ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం
అందమైన జీవితం అందరికీ ఉండదు! కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళుంటే ఆ లోటు తెలియదు. భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకొనే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే.. వివాహ బంధం!
మనిషి ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి, "లేదా" పూర్తిగా నమ్మకుండా ఉండాలి. అంతేగానీ సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే.
మనిషికి ఆశ ఎక్కువ.. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది మనసు. కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది!
మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు.. ఎ సి బోగీలో వెళ్తాడు, మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ బోగీలో వెళ్తాడు, పేదవాడు సాధారణ బోగీలో వెళ్తాడు.
కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరతారు. అందరూ దిగేది ఒక ప్లాట్ ఫాం మీదకే. రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంత వరకే ఈ తేడాలు.
అలాగే జీవితం కూడా అంతే. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ఈ తేడాలు. అది గ్రహించుకుని ధన-పేద బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి, ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ బోగీ లో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది.
మనకి డబ్బుందికదా అని దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. అదే పేద వాళ్ళకి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడుంటాడు. అది దేవుడికే ఇస్తున్నామనే భావన మనలో కలగాలి. అప్పుడే పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం మనకు తృప్తి, దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది.
మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు! అది ఎంతమందికి ఉపయోగ పడుతుంది అన్నది ముఖ్యం.
మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడక్కరలేదు మంచితనం కనబడితే చాలు.ఇక్కడ మారాల్సింది మనిషి యొక్క మనసు, ఆలోచించే విధానం!
మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.
అవసరం ఉన్నా.. లేకపోయినా ఒకేలా ఉండాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వితం కావు. అర్థం చేసుకొనే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు , బాధ్యత గల మనస్సూ ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది.
చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే జీవిత సత్యం!✍️```
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment