Friday, July 11, 2025

 గురు పౌర్ణమి సందర్భంగా ఒక కథ గుర్తొచ్చింది.
ఒక కుర్రవాడికి మైక్ టైసన్ నీ గెలవాలని కోరిక. ముగ్గురు గురువుల్ని అడిగాడు. వాళ్లు వెటకారంగా నవ్వి "నీకుఎడం చేయి లేదురా నువ్వెలా గెలుస్తావ్" అని నిరాకరించారు. 
ఒక గురువు ఏడాది పాటు శిక్షణ ఇచ్చి పోటీకి పంపించాడు. 
మైక్ టైసన్ ని గెలిచిన శిష్యుడు ఆశ్చర్యంతో ఆనందంతో గురువు కాళ్ళకి నమస్కరించి" ఎలా గెలిచాను స్వామి నేను?" అని ప్రశ్నించాడు.
"నీకు గజబంధం విద్య నేర్పాను. అందులో నీ ప్రత్యర్థి మీ ఎడమ చేయి పట్టుకొని గిరగిరా తిప్పి కింద కొట్టాలి. పోటీ జరుగుతున్నంతసేపు టైసన్ మీ ఎడమ చేయి ఎక్కడ ఉందని వెతుకుతూనే ఉన్నాడు . అందుకని నువ్వు గెలిచావు."  అన్నాడు ఆ గురువు. 
మంచి గురువు ఎప్పుడూ శిష్యుడు లోని నెగిటివ్ పాయింట్స్ వెతకడు. పాజిటివ్ చూస్తాడు. నెగెటివ్ ని పాజిటివ్గా ఎలాగా మార్చాలా అని ఆలోచిస్తాడు.
(మైక్ టైసన్ మల్ల యుద్ధం ఏమిటని అనుమానం వద్దు. just enjoy)
శ్రీ వీరేంద్ర నాథ్ !!

No comments:

Post a Comment