Friday, July 11, 2025

 *🙏లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది....!!*

🌸🌿🌸🌿🌸🌿

🌹1) ఏమిటా విశిష్టత :🌹

🌿అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.

🌸 ఆ మహానుభావులు  లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.

🌿అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు.

🌸 ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

🌹2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం.🌹

🌿సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ  భగవద్గీత ఉదయించింది.

🌹3)ఏముంటుంది ఈ భగవద్గీతలో 🌹

🌸ఏది తెలిస్తే మానవుడికి  ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో...ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..అదే ఉంటుంది.

🌿నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.

🌸నన్ను నమ్మని వాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.

🌹4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా.🌹

🌿భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.

🌸భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని   కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.

🌹5)భగవద్గీత  శాస్త్రీయ గ్రంధమా.🌹

🌿ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..భగవద్గీత ని మొదటిసారి  చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు  అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే.

🌹6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే🌹

🌸  ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...?

🌿కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

🌸బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.

🌿వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..

🌸ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా  కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని  కృష్ణభక్తులుగా మార్చారు.

🌿ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం....🚩🌞🙏

🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment