@ స్వేచ అంటే...@ 29
తేది :11/07/2025
""""""""""""""""""""""""""""""""""
బట్టలు బాగోలేవనీ మార్చుకోమనీ చెప్పిన తల్లిని 'ఇష్టమైన
'డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకీ ఇంట్లో...
ప్రశ్నిస్తుందో టీనేజర్.
'హాస్టల్లో అసలు ఫ్రీడమ్ ఉండదు నాన్నా' తండ్రికి నచ్చజెబుతాడు కొడుకు.
'ఉద్యోగం చేస్తున్నా ఓ పదివేలు సొంతానికి వాడుకునే
స్వాతంత్య్రం లేదు' నిట్టూరుస్తుందో ఇల్లాలు.
'పేరుకే అధికారిని. రూల్స్ మా చేతులు కట్టేస్తాయి.
స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేం'' వాపోతాడు ఉద్యోగి.
అసలేంటీ స్వేచ్ఛ? ఎవరిస్తారు?
స్వేచ్ఛ అనగానే మనకి గుర్తొచ్చేది రెక్కలల్లార్చుకుంటూ
ఎగిరే పక్షే. మనకీ అలా రెక్కలుంటే ఎంత బాగుణ్ణు.
కావాల్సిన చోటికి రివ్వున ఎగిరిపోవచ్చు...ప్రతిమనిషి ఏదో
ఒక సమయంలో అనుకునే మాటే ఇది. కానీ పక్షులు నిజంగా
అంత స్వేచ్ఛగా ఉంటాయా? ఏ పక్కనుంచీ రాబందుల
రెక్కల చప్పుడు వినిపిస్తుందోనని ఒళ్లంతా చెవులు చేసుకుంటాయి ఏ మూల ఏ పాము పొంచివుందోనని ఎక్స్ రే కళ్లతో
స్కాన్ చేస్తుంటాయి. ఎటునుంచి వేటగాడి ఉండేలు దెబ్బ
దూసుకొస్తుందోనని అనుక్షణం అప్రమత్తంగా ఉంటాయి. పాట
కైనా ఆటకైనా అనువైన చోటునే వెతుక్కుంటాయి తప్ప
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆడి, పాడవు.
ఎప్పుడేం చేయాలనుకుంటే అది చేయగలగడమే స్వేచ్ఛ
అని అందరూ అనుకుంటారు కానీ, అది నిజం కాదు.
నిజమైన స్వేచ్చకి పరిమితులుంటాయి. అవి లేని దాన్ని
విశృంఖలత్వం అంటారు.
స్వేచ్ఛ చాలా రకాలు. బ్రిటిష్ వాళ్లనుంచి మనం పొందింది
రాజకీయ స్వేచ్ఛ
ఆర్థిక స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ...
ఇలా
చాలా స్వేచ్ఛలే ఉన్నాయి. అవన్నీ మన సొంతమే, ఎవరో
ఇచ్చేవి కావు. అయితే ఏ స్వేచ్ఛ అయినా హద్దుల్లో ఉన్నంతవ
రకూ, మరొకరి స్వేచ్ఛకు భంగం కలిగించనంతవరకూ మాత్రమే
అది మన హక్కు. అందుకే 'చెయ్యి విసరడానికి నీకున్నస్వేచ్ఛ...
అవతలి వ్యక్తికి హాని చేయనంతవరకే అన్న ఆమెరికా సుప్రీంకోర్టు మాజీ జడ్జి
ఆలివర్ వెండెల్ హోమ్స్ జూనియర్ మాటని స్వేచ్ఛ పరిమితులు చెప్పడానికి వాడుతుంటారు...
కాకపోతే వీటన్నిటినీ మించింది- ఆలోచనల్లో స్వేచ్ఛ. 'నిజమైన స్వేచ్ఛ మన లోపలి నుంచి వస్తుంది. దాన్ని బయటినుంచి
ఎవరూ ఏమీ చేయలేరు' అంటారు
రవీంద్రనాథ్ టాగోర్
సంతోషంగా ఉండటానికి కావాల్సింది,మిగిలిన స్వేచ్ఛలన్నిటికీ
పునాది- ఆ స్వేచ్ఛే మరి...!
No comments:
Post a Comment