Sunday, July 13, 2025

Jeevitha Satyalu

 *_ప్రతి బంధం చాలా ముఖ్యమైనది... తెలుసుకుంటే చాలా చాలా విలువైనది. మన జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక రోజు వచ్చి మన లోకాన్ని, జీవితాన్నే మార్చేస్తారు._*

*_ఒక చిన్న చూపు, ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, మన మనసుని గెలిచేసేలా ఉంటాయి వాళ్లతో గడిపే క్షణాలు... అప్పటికిప్పుడు పెద్దగా అర్థం కాకపోయినా, తర్వాత అలాంటి వాళ్లు దూరమైతే ఎంతటి విలువైన వారో అనే విషయం బోధపడుతుంది ._*

*_కొన్ని ఆత్మీయ బంధాలు మన జీవితంలో ఒక పుస్తకంలా ఉంటాయి... ఒకే ఒక్క అధ్యాయం మాత్రమే... అయినా మన గుండెల్లో సంపూర్ణ గ్రంథంలా నిలిచిపోతాయి. వారి జ్ఞాపకాలు._*

*_ప్రతి బంధం చివరికి ఒక ప్రయాణమే... మిగిలేది ప్రేమ, తడిసిన జ్ఞాపకాలు మాత్రమే... అందుకే వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే, ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాకపోవచ్చు._*

*_అందుకే ఏవో చిన్న... చిన్న మాట-పట్టింపులకి పోయి మీ ఆత్మీయులను, ఆత్మీయ_* *_బంధాల్ని దూరం చేసుకోకండి..._*

*_ఇటీవల జరిగిన విమాన ప్రమాదం వార్త వింటుంటే... ఎంతో బాధాకరం. ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది._*

*_మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదు అనిపిస్తోంది... వెళ్లొచ్చే ప్రయాణం అనుకున్న వాళ్లంతా... ఒక్కసారిగా... ఒక్క క్షణంలో... ఆఖరి ప్రయాణం చేశారనడం ఎంత దురదృష్టమో కదా.!_*

*_మిత్రమా... ఆఖరుగా నాదో... చిన్న మాట..._*

*_జీవితము అశాశ్వతమైనది. రేపు అన్న దానికి రూపమే లేని బుడగ వంటి బ్రతుకు మనది. ఉన్న ఈ చిన్న జీవితాన్ని అర్ధవంతంగా బ్రతుకుతూ..._*

*_తోటి వారికి నీ వంతు సహాయ, సహకారాలు అందిస్తూ... మనసున్న మనిషిగా... మానవత్వంతో... అద్భుతమైన మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడమే.☝️_*

     _*-సదా మీ శ్రేయోభిలాషి...👏*_
💎🌟💎 🪷🙇‍♂️🪷 💎🌟💎

No comments:

Post a Comment