[7/11, 07:21] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
రాతి బసవని గని రంగుగా మొక్కుచూ
గనుక బసవనిగని గుద్దుచుండ్రు
బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ
విశ్వదాభిరామ వినురవేమ!
*భావం:-* జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.
[7/11, 07:21] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఒంటి కాలిమీద నిలబడ్డాడు*
వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.
[7/11, 07:21] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*తన జ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యవ్వనంతో ఉంటాడు.*
[7/11, 07:21] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అటునుండి నరుక్కు రా*
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు 'అటు నుండి నరుక్కు రా' అంటే 'కాదు అటు నుండే రా' అని ఆ తలారిని ప్రాధేయ పడ్డారట. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ అన్నమాట. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు.
[7/11, 07:21] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*
*నక్క-తాబేలు*
ఓ చెరువులోని తాబేలు, దాని పక్కనేగల బొరియలో నివసించే నక్క మంచి స్నేహితులు.
ఓసారి అవి రెండూ చెరువుగట్టున కూర్చొని అవీ ఇవీ ముచ్చటించుకుంటున్నాయి. అంతలో అకస్మాత్తుగా అక్కడో చిరుతపులి ప్రత్యక్షమయింది.
నక్క మెరుపులాగా మాయమయింది. కానీ పాపం తాబేలుకు దాక్కునేందుకుగానీ, తప్పించుకునేందుకుగానీ సమయం చాలలేదు.
ఒక్క ఉదుటున దానిమీదకు దూకిన చిరుతపులి దాన్ని నోట్లో ఇరికించుకొని ఓ చెట్టుకిందికి పరిగెత్తింది. అక్కడ కూర్చొని మెల్లిగా తాబేలును తినవచ్చుననుకొన్నది. కానీ దాని పండ్లు కానీ, వాడియైన దాని పంజాగోర్లు కానీ తాబేలు పైపెంకుకు కనీసం గాటు కూడా పెట్టలేకపోయాయి.
తన బొరియలోంచి చిరుతపులి పడుతున్న కష్టాల్ని గమనించింది నక్క. తన మిత్రుడైన ఆ తాబేలును కాపాడుకొనేందుకు దానికో ఉపాయం తట్టింది. అది మెల్లగా బయటకు వచ్చి, లేని గౌరవాన్ని నటిస్తూ, చిరుతపులి ముందు అమాయకంగా నిలబడింది. "దీని పెంకును మెత్త బరిచే మార్గం ఒకటి నాకు తెలుసు. దీన్ని కొంతసేపు నీళ్ళలో పడేసి నాననియ్యి. ఆ తరువాత దీన్ని సులభంగా తీసేయవచ్చు" అన్నది.
వెర్రి చిరుతపులికి ఈ ఆలోచన నచ్చింది. అది అన్నది: " భలే ఆలోచన! నాకింతవరకూ తట్టనేలేదు!" అని అది తాబేలును చెరువులోకి జారవిడచింది. తాబేలుకు ఇంకేమికావాలి? అది మరుక్షణంలో మాయమై తప్పించుకున్నది.
చిరుతపులి తిరిగి చూసేసరికి నక్క కూడా మాయం!
[7/11, 07:21] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*ఎగిరింది నా గాలిపటం*
ఎగిరింది ఎగిరింది నా గాలిపటం
పైపైకి ఎగిరింది నా గాలిపటం
మేఘాలు తాకింది నా గాలిపటం
రోజంతా ఎగిరింది నా గాలిపటం
పందాల్లో గెలిచింది నా గాలిపటం
జేజేలు పొందింది నా గాలిపటం.
*✅తెలుసు కుందాం✅*
*🟥గ్రహాంతర వాసులు ఉన్నారా? Do people present in other planets?*
గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evelution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.
No comments:
Post a Comment