*@ మనదాకా రావాలా..?@28
తేది:09/07/2025
""""""""""""""""""""""""""""""""""""""""""
రాఘవరావుకు ముగ్గురు పిల్లలు
వాళ్ల చిన్నతనంలోనే భార్య
కాలం చేస్తే, తల్లి సాయంతో ముగ్గురినీ పెంచి పెద్ద చేశాడు.
తండ్రి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. పిల్లలందరికి
ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. ఆ తరవాత ఆస్తులన్నిటినీ వాళ్లకే
పంచి ఇచ్చాడు. ఆస్తుల పంపకాల సమయంలో కొందరు
స్నేహితులు 'నువ్వు కొంత ఉంచుకోమని చెప్పినా.. 'నా
పిల్లలు బంగారాలు, వజ్రాలు...అంటూ వారి సలహాను కొట్టిపడేశాడు నాలుగేళ్ళ తిరిగేసరికి ఆపిల్లలకు తండ్రి భారమ
'య్యాడు. పెద్దలతో చెప్పించినా పిల్లలు వినకపోవడంతో..
'నా ఆస్తులు తిరిగి నాకు ఇప్పించండి' అంటూ ప్రభుత్వ కార్యాలయాలకు విజ్ఞాపన పత్రాలతో తిరుగుతున్నాడు రాఘవరావు,
ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాఘవరావు ఒక్కడిదే కాదు.
దేశంలో వేలాది తల్లిదండ్రులది.
ఆస్తులన్నీ ముందుగానే పిల్లలకు రాసిచ్చి వారి ఆదరణకు నో
చుకోక చేతిలో చిల్లిగవ్వ లేక బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో భిక్షా
టనతో జీవిస్తున్నవారెందరో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో
కష్టమైనా సుఖమైనా అందరమూ కలిసే అనుభవిద్దాం అనే
భావన ఉండేది. కుటుంబాలతో పాటు ఇప్పుడు మనసులూ
చిన్నవైపోతున్నాయి. కన్నవారికి చోటివ్వలేనంత ఇరుకైపోతు
న్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని నిర్దయగా తీసుకెళ్లి
ఎక్కడో అపరిచిత ప్రదేశాల్లో
దించి వచ్చేస్తున్నారు
కొందరు.
బతికుండగానే
శ్మశానంలో వదిలి వస్తు
న్నారు మరికొందరు.
వేల ఏళ్ల క్రితం జపాన్ లో ఒక ఆచారం ఉండేదట. వృద్ధా
ప్యంతో నిస్సహాయ స్థితికి చేరిన తల్లిదండ్రులను తీసుకెళ్లి
కొండ ప్రాంతాల్లో వదిలేసేవారు. వారు ఆకలికి అలమటించి
శుష్కించి ప్రాణాలు విడిచేవారు. అలాంటి ఓ తల్లిని కొడుకు
భుజాలపై వేసుకుని కొండల్లో విడిచిపెట్టేందుకు బయలుదే
రాడు. భుజంమీద ఉన్న తల్లి దారిపొడవునా చెట్ల ఆకులను,
పూలను తెంచి కింద పడేస్తుంటే 'కదలకుండా ఉండలేదు' అని
మనసులోనే విసుక్కున్నాడు. గమ్యం చేరాక దించి వెళ్లిపో
తుంటే.. ఆమె 'నాయనా చాలా దూరం వచ్చావు. చీకటి పడు
తోంది... వెళ్లేటప్పుడు దారితప్పి ఇబ్బంది పడతావేమోనని
ఆకులూ పువ్వులూ తెంచి దారి పొడుగునా వేస్తూ వచ్చాను..
వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికెళ్లు' అంది. అమ్మ
ప్రేమ ఎంత ఉన్నతమో...తాను చేస్తున్న పని ఎంత హీనమై
నదో అర్ధం చేసుకున్న ఆ కొడుకు కన్నీళ్లతో తల్లిని గుండెలకు
హత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఆమె జీవించినంత కాలం
ప్రేమగా చూసుకున్నాడట. అతణ్ని చూసి ఇంకొందరు..
వారిని చూసి మరికొందరిలో మార్పు రావడంతో ఆ అనా
చారం క్రమంగా రూపుమాసిందట. జన్మనిచ్చి, జ్ఞానంతో పాటు
అనంతమైన ప్రేమను పంచిన తల్లిదండ్రుల పట్ల జీవితాంతం
కృతజ్ఞతాభావాన్ని నింపుకోవడమే వారికి కొంతైనా మనం
తీర్చుకోగల రుణం. లేకుంటే కాస్త ముందో వెనకో మనకూ
అలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు.*
No comments:
Post a Comment