Saturday, November 19, 2022

యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?

 🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

                    *భక్తుడు :*
   యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?

                   *మహర్షి :* 
 ఇతర శక్తులకన్నా అతని ఆత్మజ్ఞాన బలమే అధికము. తనలోని అహంకారం ఎంత తగ్గితే, తనకు అన్యం ( ఇతరములకన్నా తను వేరు అనే భావము ) అంత తక్కువన్న మాట. 

   ఇతరులకు నీవు ఇవ్వగల పరమ శ్రేష్ఠమైనది ఏది అంటే, ఆనందమే. అది శాంతి వలన వస్తుంది. విక్షేపం ( మనసు చెదరకుండా ఉండడం ) లేకుంటేనే శాంతి వర్థిల్ల గలదు. 
   
    మనస్సులో తలెత్తే ఆలోచనలే విక్షేపానికి మూలం. మనస్సే లేనిరోజున నిశ్చల పూర్ణశాంతి కలుగుతుంది. మనస్సును సర్వనాశనం చేయనంత వరకూ శాంతి ఆనందాలు లభించుట సాధ్యంగాదు. తనకే ఆనందం లేనివారా ఇతరులకు ఆనందం ఇవ్వగలిగేది?

  మనసే లేని పక్షంలో గుర్తించడానికి ఇతరములు కూడా ఉండవు. అందుచేత అత్మజ్ఞానం మాత్రమే ఇతరులకు ఆనందదాయకం కాగలదు.

                  🌻ఓం తత్సత్🌺

No comments:

Post a Comment