Saturday, February 6, 2021

ఏది ఏమైనా సంతోషాన్ని మనఃశాంతిని మనము దూరం చేసుకోకూడదు

చీకట్లే దారి చూపితే వెలుగులెందుకు,,

ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలమెందుకు,,

అనుకున్నవన్ని జరిగితే దేవుడేందుకు,,

జరిగినవన్ని మనం కోరినవే అయితే ఇక కన్నీళ్లేందుకు.......


పరాయ్ వాడు పాతిక రూపాయలు తిన్న పర్వాలేదు కానీ,,

అయిన వాడు అర్ధరూపాయ్ తిన్నా ఒప్పుకోరు

ఇదే నేటి సమాజంలో కొంతమంది తీరు,,

ద్వేషంతో మొరిగే,
వీధి కుక్కల మధ్యన,

గజరాజులా సాగిపోవడమే...

మనకు తెలిసిన బతుకు....

మన గమ్యాలు...
ఎవరి ఊహకి అందని శిఖరాలు,

నేనొక అలుపెరుగని బాటసారిని,

నా కథ వేరు...నా బతుకు వేరు.....

నన్ను కన్న తల్లిదండ్రులు అంటూవుండేవారు,

జంగం పోతుంటే కుక్కలు మొరుగుతయ్ పట్టించుకోకు అని...

ఎవరో ఒకరు మన రంగును, రూపాన్ని హేళన చేసినంత మాత్రాన

మనకు ఉన్న విలువలు పాతాళానికి పడిపోవు,,

సముద్రం నీరు ఉప్పుగానే ఉండవచ్చు

కానీ

దానిలో సంపదకు కొదవలేదు కదా,,

మనం కూడా అందంగా లేకపోవచ్చు,

కానీ

మన మంచితనానికి కొదవ లేదు.....,,,_

మనము అనుకున్న జీవితం సులభంగా ఎప్పుడూ ఉండదు..

మనమే దృడంగా ఉండాలి..

విజయం సాధించింది సంతోషానికి కారణం కాదు..

సంతోషమే విజయానికి కారణం..

అందుకే

ఏది ఏమైనా సంతోషాన్ని మనఃశాంతిని మనము దూరం చేసుకోకూడదు
శుభోదయం
అంకం బాలకిషన్

Source - Whatsapp Message

No comments:

Post a Comment