Sunday, July 3, 2022

మన సనాతన ధర్మం మనకు ప్రకృతితో సహా జీవనం నేర్పింది.

 Lengthy one but good one to read 


మన సనాతన ధర్మం మనకు ప్రకృతితో సహా జీవనం నేర్పింది.


ఉదయం చీమలకి, ఉడతలకి, పిట్టలకు ఆహారంగా  వరి పిండితో ముగ్గు వేయడం, వీధి వసరాలో వరి కంకులు కట్టడం, ఆరు బయట పాత్రలలో నీరు నిలువ చేసుకోవడం, మిగిలి పోయిన ఆహార పదార్ధాలు ఫ్రిజ్ లో దాచుకోకుండా కుక్కలకు, పిల్లులకు, ఆహారంగా పెట్టడం, అన్ని దేవాలయాల్లో పక్షుల కోసం బలి పీఠాలు మీద ముందుగా ప్రసాదాలు పెట్టడం, ఆవులు, ఎడ్లు వంటి వాటిని ఇంటి కుటుంబ సభ్యులుగా చేసుకుని పేర్లు పెట్టుకుని వాటికి కూడా ఉత్సవాలు చేసుకోవడం..ఇలా ప్రతీ జంతువు, పక్షులపై మన బాధ్యతను మన ధర్మం మనకు నేర్పింది.


ఇప్పుడు పావురాలు పెంచుకుంటే జబ్బులు వస్తాయి, అందుకని పెంచుకోవద్దు, వాటికి గింజలు వేయవద్దు అని మీడియాలో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి వార్తలు.


మనకు జబ్బులు అంటుకుందుకి పక్షులు జంతువులు కారణం కాదు..మన యాంత్రిక జీవన విధానం వల్ల మన శరీర రక్షణ వ్యవస్థ తగలెట్టుకున్నాం. దాని వల్ల పూర్వం జలుబుతో పోవలసిన అనారోగ్యం ఇప్పుడు అస్మా క్రింద కరోనా క్రింద మారి ఇబ్బంది పెడుతోంది.


డాక్టర్ Prabhakara Reddy  వారి ఈ పోస్ట్ చదవండి.


అందరి గుబా గుయ్యిమనిపించారు.


**ఈ భూమి మన అబ్బ సొత్తేం కాదు**


వాతావరణంలో బాక్టీరియాలు, వైరస్ లు, ఫంగస్ లు ఉంటాయి.. అవి పీల్చుకోవడం వలన కొందరికి జబ్బులు వస్తాయి,. అలా అని గాలి పీల్చుకోవడం మానేస్తామా? మరి జబ్బులు రాకూడదంటే గాలి పీల్చుకోకుండా బ్రతికే గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు నేర్చుకుంటే ఎలా ఉంటాది,.


కోతులు జనావాసాలలోకి వచ్చాయని, అవి మన వస్తువులు తింటాయని, లాక్కెళతాయని వాటిని చంపేస్తామా? వాటి తిండిలో విషం కలపతామా? లేదా తిండే దొరకనీయమా?


పావురాలు,గద్దలు, కొంగలు, ఫెలికాన్ పక్షులు వేటివలనైనా మనకు జబ్బులు రావచ్చు,, వీటిని జునాటిక్ డిసీసెస్ అంటాము,., పందుల వలన జపనీస్ ఎన్కెఫలైటిస్ వస్తాది,. మరి పందులను ఏమి చేస్తున్నాము,, గొర్రె మాంసం తినడం వలన హైడాటిడ్ సిస్టు మరియు సిస్టిసెర్కోసిసీస్ అనే వ్యాధులొస్తాయి,, 


పంది మాంసం తింటే టీనియా సోలియం బద్దెపురుగు వ్యాధులు వస్తాయి.. పందులు మన మధ్యలో తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాము,, పైగా వాటి మాంసం తింటున్నాము,, ఇలా చాలా వ్యాధులు జంతువులు, పక్షుల వలన బాక్టీరియమ్ ఫంగస్ వైరస్ వ్యాప్తి వలన వస్తాయి,, వాటిని ఆపడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడమే,,


ఈ ప్లానెటే సూక్ష్మజీవులది,, మనుషులే పరిణామక్రమంలో ఆఖరులో వచ్చాము,,, పావురాల రెట్ట వలన ఎవరో చనిపోయారని వాటికి గింజలేయకండి అని సూత్రీకరించడం ఏమిటి? ఈ భూమిపైన మనిషి తప్ప ఎవరు బ్రతకరాదా? ఇలా అతి చేష్ఠలు చేసే కొరోనా వైరసు రూపంలో మనపై దాడి చేసి మన దూల తీర్చాయి,, ఏ జీవిని బ్రతకనీయకూడదు అని కాదు, అన్నిటినీ బ్రతకనిస్తు సహజీవనం చేయడం నేర్చుకోవాల...


చదువు పెరిగితే ఉన్నమతి పోయి చంద్రమతి అయినట్లయింది మన యవారం.. కొరోనా ఇంకా పోనే లేదు,, అయినా కుక్కతోక వంకర అన్నట్లు మరలా అన్ని జీవజాలాలమీద మన ఆధిపత్యం చూపిస్తే మరో సారి మన దూల తీర్చేకి ఇంకోటి వస్తాది,,,


అన్ని జీవజాలాలని ప్రేమించండి,, వాటికి ఆహారం, నీరు మనతో పంచుకోనివ్వండి,.సహజీవనము సమభావనము అలవరచుకోండి., లేకుంటే చీమ కరిచి కూడ చచ్చిపోతారు..

ఈ భూప్రపంచం,నేల గాలి నీరు అందరివి,, అవి భాగస్వామ్యులు., 

అతి చేస్తే దూల తీరుస్తాయి,,,


Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

No comments:

Post a Comment