*:ఇంద్రియాలు vs మనస్సు:*
కన్ను, ముక్కు చెవి నాలుక, చర్మం ఈ జ్ఞానేంద్రియాల పనిలో మనస్సు ని జోక్యం
చేసుకోనివ్వకండి.
ఇంద్రియాలు మనకు చక్కటి అనుభూతులను ఎప్పటికప్పుడు ఇస్తూ వుంటాయి. ఈ అనుభూతులను ఆస్వాదిస్తూ ముందుకు సాగుటే జీవితం.
అలా కాక ఈ అనుభూతి చెందుతూ వున్నప్పుడు మనస్సు జోక్యం చేసుకుని ఈ అనుభూతి పట్ల భావాలు ఏర్పరుస్తుంది. అప్పుడు మనకు అనుభూతి కన్నా భావం ముఖ్యమై భావ ప్రపంచం లో విహారిస్తాము.అనగా ఊహా లోకంలో వుంటాము.
ఉదాహరణకు. ఒక అందమైన పూలతోటలో విహారిస్తూ చక్కటి అనుభూతులను పొందుతూ వుంటాము. ఇంతలో మనస్సు జోక్యం చేసుకుని అంతకు ముందు చూచిన తోటలు, పార్కులు అంటూ మనలను గతం లోకి, ఆలోచనల్లోకి
ఊహాల్లోకి తీసికెళ్ళి వర్తమానపు అనుభూతిని మనకు దూరం చేస్తుంది.
ధ్యానం చేయండి. వర్తమానంలో వుండండి.
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment