Saturday, November 19, 2022

సుగుణశీలి

 🌺సుగుణశీలి🌺
         🚩🚩

ఒకనాడు  దేవేంద్రుడు  భూలోకంలో ఉన్న రాజులలో
కృష్ణదేవుడనే  రాజే
ఉన్నతమైన సంస్కారవంతుడని గొప్పగా కొనియాడాడు.
ఈవిధంగా దేవేంద్రుడు పొగడడం  సభలోని
ఒక దేవ పురుషునికి నచ్చలేదు.

దేవేంద్రుడు  ఒక మానవమాత్రుని 
పొగడడమా ?  ఆ కృష్ణదేవుని
గొప్పతనం పరీక్షించాలని  ఆ దేవపురుషుడు భూలోకానికి వచ్చాడు.  కృష్ణదేవుడు పయనిస్తున్న మార్గంలో ఆ దేవపురుషుడు  ఒక చనిపోయిన శునక
రూపంలో  పడివున్నాడు.
చచ్చిపడివున్న ఆ శునక  శరీరం నుండి భరించలేని దుర్వాసన
వస్తూవుంది. ఆ
శునకము యొక్క నోరు  తెరుచుకొని  పరమ వికారంగా  అందరూ అసహ్యించుకునేలా పడివున్నది.

  కుళ్ళిన ఆ శునకాన్ని 
కృష్ణ దేవుడు జాలిగా పరికించి చూచాడు " ఆహా.. యీ శునకము యొక్క
పళ్ళవరుస చాలా అందముగా,
ఎంతో తెల్లగా పరిశుభ్రంగా 
ముత్యాలవలె ప్రకాశిస్తున్నాయి" అని
తన మనసులోని మాటను పక్కవారితో అన్నాడు. ఆ క్షణంలో కృష్ణ దేవుని దృష్టి 
కుళ్ళిన ఆ శునకపు శరీరం మీదకుగాని, అక్కడి దుర్వాసన మీదకు గాని పోలేదు.
కాని శునకంలో చూసిన  ఓ మంచి విషయం
మీదకే రాజు దృష్టి పడింది.
ఇదే కృష్ణ దేవుని యందు వున్న ఉన్నతమైన గుణం.

కృష్ణదేవుని ఔన్నత్యాన్ని స్వయంగా చూసిన
దేవపురుషుడు  చచ్చిన ఆ శునకరూపము  వదలి తన నిజ రూపంతో రాజుకి దర్శనమిచ్చాడు. 
" మహారాజా .. సకలజీవులలో  మంచిని మాత్రమే చూడగల గొప్ప సంస్కారం నీలో వున్నది.
ఈ లోకంలో  నీవంటి వారు మాత్రమే 
సుఖసంతోషాలతో  ప్రశాంతంగా వుంటారు.
అని ప్రశంసించి  ఆ దేవపురుషుడు దేవలోకానికి తిరిగి
వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment