కపాల భేదనంపై నా సాధనానుభవం.....
✍️ యోగి స్వాత్మారామా
.....నా యోగ సాధనా లక్ష్యం కపాల భేదనమే. ఈ యోగ రహస్యము, నా కొంత మంది శిష్యులకు తప్ప ఎవరికీ చెప్పలేదు. ఈ కపాల భేదనా పద్ధతి, నల్లమల అడవులలో 78 సంవత్సరాల వయస్సు గల ఒక యోగ సిద్ధుని వద్ద నేర్చుకున్నాను. ఆయన కాలం చేసిన తరువాత, ఆ మహా యోగిని నేనే సమాధి చేసాను. ఈ దుర్గమ మైన, కఠోర సాధన మాటలాడుకున్నంత సులువు కాదు. ఎన్నో నియమాలు పాటించాలి. నిరంతర సాధన అవసరం.
కుండలినీ శక్తిని, అణువణువున, సర్వ నాడుల యందు ప్రవేశ పెట్టగలిగే సామర్థ్యం, యోగి పొంది ఉండవలెను. నిష్ణాతుడైన , సిద్ధుడైన గురువు సమక్షంలో సాధన చేయవలెను.
సాధనా సమయంలో, శరీరమందు భయంకర ఉష్ణము పుడుతుంది. చెవుల నుండి, కనుల నుండి...వేడి ఆవిరులు ధారాళంగా వస్తాయి. క్రమంగా ఆ భయంకర తాపం తగ్గుతుంది. సాధన ఆపకూడదు.
మనస్సును, ఒకే లక్ష్యమందు అనగా ఉష్ణము నందు సంయమము చేయవలెను. ఉష్ణమును ధారణ, ధ్యానము, సమాధి యందుంచవలెను. అనగా "సంయమము" చేయవలెను.
శరీరమందు గల చిత్ శక్తి , దశ వాయువులు, మనస్సు...ఉష్ణముతో, సూక్ష్మేంద్రియములు పూర్తి ఎఱుకతో "బ్రహ్మ నాడి " యందు ప్రవేశించి...బ్రహ్మ రంధ్రము చేరును. సాధకునికి చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. దేహ భావన వదలిపోవును.
ఈ సాధన నిరంతరం చెయ్యడం వలన బ్రహ్మ రంధ్రం వరకు రాక - పోక తెలుస్తుంది.
కడకు, దేహ త్యాగము చేయాలనే నిర్ణయం తీసుకున్న తరువాత, ఆహార - జలములను విసర్జించి, వాయు భక్షణ చేస్తూ...నిరంతర సాధన ద్వారా...సహస్రారమందు గల బ్రహ్మ రంధ్రమున "కుండలినీ శక్తి" ని నిలుపవలెను. సర్వ క్లేశములు, కర్మలు దహనం చేయవలెను.
క్రమ క్రమంగా బ్రహ్మ రంధ్ర స్థానము...మెత్త బడుతూ...పెద్దది అవుతుంది.
నిర్ణయించిన రోజున కుండలినీ శక్తిని , బ్రహ్మ రంధ్రము నందుంచినచో...ఆ వత్తిడికి "కపాల శీర్షము" పగిలి "ఆత్మ " స్వతంత్రం పొందును.
ఈ కపాల మోక్ష సాధనను, ఛిన్న మస్తా సాధన లేదా చండ ప్రచండికగా కూడా చెబుతారు.
ఇది పరమ రహస్యమైన సాధన.
No comments:
Post a Comment