Friday, July 1, 2022

ఇది నేటి దుస్థితి... మొత్తం ప్రపంచాన్ని మత్తు ఆవరించింది...

పదవి మత్తులో ప్రజాస్వామ్యం!
ప్రచారం మత్తులో రాజకీయం!
ఉచితాల మత్తులో జనం!
మాదకద్రవ్యాల మత్తులో యువజనం!
లంచాల మత్తులో ఉద్యోగం!
ర్యాంకుల మత్తులో విద్యావిధానం!
విత్తం మత్తులో వైద్యం!
లాభాల మత్తులో వ్యాపారం!
పురస్కారాల మత్తులో పాండిత్యం!
గ్రాఫిక్స్ మత్తులో సినీరంగం!
మొబైల్ గేమ్ ల మత్తులో బాల్యం!
పబ్ మత్తులో యువతరం!
అంతర్జాలం మత్తులో అందరం!
సంపాదన మత్తులో స్వార్ధజనం!
అట్టహాసం మత్తులో వివాహం!
మోసాల మత్తులో వాణిజ్యం!
వాయిదాల మత్తులో వ్యాజ్యం!
మామూళ్లు మత్తులో రౌడీయిజం!
మతం మత్తులో మానవత్వం!
లైకుల మత్తులో సాంఘిక మాధ్యమం!
టి ఆర్ పి మత్తులో మీడియా!
సర్క్యులేషన్ మత్తులో పత్రికలు!
నోటు మత్తులో ఓటు హక్కు!
మత్తులో జోగుతున్న జగతి !!
మనిషికెక్కడిది జాగృతి !
మనుగడకెక్కడిది ప్రగతి !
మందగిస్తున్న పురోగతి.
ఇది నేటి దుస్థితి...
మొత్తం ప్రపంచాన్ని
మత్తు ఆవరించింది...
🌈🙏🌈🙏🌈

సేకరణ

No comments:

Post a Comment