Friday, June 17, 2022

ప్రశ్న భగవాన్‌! ఒకేదాన్ని ఒకరు ఒక విధంగా చెప్తే, మరొకరు మరోవిధంగా చెబుతారు. కానీ నిజం తెలిసేది ఎట్లా?

ప్రశ్న భగవాన్‌! ఒకేదాన్ని ఒకరు ఒక విధంగా చెప్తే,
మరొకరు మరోవిధంగా చెబుతారు. కానీ నిజం
తెలిసేది ఎట్లా?

రమణ మహర్షి
ప్రతిఒక్కరూ వారి ఆత్మనే చూస్తారు. ఈ ప్రపంచాన్ని,
దైవాన్ని తన బుద్ధి పక్వతను బట్టే వ్యక్తి ఊహిస్తాడు.
ఒక 'నాయనార్‌' దైవదర్శనం కోసం కాళహస్తికి వెళ్ళాడు.
అతని కళ్ళకు అందరూ శివుడుగా శక్తిగా కనుపించారు.
ఎందుకంటే తాను అంతటి గట్టివాడే గనుక.
ధర్మపుత్రుడు(ధర్మరాజు) ప్రపంచంలోని జనులు అందరూ
ఏదోయొక విధంగా పుణ్యశీలురనీ, ఏదోఒక కారణంగా
' తనకన్న గొప్పవారని భావించాడు. కానీ దుర్యోధనునికి ఈ
ప్రపంచంలో ఒక్క సజ్జనుడు కూడా కనుపించలేదు.
అంటే వారివారికి వారివారి ప్రతిబింబమే కనుపిస్తుంది కనుక.

సేకరణ

No comments:

Post a Comment