_*శ్రీరమణీయం* *-(287)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"కోరికలేవీ లేకుండా జీవించటం అనేది జరిగేపనేనా ?"*_
_*మహానుభావులు తమకు ఏది ఉన్నా, లేకున్నా సరిపెట్టుకొని జీవించారు. ఏ వెంపర్లాట, ఆరాటం లేకుండా జీవించటమే వారు ఆచరించి చూపిన ఆదర్శం.*🙏🙏🙏
*మనకి మాత్రం ఫలానాది ఉంటేనే జీవించగలమనే బలహీనత ఉంది.*
*రాకుమారుడిగా వెలుగొందిన శ్రీరాముడు 14 ఏండ్ల వనవాసాన్ని ఆనందంగా అంగీకరించిన సహనమే ఆయన్ను ఆదర్శపురుషుడిని చేసింది. రాముడిని పూజించటం అంటే ఆయన గుణాలను గౌరవించి స్వీకరించటమే.*🙏🙏🙏
*జ్ఞాని ప్రపంచాన్ని దాటడు. ప్రపంచంపై ఉన్న బంధాన్ని అధిగమిస్తాడు. ప్రపంచం దాటటం అంటే దేహావసరాలను దాటటమే. అది ఎవరికీ కుదరదు. విరాగులై చరించిన మహర్షులు కూడా చేతిలో కమండలంతోనే తిరిగారు. స్ధిరంగా, స్ధానువుగా ఉండటం కూడా ఒక వికారమే అవుతుంది.*
*జ్ఞానులు అలా ఉండరు. మనతోనే, మనలాగే సంచరిస్తారు. కాకపోతే వారికి ఏ కోరిక ఉండదు. కాబట్టి వారిని ఏదీ బాధించదు. వారి ప్రతికదలిక మనకు బోధగా ఉంటుంది !*🙏🙏🙏
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'మనజీవితమే దేవుని పూజాగా మారాలి !'*-
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment