Sunday, November 24, 2024

 🚩ధర్మ సందేహం🚩

 *పంచముఖాంజనేయుడు వంటి హనుమాన్ రూపాలు రామాయణంలో కనిపించవు. మరి వీటిని నమ్మవచ్చా?*

జ: రామాయణంలో హనుమంతుని పరిమితి, లక్ష్యం, ప్రయోజనం వేరు. వాటికి అనుగుణమైన రూపమే ధరించాడు రామకథలో. పంచముఖాంజనేయుడు వంటివి మంత్రశాస్త్ర విషయాలు. మంత్రోపాసనలో మంత్రాధిదేవతా మూర్తులవి. రామాయణ హనుమంతుని రూపాలే ఇవి. అయితే ఆ కథలో అవి ప్రకటితం కావు. ఆయా మంత్రాన్ని ఉపాసించేటప్పుడు మంత్రోద్దిష్ట దేవతగా దైవం ఆవిర్భవిస్తాడు. గరుడ, వరాహ, కపి, సింహ, తురగ వదనాలతో ఉన్న పంచముఖాంజనేయుడూ మంత్ర మూర్తే. ఆ దివ్యమూర్తుల లక్షణాలన్నీ కలిసిన స్వామి రుద్రాంశ సంభూతుడైన  హనుమంతుడు. ఇచ్ఛారూపధారణ చేయగలడని రామాయణంలోనే చెప్పారు కదా!
ఒకచోట చెప్పని విశేషం, మరొకచోట చెప్పబడుతుంది అంతే. కాబట్టి రెండూ నిజాలే. నిరభ్యంతరంగా వీటిని నమ్మవచ్చు, పూజించవచ్చు
🚩జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩.  

No comments:

Post a Comment