Tuesday, May 14, 2024

****ఒదిగి ఉండాలి... అణకువగా ఉండాలని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా!

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹ఒదిగి ఉండాలి... అణకువగా ఉండాలని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా!
 జీవితంలో స్వయంకృషితో అభివృద్ధి చెందినవారు అణకువతో ఉంటారు అని అనడంలో సందేహం లేదు. అవిరామంగా పరుగులు తీస్తున్న ఆధునిక మానవుడికి అణకువ అత్యంత ప్రధానం. కానీ అసహనం, అహంకారం నేటి మన జీవనసాధాల్ని బీటలు వారుస్తున్నాయి. ముఖ్యంగా ఈతరం యువతీ యువకులు 'అణకువ' అంటే ఆత్మన్యూనతకు చిహ్నమనే తప్పుడు ఆలోచనలో ఉన్నారు. అన్నీ తమకు తెలుసనే అహంకారంతో అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. విజేతల లక్షణాలు - అణకువ, వినయం. చరిత్రను తిరగరాసిన మహామహులంతా తమ నడవడికలో నమ్రతను ప్రదర్శించినవారే వినయంతో విరాజిల్లినవారే! మనలో ఆత్మవిశ్వాసం లేనప్పుడే అహంకారాన్ని ప్రదర్శిస్తాం. వినయం, వినమ్రత అఖండమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.
అంటాడు యోగి వేమన. కానీ నేడు మనం ఈ మాటలకు దాదాపు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒదిగి ఉండడానికి ఇష్టపడడం లేదు. పైగా అలా ఉండడం బలహీనుల లక్షణమనే భ్రమల్లో ఉన్నాం. అందుకే సమాజంలో ఘర్షణలు, మానసిక గాయాలు. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి చోటా 'నా మాటే నెగ్గాలి' అనే లేని పట్టుదలకు పోతున్నాం. మానవ సంబంధాల్ని కలుషితం చేసుకుంటున్నాం. చివరకు ఈ ధోరణి రోడ్డుపైకి కూడా పాకిస్తున్నాం. మన వాహనం కన్నా మరో వాహనం ముందు పోయినా భరించలేనంత అహంకారాన్ని ఒంటబట్టించుకుంటున్నాం. ఫలితంగా మనం ప్రమాదాల పాలవుతూ ఇతరులనూ ప్రమాదాలకు గురిచేస్తున్నాం. నిజానికి మన ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది, మన ప్రాధాన్యాన్ని నిరూపించుకోవలసింది వేగంగా వాహనం నడిపే సందర్భంలోనో, వాదవివాదాల్లో నెగ్గడంలోనో కాదు! అధికార ప్రదర్శన, అహంభావ ప్రవర్తన దంభానికీ, దర్పానికీ నిదర్శనం. ఇవి అసుర లక్షణాలని స్పష్టం చేశాడు శ్రీకృష్ణభగవానుడు. అంతర్గతంగా ఉన్నతోన్నతంగా ఎదగడంలో, సహనాన్ని ప్రదర్శించడంలో మన ప్రత్యేకతను చూపాలి.
భావోద్రేకాల్ని అణచుకున్నవాడే నిజమైన మానవుడు. జంతువులు మాత్రమే పూర్తిగా భావోద్రేకాల్ని అదుపు చేసుకోలేక వాటి చేతిలో బందీలవుతాయంటారు స్వామి వివేకానంద. అందుకే జగదేకనాయకుడైనా ఆయన ఎంతో వినమ్రంగా మెలిగారు. అణకువతో వ్యవహరించినప్పుడు మన మెదడు ఎలాంటి అలజడికీ తావు లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తుంది ఉద్రేకాలకు అతీతంగా సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ లక్షణాన్ని యుక్తప్రాయం నుంచే పెంచి పోషించుకోవాలి. పాఠాలు నేర్చుకోవడం దగ్గర నుంచి పదిమంది మధ్య సంభాషించడం వరకు ప్రతి దశలోనూ మన ప్రవర్తన పూర్తిగా నమ్రతతోనే ముడిపడి ఉండాలి. అప్పుడు మనకది అలవాటుగా సంక్రమిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ సినిమాలు, ప్రసారమాధ్యమాల పుణ్యమా అని నేటి యువతీ యువకులు అహంభావంతో పెద్దలనూ, ఉపాధ్యాయులనూ ధిక్కరించే, చులకనచేసి మాట్లాడే చెడు నాగరకతను అలవాటు చేసుకుంటున్నారు వినయం మచ్చుకైనా కనిపించని వ్యవహారశైలితో బాధ్యతారహితులైన పౌరులుగా మిగిలిపోతున్నారు. అందుకే నేడు చాలామంది యువతీ యువకులు పట్టాలు ఎన్ని సాధిస్తున్నా. సంస్కారంలో మాత్రం అధమస్థాయిలో ఉంటున్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణం వినమ్రత లోపించిన విద్యాభ్యాసం!
అర్జునుడు మరొక మాట కూడా అంటున్నాడు. కృష్ణా! ఏదో నేను అడిగాను కదా అని అనంతమైన విశ్వం యొక్క రూపం చూపక్కర్లేదు. నాకు ఈ విశ్వం యొక్క స్వరూపాన్ని చూడటానికి అర్హత ఉంటేనే చూపించు. లేకపోతే లేదు. నీ ఇష్టం అని అన్నాడు. అంటే నాకు నీ మీద నమ్మకం లేక కాదు నిన్ను అడిగింది. ఈ విశ్వ యొక్క రూపం ఎలా ఉందో వినడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెప్పావు మరి చూడడానికి అర్హత ఉంటే చూపించు అని వినమ్రంగా అడిగాడు.
చెప్పిన వాడు చూపించ కుండా ఉంటాడా అని మనసులో అనుకొని ఉంటాడు. అందుకే యోగేశ్వరా! అని సంబోధించాడు. భౌతికం కాని అనంతమైన విశ్వాన్ని సందర్శించడం యోగం వలననే సాధ్యం అవుతుంది. దానికి గురువు అనుగ్రహం కావాలి. చూడడానికి తగిన అర్హత కూడా ఉండాలి. అందుకే అర్జునుడు వినమ్రంగా అన్నాడు.
ఓ యోగేశ్వరా! అంటే యోగాభ్యాసం చేసే.వారికి అందరికీ ప్రభువైన వాడా, నాశనము, మార్పులేని నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అదీ.నాకు ఆ విశ్వరూపాన్ని చూడటానికి అర్హత ఉంది నీకు అనిపిస్తేనే చూపించు. ఎందుకంటే ఈకొద్ది సమయంలో నేను యోగుల మాదిరి యోగాభ్యాసం చేయలేను. ఇప్పటి దాకా అటువంటి యోగాభ్యాసాలు నేను చేయలేదు.. కాబట్టి నాకు అలౌకికమైన నీ విశ్వరూపం చూడడానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నాకు అటువంటి అర్హత ఉంది అని నీవు అనుకుంటే, లేక ఏకారణం చేతనయినా నాకు ఆ అర్హత లేకపోయినా, తమరి అనుగ్రహంతో తాత్కాలికంగా అటువంటి అర్హతను నాకు కల్పించి, నీ అనంతమైన విశ్వరూపాన్ని నాకు చూపించండి అని వేడుకున్నాడు అర్జునుడు.
అర్జునుడు సర్వేశ్వరుని యొక్క విశ్వ రూపమును చూడగోరాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుమతి అడుగుతున్నాడు. "ఓ యోగేశ్వరా, నా కోరిక నీకు తెలియచేసాను. నేను దానికి అర్హుడనని నీవు అనుకుంటే, నీ కృప చే, నీ యొక్క విశ్వ రూపమును నాకు చూపించుము మరియు నాకు నీ యొక్క యోగ-ఐశ్వర్యమును చూపించుము". యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే శాస్త్రము. ఈ శాస్తమును అభ్యాసం చేసే వారే యోగులు అంటే. యోగేశ్వరుడు అంటే "యోగులందరికీ ప్రభువు" అని కూడా అర్ధం. అందరు యోగులూ అంతిమంగా సాధించవలసినది ఆ పరమాత్మ యే కాబట్టి, శ్రీ కృష్ణుడు అందుకే యోగేశ్వరుడు అవుతాడు. ఇంతకు క్రితం 10.17వ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని "యోగి" అని సంభోదించాడు, అంటే “యోగ నిష్ణాతుడా” అని. కానీ ఇప్పుడు, శ్రీ కృష్ణుడి మీద పెరిగిన గౌరవం దృష్ట్యా దానిని "యోగేశ్వరా" అని మార్చాడు.🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🏿🕉️🕉️🕉️

No comments:

Post a Comment