🔥 *"1"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాస తో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"మన యొక్క గడచిన అనేక జన్మల పుణ్యం నేటికి ఫలించటం చేతనే ఈ ఆత్మజ్ఞానం పొందాలనే బుద్ధి మనలో కలిగి మనమందరం శాశ్వతమయిన మోక్షాన్ని పొందే మార్గంలోకి నేడు ప్రవేశించాం."*
*"ఇదెంతో శుభసూచకం."*
*"ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకునే జ్ఞానం అని అర్ధం."*
*"ఇక ఆత్మ అంటే అది మనమే.*
*మనల్ని మనం తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం."*
*"మానవులు తామెవరో తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా రకరకాల శరీరాలతో ఎప్పటికప్పుడు “ఈ శరీరమే నేను” అనుకుంటూ లోకాల చుట్టూ అనేక జన్మల పాటు తిరుగాడుచున్నారు."*
*"అలా శరీరాలతో తిరిగి తిరిగి అలసిపోయిన మానవుడు ఒకనాటికి విశ్రాంతి కొరకు ఆరాటపడుతున్నాడు."*
*"తన మనస్సుతో తనను తనే ఇలా ప్రశ్నించుకుంటున్నాడు."*
*"అసలు నేనెవరు?*
*ఎక్కడనుంచి ఇక్కడికి వచ్చాను."*
*"ఇక్కడ పుట్టడానికి ముందు నేనెక్కడ ఉన్నాను.*
*ఇక్కడ మరణించాక నేనేమి కాబోతున్నాను."*
*"ఈ మాయ అంతా ఏంటి?*
*ఈ పుట్టడం, చావడం అనేదంతా ఏంటి?"*
*"అసలిక్కడ ఎప్పటికీ ఉండేదేంటి?*
*ఎప్పటికీ ఉండనిదేంటి?"*
*"ఈ జీవించడం అనేది అసలు దేని కొరకు?*
*తినడం కొరకా?*
*తాగడం కొరకా? లేక*
*తిరగడం కొరకా?*
*"అలా కాక నిద్ర కొరకా?"*
*"మరయితే ఇవన్నీ ఎందుకొరకు?"*
*"అసలు నేను ఈ లోకంలో జన్మించడానికి కారణం ఎవరు?"*
*"నేను జన్మించడానికి నేనే కారణమా?"*
*"లేక నాకు మరెవరయినా జన్మనిచ్చారా?"*
*"నా యొక్క జన్మకు వేరెవరయినా కారణం అనుకుంటే నా బుద్ది వారి బుద్ది ఒకేలా ఎందుకు ఉండటం లేదు ?"*
*"అలాగే ఒకరి జన్మకు మరొకరు కారణం అయితే కారణం అయినవారు మరణించినప్పుడు వారినుంచి జన్మించినవారు ఎందుకు మరణించట్లేదు?"*
*"దీనివల్ల తేలేదేమంటే లోకంలోని ఏ ఒక్కరూ మరొకరికి చెందినవారు కానే కాదని!"*
*"లోకం అనే బ్రమలో జన్మించాల్సివున్న ప్రాణులు తల్లిదండ్రులు అనే స్త్రీ పురుషుల ద్వారా ఈ లోకంలోకి రావడం జరుగుతోంది గాని ఇక్కడ ఎవ్వరి జన్మకూ ఎవ్వరూ కారణం కాదని అర్ధం అవుతోంది."*
**ఒకవేళ ప్రాణుల జన్మలకు వారి వారి తల్లిదండ్రులే కారణం అని అనుకుంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు అనబడే వారి జన్మకు కారణం ఎవరు?"*
*"వారియొక్క తల్లిదండ్రులు వారి జన్మకు కారణం అని అనుకోవాలి."*
*"ఇలా ప్రాణుల జన్మలకు కారణాలను అన్వేషిస్తూ వెనక్కు వెళితే ఒకానొక దశకు సృష్టిలోని మొట్టమొదటి జన్మ వద్దకు వెళ్లి అక్కడ ఆగిపోవలసిందే గదా!"*
*"అప్పుడు సృష్టిలోని ఆ మొట్టమొదటి జన్మకు కారణం ఎవరు అనేదానికి సమాధానం ఏంటి?"*
**భగవంతుడు” అనేది సమాధానం అనుకుంటే ఆకారం లేని భగవంతునికి ఆకారాలు కలిగిన శరీరాలకు అసలు సంబంధం ఎలా కుదురుతుంది?"*
*"ఆకారం లేని భగవంతుడు ఆకారాలు కలిగిన శరీరాలను ఎందుకు సృష్టిస్తాడు?"*
*"అసలు నిరాకారం నుంచి ఆకారాలు ఎలా రాగలవు?"*
*"ఇది అసంభవం అనుకోక తప్పదు."*
*"అలా కాకుండా భగవంతునికి కూడా ఆకారం ఉండి ఉండవచ్చు అని అనుకుంటే ఈ కదిలే ఆకారాలన్నీ పంచ భూతాలయిన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి నుంచి తయారవుతున్నాయి."*
*"భగవంతునికి ఆకారం ఉంది అనుకుంటే అప్పుడు భగవంతుని యొక్క ఆ ఆకారానికి కూడా పంచభూతాలే కారణం అని అనుకోవాలి."*
*"అప్పుడు పంచభూతాలకు కారణం ఎవరు అనేదానికి సమాదానం ఏంటి?"*
*"పంచభూతాలకు భగవంతుడు కారణం అని అనుకుంటే భగవంతునిచే సృష్టింపబడిన పంచభూతాలు తిరిగి భగవంతుణ్ణి తయారుచెయ్యడం అనేది హాస్యం కాక ఇంకేంటి?"*
💖🔥💖🔥💖
💖🕉️💖
No comments:
Post a Comment