నేటి మంచిమాట.
ఏది నిజం ఏది అబద్ధం..
ఏది తప్పు ఏది ఒప్పు..
ఎటు చూసినా ఏమున్నది.
మనుషులు,మనసులకి
ముసుగులు వేసుకుని బ్రతికేయటం తప్ప..
ఈ రోజుల్లో డబ్బు కి ఉన్న విలువ మనిషికి లేదు..
మనసుకి అసలే లేదు..
డబ్బుతో అన్నీ వస్తాయి
ప్రేమ,అనురాగం, ఆప్యాయత. ఇవన్నీ వస్తాయి..
అందుకే డబ్బుని ప్రేమిస్తూ మనుషుల్ని దూరం చేసుకుంటూ..
ప్లాస్టిక్ నవ్వులతో బ్రతికేస్తూ..
ఆప్యాయతలు మరిచిపోతూ..
ఏదోలా బ్రతికేస్తున్నాం..!!
జీవితం అంటే ఇది కాదు
జీవితం తేలికైనదే...కానీ ఆశల భారమే అధికం అయినప్పుడు జీవితం భారమవుతుంది..జీవితానికి.. సమాధానం కావాలి...కానీ సమస్యలో భాగం కాకూడదు..ఆశ..సమస్య రెండూ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి.. జీవితాన్ని అయోమయంలో పడేస్తాయి...ఉన్నంతలో ఆశ..మనం తీర్చుకోగలిగే చిన్న సమస్య చాలు.. జీవితంలో ఆశ..సమస్య రెండూ లేకపోతే థ్రిల్ ఉండదు.
ఉషోదయంతో మానస సరోవరం 👏
No comments:
Post a Comment