamindsindia.in/2020/02/chatrapati-shivaji-maharaj-biography-in.html


*శివాజీ గొప్ప ఆర్ధిక వేత్త, పరిపాలనా రహస్యాలు*

https://www.megamindsindia.in/2020/05/about-shivaji-maharaj-ruling-and.html


*నేతాజీ పాల్కర్ ని హిందూధర్మంలోకి తిరిగి తీసుకువచ్చిన శివాజీ*

https://www.megamindsindia.in/2020/11/about-netaji-palkar-in-telugu-megaminds.html


*రాజా జయసింహునికి శివాజీ లేఖ*

https://www.megamindsindia.in/2020/03/shivajis-letter-to-raja-jayasimha.html


*అఫ్జల్ ఖాన్ ని శివాజీ ఎలా వధించాడు?*

https://www.megamindsindia.in/2020/11/who-killed-afzal-khan-megamindsi.html


*హీరా ఖాణి రాయగడ్ కోటలో పాలమ్మాయి*

https://www.megamindsindia.in/2019/12/about-hirkani-life-story-hirakani-life.html


*శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా మతం మారని శివాజీ కొడుకు*

https://www.megamindsindia.in/2020/11/about-chtrapati-sambhaji-in-telugu.html


*శివాజీ ని హిందూ సమాజంకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందా?*

https://www.megamindsindia.in/2020/06/about-shivaji-and-hinduism-megamind.html


*ఎంతో శ్రమకోర్చి మా ప్రయత్నం మేము చేశాము... మీ మిత్రులకు అలాగే గ్రూపులలో పంపండి.. మన చరిత్రను మన తరం తెలుసుకుని భవిష్యత్ తరానికి తెలియజేద్దాం...*

ఆణి ముత్యాలు.

ఆణిముత్యాలు.

1.కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

2.సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు.
దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి.
ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు.
ఎడతెగని ప్రయత్నం కావాలి.

3.ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు.
అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.

4.మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.

5.గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు.
కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది.
అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు.
కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.

6.బలవంతుడికీ బలహీముడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు.
బలవంతుడి పక్షం వహించినట్లు.

7.అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.

8.అహంకారమ ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.

9.ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.

10.నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.

11.మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుంఖామికి నిదర్శనం.

12.బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.

13.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు.
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.

14.పక్షులకు కొంత ధాన్యం, ఫశువులకి కొంత గ్రాసం, మవిషికి కొంత సాయం….ఇదే జీవితం.

15.ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కాలీ ఉన్నత పదవి వల్ల కాదు… శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాతేదు.

16.తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే భాధ తగ్గుతుంది.
కానీ ఆకలి భాధనూ, అజ్ఞాన భాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.

17.మంచివారు దూరంకావడం, చెద్దవారు దగ్గరకావడమే దంఖానికు నిదర్శనం.

18.మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.

19.కేవలం దబ్బుంటే సరిపోదు.మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.

20.ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. 💐☀

Source - Whatsapp Message

ఆణిముత్యాలు.

ఆణిముత్యాలు.

💧మనకు అత్యంత అవసరమైంది, మనం అతిగా వృధా చేసేది.. మన కాలాన్నే! మన దుఃఖాల్లో సగానికి కారణం.. మనం దుర్వినియోగం చేసిన సమయమే!


🎈నేడు అద్భుతంగా జీవించాలి. అప్పుడు గడిచిన ప్రతి రోజు! తీపి జ్ఞాపకం అవుతుంది. రాబోయే ప్రతి రేపూ.. ఓ ఆశా జ్యోతి అవుతుంది.

🎈మన తీరిక సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. క్షణాలు సానబట్టని వజ్రాల్లాంటివి. వృథా చేసుకుంటే విలువను ఎన్నటికీ తెలుసుకోలేం! కానీ మెరుగు పెడితే అవి మన అద్భుత జీవనంలో మిలమిలమని మెరిసే రత్నాలుగా రూపొందుతాయి.

🎈ఈ ప్రపంచంలో అతి కష్టమైన పనులు మూడున్నాయి. అవి రహస్యాన్ని దాయడం, గాయాన్ని మరవడం, తీరిక సమయాన్ని సద్వినియోగం చేయడం.

🎈పోయిన సంపదను కష్టపడి సంపాదించుకోవచ్చు. మరిచిపోయిన విషయాల్ని మళ్ళీ చదువుకుని జ్ఞాపకం చేసుకోవచ్చు. చెడిపోయిన ఆరోగ్యాన్ని మందులు మరియు మితాహారం ద్వారా బాగు చేసుకోవచ్చు. కానీ వృథా అయి.. పోయిన.. సమయాన్ని తిరిగి పొందడం అసంభవం.

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి చిట్టికథ, అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

✍️... నేటి చిట్టికథ
🌹🌹🌹🌹🌹🌹

వంగదేశాన్ని సుశేనుడు అనే రాజు పాలించేవాడు.

అతనికి బలమైన సైన్యం ఉండేది. పక్కదేశాలపై దండెత్తాడు. ఆక్రమించాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ సామంత రాజ్యాలయ్యాయి.

ఐశ్వర్యంతో, అధికారంతో సృష్టిలో తనని మించినవాడు లేడని రాజు గర్వించాడు.

చుట్టూ కావలసినంత మంది భజనపరులు రాజుకు ఉంటారు. వారి పని రాజును కీర్తించడమే. ఒకడు ఇంద్రుడంటాడు, ఇంకొకడు చంద్రుడంటాడు. మరొకడు దాన కర్ణుడంటాడు. ఇట్లా ఎందరు ఎన్ని రకాలుగా కీర్తించినా ఇంకా ఏదో అసంతృప్తి రాజుకు మిగిలింది.

భజనలో ఆరితేరిన ఒకడు “రాజా! రాజమార్తాండా! నువ్వు సృష్టికర్త కన్నా గొప్పవాడవు. భగవంతుని కన్నా బలమైన వాడవు” అని పొగిడాడు.

అప్పటిదాకా విన్న పొగడ్తలకన్నా ఇది రాజుకు బాగానచ్చింది. భట్రాజును ఘనంగా సత్కరించాడు.

ప్రతిరోజూ భగవంతుడి కన్నా గొప్పవాడు ఈ రాజు అని అర్థం వచ్చే పాటలు, కవులు రాసినవి గాయకులు ఆలపించేవారు.



ఈ వార్త దేశమంతా వ్యాపించి అందరూ ముక్కుమీద వేలు వేసుకున్నారు.

ఆ మాటలు విన్న రాజగురువు రాజుగారి సభకు వచ్చి “రాజా! మీరు దేవుడికన్నా గొప్పవారు” అన్నారు.

రాజు “ఆ సంగతి మాకు తెలుసు, దాన్ని మించింది ఏదైనా ఉంటే చెప్పండి” అన్నాడు పొగరుగా.

గురువు గారు “మీరు ఎంత గొప్పవారంటే మీరు చేసేపని దేవుడు కూడా చేయలేడు” అన్నాడు.

“ఇది బాగుంది. మరి ఆ పని ఏదో చెప్పండి” అన్నాడు రాజు ఆసక్తిగా.

గురువుగారు “రాజు! దేశంలో ఎవరయినా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అతనికి దేశ బహిష్కార శిక్ష విధించవచ్చు. అంటే అతన్ని దేశం నించీ తరిమేయవచ్చు. కానీ పాపం దేవుడు తనకు ఎదురు తిరిగిన వాణ్ణి తన రాజ్యంనించీ తరిమెయ్యలేడు. ఎందుకంటే ఈ అనంత విశ్వం ఆయన సృష్టే కదా!” అన్నాడు.

ఆ మాటల్తో రాజు అహంకారం ఆవిరైపోయింది.

గురువుగారి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు.

🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴

అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...

భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి

1. భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
28. భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.
100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
105. తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.

Source - Whatsapp Message

తల రాత

🍁తల రాత🍁

✍️ మురళీ మోహన్

👉నీ తలరాత దేవుడు రాయడు.నీవు చేసే మానవ ప్రయత్నం వల్ల మరియు నీ పరిధిలో లేని ప్రక్రుతి శక్తి వల్ల నీకు ఫలితాలు వస్తాయి. కాని, పై రెండింటిలో మానవ ప్రయత్నానికే ఎక్కువ సందర్భాలలో ప్రాధాన్యత ఉంటుంది. నువ్వు చేసే మానవ ప్రయత్నం తీవ్రమైనదిగా, అద్భుతమైనడిగా కావడానికి భగవత్ ధ్యానం ఉపయోగ పడుతుంది. ప్రకృతిని అవగాహన చేసుకుని, మనః పూర్వకమైన మంత్ర పఠనం తో ప్రక్రుతి కూడా నీకు అనుకూలించేలా చేసుకోవచ్చు. గుడికి వెళ్ళడం అనేది నీ మనస్సుని భగవంతుని వైపుగా దృష్టి మరలింప చేయడం కోసమే. నీ మనస్సు భగవత్ శక్తితో నిండి ఉన్నపుడు ఏ దేవాలయం నీకు అవసరం లేదు.👍*

Source - Whatsapp Message

భగవంతుడు చెడుని సృష్టించాడా?

🐤భగవంతుడు చెడుని సృష్టించాడా?🐤

✍️ మురళీ మోహన్

👌ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసరుగారు పరమ నాస్తికుడు. అంతవరకూ ఫర్వాలేదు కానీ ఆయన వీలయినప్పుడల్లా తన తరగతి గదుల్లో భగవంతుని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఓ రోజు దేవుడి గురంచి కాసేపు విద్యార్థులను ఆటపట్టిద్దామనుకుంటూ తరగతిలోకి ప్రవేశించారు ప్రొఫెసరుగారు…
‘ఈ ప్రపంచంలో ప్రతిదానినీ భగవంతుడే సృష్టించాడని మీరనుకుంటున్నారా?’ అంటూ విద్యార్థులను సూటిగా అడిగారు ప్రొఫెసరుగారు.
‘ఓ! ఆ విషయంలో మాకెలాంటి అనుమానమూ లేదు!’ అని బదులిచ్చారు ఆస్తికులైన కొందరు విద్యార్థులు.
‘మీరు చెప్పినదాని మీద మీరు నిలబడతారా?’ అని మళ్లీ ప్రశ్నించారు ప్రొఫెసరుగారు.
‘తప్పకుండా!’ అన్నారు విద్యార్థులు.
‘అయితే మీరన్న మాట ప్రకారం భగవంతుడు పరమ దుర్మార్గుడై ఉండాలి. ఎందుకంటే మీ మాటల ప్రకారం అతను ఈ లోకంలోని చెడునీ, స్వార్థాన్నీ కూడా సృష్టించి ఉండాలి కదా! అంచేత దేవుడు దుర్మార్గుడన్నమాటే’ అనేశారు.
ప్రొఫెసరుగారి మాటలకి ఏం జవాబు చెప్పాలో విద్యార్థులకి అర్థం కాలేదు. తరగతి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో ఓ విద్యార్థి లేచి ‘ప్రొఫెసరుగారూ మీరు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు కదా! మేం కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగవచ్చా!’ అని అడిగాడు.
‘తప్పకుండా’ అన్నారు ప్రొఫెసరుగారు నిర్భయంగా.
‘మీ దృష్టిలో చలి అనేది ఉందా?’ అని అడిగాడు సిగ్గుపడుతూ.
‘ఏం నీకెప్పుడూ చలి వేయలేదా’ అని ఎగతాళి చేస్తూ ‘ఈ ప్రపంచంలో వేడి ఉంటే చలి కూడా ఉన్నట్లే కదా!’ అన్నారు.
‘కానీ భౌతికశాస్త్రం రీత్యా వేడి లేకపోవడమే చలి. అంతేకానీ చలి ప్రత్యేకించి ఉండదు. ఎంత వేడిగా ఉందని కొలుస్తారు కానీ ఎంత చల్లగా ఉందో కొలవరు కదా! వేడి తగ్గుతున్న కొద్దీ దాన్నే చలిగా భావిస్తాము. సరే. ఇప్పుడు ఇంకో ప్రశ్నని అడుగుతాను. మీ దృష్టిలో చీకటి ఉందా!’ అన్నాడు విద్యార్థి.
అప్పటికే విద్యార్థి మాటలో ప్రొఫెసర్‌గారికి కాస్త ఇబ్బందిగా ఉంది. అయినా మాటలు కూడగట్టుకుని ‘తప్పకుండా! చీకటి లేకపోవడమేంటి. రాత్రి అయితే చీకటి ఎలా ఉంటుందో చూడవచ్చు కదా!’ అన్నారు.
‘ప్రొఫెసర్! మీ విజ్ఞానం ప్రకారం చీకటి అనేది ప్రత్యేకంగా ఉండదు. వెలుతురు లేకపోవడమే చీకటి. ఆ వెలుతురిని రకరకాలుగా పరిశోధించవచ్చు. అందులోంచి వెలువడే సప్తవర్ణాలను చూడవచ్చు. చూడటం అన్నదే వెలుతురుతో సాధ్యమవుతుంది. అది లేకపోవడమే చీకటి.’ అన్నాడు.
ప్రొఫెసర్ గారికి ఈ వాదన ఎక్కడికి వెళ్తుందో అర్థం కాలేదు. అప్పుడు అడిగాడు విద్యార్థి…. ‘సర్‌! ఇప్పుడు చెప్పండి. ఈ ప్రపంచంలో చెడు ఉందా!’ అని
‘లేకపోవడం ఏంటి! పొద్దున్నే లేచిన దగ్గర్నుంచీ ఎన్ని ఘోరాలు చూడటం లేదు. ఎన్ని దారుణాల గురించి చదవడం లేదు. ఇవన్నీ చెడుకి మరో రూపం కాక ఇంకేంటి!’ అని అన్నారు ఆవేశంగా.
‘అయ్యా! మీరన్నట్లు చెడు ప్రత్యేకించి ఉండదు. మంచితనం, విచక్షణ, సహనం లోపించడమే దుర్మార్గం. ఎలాగైతే వేడి లేకపోవడాన్ని చల్లదనం అనీ, వెలుగు లేకపోవడాన్నీ చీకటి అనీ అంటామో… మంచితనం లేకపోవడమే చెడు. భగవంతుడు చెడుని సృష్టించలేదు. ఆయన కరుణనీ, ప్రేమనీ సృష్టించాడు. మనలో అవి లోపించినప్పుడే దుర్మార్గం ప్రాణం పోసుకుంటుంది! ఇప్పుడు చెప్పండి భగవంతుడు దుర్మార్గుడా?’ అని అడిగాడు.
దానికి ప్రొఫెసరుగారి దగ్గర ఎలాంటి జవాబూ లేకపోయింది. 🤔

Source - Whatsapp Message

ఒక్కటి చాలు!

ఒక్కటి చాలు!

వాహనం ఒక్కటి చాలు - కాలుష్యం ఎక్కువైంది కాబట్టి

సెల్ ఫోన్ ఒక్కటి చాలు - రేడియేషన్ ఎక్కువైంది కాబట్టి

సిమ్ కార్డు ఒక్కటి చాలు - ఇప్పటికే గందరగోళం ఎక్కువైంది కాబట్టి

ఇల్లు ఒక్కటి చాలు - కాంక్రీటు జంగిల్ ఎక్కువైంది కాబట్టి

సోషల్ మీడియా ఒక్కటి చాలు - సమయం వృధా అవుతుంది కాబట్టి

ఉద్యోగం ఒక్కటి చాలు - నిరుద్యోగం ఎక్కువైంది కాబట్టి

టెలివిజన్ ఒక్కటి చాలు - ఇప్పటికే ఇంట్లో మాట్లోడుకోవడం తగ్గిపోయింది కాబట్టి

పదవి ఒక్కటి చాలు - వేరే వారికి అవకాశాలు తగ్గుతాయి కాబట్టి

ఏదైనా వ్యాపకం ఒక్కటి చాలు - కుటుంబానికి కేటాయించే టైం తగ్గిపోతుంది కాబట్టి

చివరికి జీవితం కూడా ఒక్కటి చాలు - నాణ్యత తగ్గిపోయింది కాబట్టి...!!

Source - Whatsapp Message

ప్రేమ రాహిత్యం వల్ల వచ్చే సమస్యలు ఒకరకమైతే ప్రేమతో వచ్చేవి మరో రకం..

🌸ప్రేమ..అనే పదం అన్ని జీవరాసుల హృదయాలను తెరిచే తాళంచెవి... దీనిని ఉపయోగించే తీరుని బట్టి దీనికి అదనపు శక్తి సమకూరుతుంది అనేది వాస్తవం...

ప్రేమను మనం బయట వెధకాల్సిన పని లేదు... మనలో ఓ అంతర్గతంగా ఉంది...
ప్రేమ ఏమి చేయదు కానీ ప్రేమ లేకపోతే ఏ పని చెయ్యలేము... అంతకన్నా ప్రేమ గురించి ఏమి చెప్పిన తక్కువే...

🌸 ప్రతి జీవి తన పిల్లలకు ప్రేమతో మొదట ఆహారం అందిస్తుంది... ఆహారంతో ఉన్న ప్రేమను పిల్లలు స్వీకరిస్తారు... అది దొరకకపోతే పసిపిల్లలు విపరీతంగా ఏడుస్తారు... కొంచెం పెద్దయితే అంటే 5 సంవత్సరాల పిల్లలైతే అల్లరి తట్టుకోలేనంత చేస్తారు. కారణం గారాభం కాదు కావలసిన ప్రేమ అందకపోవడం... ప్రేమ కావాలి అని ఇలాగే చెబుతున్నారు గట్టిగా... మనం వారికి సమయం కేటాయించి వారితో ఉన్నన్నాళ్లు ఇంట్లో పిల్లల వలన సమస్యలు ఉండవు.. ఆ సమయం వేరే దేనికి కేటాయించిన ఇంట్లో ఇల్లాలికి శిక్ష అవుతుంది... ఆడవారికి కూడా ఇదే వర్తిస్తుంది...

🌸 ఓ చిన్న ఉదాహరణ. ఓ పిల్ల రోజు ఒకే సమయంలో ఏడుస్తున్నది కారణం తెలియలేదు... పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకేళితే అన్ని పరీక్షలు చేసి తల్లి ఒక్కటే వస్తే చాలదు.. తండ్రిని పిలవండి మీరిరువు ఉంటేనే అసలు విషయం చెబుతా అని వారిని నిరీక్షణలో ఉంచారు.. తండ్రి రాగానే డాక్టర్ అడిగిన మొదటి ప్రశ్న పిల్ల కడుపులో ఉండగా మీరిద్దరూ సాయంసమయంలో ఏంచేసేవారు అని అడితే వాళ్ళు చెప్పిన విషయం సాయంత్రం రోజు బీసెంట్ రోడ్డులో వాకింగ్ కి తీసుకెళ్లేవాడిని అని చెప్పారు..ఆ డాక్టర్ చెప్పిన విషయం ఆ ప్రేమకు ఉన్న శక్తిని చూపించింది అంటే నమ్మలేము..

మీరిద్దరూ అప్పుడు ఎంత ప్రేమగా బీసెంట్ రొడ్డలో తిరిగారో ఇప్పుడు అదే సమయంలో అంతే ప్రేమగా తిరిగితే చాలు.. అని చెప్పగానే.. తను ఒక్కటి తిరిగితే సరిపోదా అనే ప్రశ్నకు సమాధానం ... మీరిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం పాప విన్నది. కానీ అందులోని ప్రేమను మాత్రమే తీసుకున్నది. ఇప్పుడు అదే కావాలి తనకు..అంటూ మందులు ఏమి రాయకుండా పంపేసిన డాక్టర్ గారికి ప్రేమ విలువ తెలుసు...

ప్రేమ రాహిత్యం వల్ల వచ్చే సమస్యలు ఒకరకమైతే ప్రేమతో వచ్చేవి మరో రకం..

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు

ప్రాణమున్న ప్రతి మనిషికి మరణ భయం అనేది ఉంటుంది..


“కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణ రెప్పపాటే జీవితమున్న సత్యాన్ని మరచి ఐహిక సుఖల మీద వ్యామోహంతో, పాపభీతి విడిచి, ఆస్తుల సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు మనిషి. బ్రతుకు మీదున్న తీపితో నేరాలు, ఘోరాలు తలపెడుతున్నాడు.


బ్రతుకు తీపి ఎన్ని ఆశలు రేకెత్తిస్తుందో మరణ భయం అన్ని బాధలు కలిగిస్తుంది.


సృష్టిలో శాశ్వతమైనదేదీ లేదని నశించడం తప్పదన్న వివేకం లోపించినపుడు తానే శాశ్వతంగా, అజేయుడని భావిస్తాడు.


ప్రతి జన్మకు సార్థకత ఆవసరం. ఆ ప్రయత్నంలో ధర్మబద్ధమైన ఆశయాలు ఎంచుకుని ఆశనే శ్వాసగా జీవిస్తూ ధర్మమార్గంలో పయనించాలి. కొన్నిసార్లు చేసిన పొరపాట్లు ప్రాణాలు కోరతాయి.


గంధరుడైన గయుడు శ్రీకృష్ణుడి దోసిలిలో ఉమ్మిన పాపానికి అర్జునుడుని శరణు కోరి ప్రాణం నిలబెట్టు కున్నాడు.


మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడు విష్ణువును ప్రార్ధించి గట్టెక్కాడు. అధికార ముందన్న అహంకారంతో, గొప్పవారిమన్న గర్వంతో ధర్మానికి హాని చేసేవారు ఉన్నారు.


అసూయతో యుద్దానికి కాలు దువ్వి విపత్కర పరిస్థితులలో ప్రాణభయంతో మడుగులో దాగిన దుర్యోధనుడి కథ భారతం వివరించింది.


సోదరి సంతానాన్ని కంసుడు సంహరించింటే ప్రాణభయంతోనే. కానీ అన్నిచోట్లా ధర్మమే గెలిచింది.


కొన్ని జీవితాలు జాతికి, లోకానికి ప్రయోజనకరమున్న భావనతోనే లక్ష్మణుణ్ణి సంజీవనితో పునర్జీవితుణ్ణి చేశాడు ఆంజనేయుడు.


పరాయి స్త్రీని కామించిన పాపానికి హతమయ్యాడు రావణుడు. పది తలల వాడైనా పరమాత్ముడి ముందు పరాజయం తప్పదని రామాయణం చెప్పింది.


విధిరాతకు, విధాత వేటుకు జీవులంతా బద్దులే. మృత్యువు అనివార్యమని గ్రహించి ప్రతిక్షణం లోక కళ్యాణానికి సిద్ధపడాలి.


సీతాదేవి రక్షణకై ప్రాణమిచ్చిన జటాయువు, దేశరక్షణ కోసం అమరులైన సైనికులు పరోపకారం కోసం ప్రాణత్యాగం చేసినవారే.


'జన్మించిన వారికి మరణం., మరణించిన వారికి జన్మం తప్పదన్న' గీతాకారుడి భాష్యం అవగతం చేసుకుంటే మరణ భయం కలగదు.


తక్షకుడి కాటుకు మరణించే సమాచారం తెలిసిన పరీక్షిత్తు కలవరపడలేదు. గంగా తీరం చేరుకొని శుకమహర్షి ద్వారా భాగవత కథలు విని తరించి, గుండె నిబ్బరంతో ప్రవర్తించాలన్న సత్యాన్ని అందించాడు.


జీవితం అశాశ్వతమని, మృత్యువు తథ్యమనే వివేకం, స్పేృహతో మనుషులుగా ప్రవర్తిస్తూ, విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి !

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచి మాట. లు

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. గాయత్రీ, సరస్వతి, దుర్గా పార్వతి మరియు అష్ట లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐💐👍
శుక్రవారం --: 18-06-2021 :--

నేటి AVB మంచి మాట. లు

అందరినీ విమర్శించే వారు ఎప్పటికి మనశ్శాంతిగా జీవించలేరు . కానీ అందరినీ సరదాగా పరామర్శించే వారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు . అందరూ బాగుండాలి అందులో మనముండాలి .

స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కపడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం .

సమయం , ఆరోగ్యం , బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అది కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి .

అందరూ ఒకేలా మన లాగా మంచిగా ఆలోచించరు మీ దృష్టి లో అది తప్పు అయ్యుండొచ్చు కానీ వాళ్ల దృష్టిలో అదే కరెక్ట్ అయ్యుండొచ్చు పరిస్థితులు బట్టి అందరికీ మంచి చెడు అనేది తెలుస్తుంది నీది కాని రోజున కూడా అంతే స్థాయిలో నిలబడడమే జీవితం నీదైనా రోజున నీకు ఎదురే ఉండదు

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు

🌹మన మంచితనం గురించి ఇతరులకు చెప్పకూడదు. కారణం వారు నమ్మరు.

మన చెడును మరొకరికి తెలుపకూడదు. కారణం దానికి మరికొంత జోడించి ఊహించుకుంటారు.

జీవితంలో ఒంటరిగా నడవడం నేర్చుకోవాలి.

ఈరోజు మన వెంట ఉన్నవాళ్లు రేపు మన వెంట నడుస్తారనే నమ్మకం లేదు.

జీవితం చాలా చిన్నది.
ఇతరులను ద్వెేషిస్తూ కాలాన్ని వృథా చేయకు.

చావొస్తుందని తెలిసినా బతికేస్తున్నాం.
మరి బాధ వస్తే బతకలేమా ?

క్షమించటం, ప్రేమించడం, నేర్చుకో.
జీవితం ఆనందమయం అవుతుంది.

తన పొరపాట్ల నుంచే కాదు.
ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..

జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..

🌷🌷🌷✨✨✨🌷🌷🌷

మానవునకు రోగం కలిగించేది ' పాపం ' .
మానవునకు భోగం కలిగించేది ' పుణ్యం ' .
మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ' కర్మ ' .

మానవునకు లాభం కలిగించేది ' సేవ ' .
మానవునకు సంపాదన నిలిపేది ' పొదుపు '
మానవుని విలువ పెంచేది ' దానం ' .

మానవునకు నష్టం కలిగించేది ' హింస ' .
మానవునకు అశాంతి కలిగించేది ' ఆశ ' .
మానవునకు శాంతి కలిగించేది ' తృప్తి ' .

మానవునకు దుఃఖం కలిగించేది ' కామం ' . మానవుని పతనం చేసేది ' అహంకారం ' .
మానవునకు అందరిని దగ్గర చేసేది ' ప్రేమ '

మానవునకు అందరినీ దూరం చేసేది ' అసూయ ' .
మానవుని స్థితిని సూచించేది ' గుణం ' .
మానవుని దైవంగా మార్చేది
' దయ

మానవుని ఆత్మస్థితి తెలిపేది ' వాక్కు ' .
మానవునకు విజయం చేకూర్చేది ' ధర్మం ' .
మానవుని గొప్పవాడిగా చేసేది ' జ్ఞానం ' .

మానవునకు ' ముక్తి'ని ఇచ్చేది సత్యం ' .
మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ' జపం / ధ్యానం ' .

అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.

✨✨✨🌷🌷🌷✨

Source - Whatsapp Message

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.

🙂🙂🙂🙂🙂 కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.
1. అజీర్నే భోజనమ్ విశం. ముందు తీసుకున్న లంచ్ జీర్ణం కాకపోతే, డిన్నర్ తీసుకోవడం, పాయిజన్ తీసుకోవడంతో సమానం (మునుపటి ఆహారం జీర్ణమైతే, మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరియు అనుభూతి చెందుతాము. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం)
2. అర్ధరోగహరి నిధ్రా
సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది.
3. ముద్గధాలి గధవ్యాలి
అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ పెసలు (గ్రీన్‌గ్రామ్‌లు)
ఉత్తమమైనవి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.
4. బాగ్నస్తి సంధనకరో రాసోనాహా
వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది.
5. అతి సర్వత్రా వర్జయెత్
అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.
6. నాస్తిమూలం అనౌషాధం
శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.
7. నా వైద్యా ప్రభుయుయుషా
ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు.
వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
8. చింతా వ్యాధి ప్రకాషయ
చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.
9. వ్యాయమాస్చ సనైహి సనైహి
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.
10. అజవత్ చార్వనం కుర్యాథ్
మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.
11. స్నానమ్ నామా మనప్రసాధనకరం ధుస్వాప్న విధ్వసం
స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది.
ఇది బాడ్ డ్రీమ్స్ (చెడ్డ కలలను) ను దూరం చేస్తుంది.
12. నా స్నానం ఆచరేత్ భుక్త్వా. ఆహారం తీసుకున్న వెంటనే బాత్ తీసుకోకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
13. నాస్తి మేఘసమం తోయం.
స్వచ్ఛతలో వర్షపునీటిని, ఏ నీరు సరిపోలడం లేదు.
14. అజీర్నే భేజాజం వారీ
త్రాగునీరు తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.
15. సర్వత్ర నూతనం శాస్తం సేవకన్న పురతనం.
తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి.
ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, ముగించవద్దు.)
16. నిత్యామ్ సర్వ రసభ్యాసహా.
ఉప్పు, తీపి, చేదు, పులుపు, ఆస్ట్రింజెంట్ మరియు పంజెంట్) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.
17. జతారామ్ పూరైధార్ధమ్ అన్నాహి
మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.
18. భుక్త్వోపా విసస్థాంద్ర
ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం అరగంటైనా నడవండి.
19. క్షుత్ సాధూతం జనయతి
ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)
20. చింతా జరానామ్ మనుష్యానమ్
చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.
21. సతం విహయ భోక్తవ్యం
ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, 100 ఉద్యోగాలను కూడా పక్కన పెట్టండి.
22. సర్వ ధర్మేశు మధ్యమామ్.
ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి.
🙏 ఓం తత్ సత్ 🙏🏻

Source - Whatsapp Message

పరిపూర్ణ సంతోషం

🌹🌹పరిపూర్ణ సంతోషం 🌹🌹

కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.

"చీమలను చంపకుండా ఎలా?"
అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.

సమస్య కొలిక్కి వచ్చింది.

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.

"మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.

తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.

లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻
సర్వే జనా సుఖినోభవంతు🙏🏻🙏🏻🙏🏻

Be Good...
Do Good....

Source - Whatsapp Message

Wednesday, June 16, 2021

ఆణి ముత్యాలు

లేనిది కోరరాదు,
ఉన్నది కాదనరాదు;


వస్తుంటే వస్తుందని సంబరపడరాదు;

పోతుంటే, అయ్యో!
పోతూందనరాదు!


ఆనందం కోసం చేసేది కర్మ.

ఆనందంగా ఉండి చేసేది లీల.

చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ మన స్థూల శరీరాన్ని వదిలే చర్యలే.

చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలేస్తాం.

నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుండి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి దేహప్రవేశం చేస్తాం.

ధ్యానంలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదలి సూక్ష్మ దేహయాత్రల తరువాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహప్రవేశం చేస్తాము.

ఏదైతే లేదో దానినే 'మాయ' అని పిలుస్తారు.

ప్రపంచంలో రెండే రెండు వస్తువులు మాయ.

ఒకటి - చావు అనే భావన;

రెండు - నువ్వు వేరే,
నేను వేరే అనే భావన.

Source - Whatsapp Message

గ్రద్ద

🦅 గ్రద్ద🦅

✍️ మురళీ మోహన్

👌గద్ద అనగానే మనకు ఎప్పుడు కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. ఇంకా గద్దలు మనుషుల కలేభారాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?
గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక సుష్కించి మరణించడం లేదా భాదకరమైన సరే తనను తాను మార్చుకోవడం. ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది. అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం…. గద్దకు ఈ మార్పు చాలా భాదాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎతైనా కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగిన నెమ్మదిగా వొలిచేసుకుంటుంది. ఇలా వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్తా కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది. ఇలా 5నెలలు భాదాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది.

ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది.🤘

Source - Whatsapp Message

భవబంధాలు...

దయచేసి ఈ చిన్ని కథను చదివితే జీవిత సత్యం అర్థం చేసుకోవచ్చు.

భవబంధాలు...
ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే. అసత్యాలే..

ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తికాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చేడు.

.....

.....

"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావ్..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్చేడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగేడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పేడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయేడు.

అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించేరు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించేరు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసేను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.

మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.

సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.

ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరికదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు. ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..! నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించేను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయేడు...

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఒక మంచిమాట

💎ఒక మంచిమాట💥


ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు.

కాబట్టి, కలలోనైనా చెడు మాట నోటినుంచి వెలువడరాదు. "ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను" అని తమ జీవితాన్నే ధారపోసిన పూర్వపురుషులెందరో ఉన్నారు. వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడైనాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు.

నేటి కాలంలో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం... మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు.

మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు.

ఆణి ముత్యాలు.
🍃🌹మన మనసులో నివసించేవారు నిజానికి దూరంగా ఉన్నా మనసుకి దగ్గరగానే ఉంటారు.కానీ మన మనసులో లేని వారు మనకి దగ్గరగా ఉన్నా మనకు దూరంగా ఉన్నట్లే..

🍃🌹గతాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎవర్ని అంచనా వేయకూడదు.
మన దగ్గర నేర్చుకున్న వాడే రేపు మనకు నేర్పేస్థాయికి వెళ్లొచ్చు..

🍃 🌹మనిషి జీవితం నది ప్రయాణం లాటిది.. నది నడక సాగి సాగి...ఆఖరికి..సముద్రుడి ఒడికి ..చేరడం తోనే.. ప్రయాణం ముగుస్తుంది. .అలాటి నది ప్రయాణం లాటిదే..మానవ జీవన ప్రయాణం ..

🍃🌹ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది..నీ పరిస్థితిని ఎప్పుడు ఎవడు ఆలోచించరు.నీ పలకరింపు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు..

మానస సరోవరం 👏



🌹కళ్ళు చూసే ప్రతి దృశ్యం
నిజం అనుకోవటం తప్పు
చెవులు వినే ప్రతి మాట
సత్యం అనుకోవటం అంతే తప్పు

చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అన్నిటికన్నా పెద్ద తప్పు

ఎప్పటివరకైతే ఎదుటివారి అవసరాలకు ఉపయోగపడే విధంగా వారి మనసుకు నచ్చిన విధంగా మనం ఉంటామో అప్పటి వరకు మంచివారమే.ఏమైనా తేడా వచ్చిందంటే క్షణాలలో మనల్ని చెడ్డవారిని చేస్తారు.

🌅 శుభోదయం చెప్తూ🌞*
మీ మానస సరోవరం. 👏

Source - Whatsapp Message

100 Tips to get Top Rank - Yandamoori Veerendranath

అచ్చులతో గణపతి స్తుతి (హావభావాలు ఎలా ఉన్నాయో గమనించండి)

మంచిమాటలు

🌹 మంచిమాటలు🌹

ఒకరిని మెప్పించే ప్రయత్నం చేయకు,

ఆ మెప్పించే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోవడమే అంతకుమించి జరిగేది శూన్యమే..

కీర్తి కీరిటాలే కొలమానం కాదు?వ్యక్తిత్వమే అసలైన కొలమానం

సంస్కారం అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు తనకు తాను తెలుసుకుంటే వచ్చేది..

నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే మాటల కన్నా మౌనం మేలు

ఎదుటివారి మాటలు ఆధారంగా వారిని అంచనా వేయకండీ ఓ నిర్ణయానికి రాకండి,

మాటల్లో తేనె మనసులో విషబీజాలను నింపుకొని జీవిస్తు ఉంటారు,

అటువంటివారితో బహుప్రమాదకరం!

లోకం తీరు ఎలా ఉంది అంటే,

తీపిగా మాట్లాడేవాళ్ళని గుడ్డిగా నమ్మే స్తుంది..

చేదుగా మాట్లాడేవాళ్ళని దూరం పెడుతుంది...

కానీ నిజం ఏంటి అంటే,

తీపి ఎప్పుడూ హానికరమే...

చేదు ఎప్పుడూ ఆరోగ్యమే..

Source - Whatsapp Message