Sunday, September 3, 2023

 🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️
దైవాన్ని నేనెప్పుడూ చూడలేదు..
బహుశా నా ఇంటి కోవెలలో కొలువైన 
మా #అమ్మలా ఉంటుందేమో!?

ఆ చిట్టి సీతమ్మ తల్లి ఆటపాటలను 
నేనెప్పుడూ వీక్షించలేదు..
బహుశా నా కడుపున పుట్టిన నా #బిడ్డ
ఆటపాటల్లా ఉంటుందేమో!?

ఆ అన్నపూర్ణ దేవి వండి వార్చి 
శివయ్యకు పెట్టిన పంచభక్షపరమాన్నాలు 
నేనెప్పుడూ తినలేదు..
బహుశా నా #భార్య వండి వడ్డించే
వంటలా ఆ రుచి ఉంటుందేమో!?

ఆ శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రదానం చేసిన
సన్నివేశంలో పాంచాలిని నేనెప్పుడూ దర్శించలేదు.
బహుశా నా కష్టంలో వెన్నంటి ఉండి
చేయూత నిచ్చే నా #చెల్లిలా ఉంటుందేమో!?

లక్ష్మీ దేవి కోసం తన బిడ్డ గణపతిని 
దత్తతు ఇచ్చిన పార్వతీ దేవిని 
నేనెప్పుడూ సందర్శించలేదు.
బహుశా నా సమస్యల పరిష్కారంలో తోడుగా
ఉండే నా #స్నేహితురాలిలా ఉంటుందేమో!?

నిత్యం పూజించే ఆ దేవతా మూర్తులను 
నేనెప్పుడూ కానలేదు.
బహుశా వారంతా నా ఇంటి అమ్మ,ఆలి,అక్క,బిడ్డ,స్నేహితురాళ్ళను 
పోలి ఉంటారేమో అనిపిస్తుంది వారిని చూసినప్పుడల్లా!!

ప్రతి స్త్రీ దేవతా స్వరూపమే!!
దేవతను ఎలా పూజిస్తామో..,,
ఆ రూపంలో మీ నట్టింట్లో నడయాడుతున్న
ఆడపడుచులను పూజించండి,గౌరవించండి, ప్రేమించండి.

మహిళా మణులందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

No comments:

Post a Comment