Thursday, July 10, 2025

 గురుపౌర్ణమి రోజున జాతి ఎవరికి ఋణపడి ఉన్నదో వారిని పూజించాలి. భారతీయులు ఒక జాతిగా మనుగడసాగించడానికి ఎవరు ఆధారమో వారిని పూజించాలి !అనంతమైన జ్ఞానాన్ని ఎవరు అందించారో వారిని పూజించాలి

మరి ఎవరాయన ?

కృష్ణద్వైపాయనుడు వ్యాసభగవానుడు

వేదాలు ఇవి ! ఇదుగో ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధర్వణవేదం అంటూ వేదవిభాజనం గావించి భారతీయుడికి పంచమవేదమయిన మహాభారతాన్ని, అష్టాదశపురాణాలను ఇచ్చిన మహోన్నత శిఖరం వ్యాసులవారు !

ఆ భారతంలోనే జాతికి ఆధ్యాత్మిక గంగ అయిన భగవద్గీత, ముక్తిసాధనమయిన విష్ణు సహస్రనామము చెప్పబడింది ! అటువంటి వ్యాసులవారి పుట్టిన రోజును గురుపౌర్ణమి గా జరుపుకొంటాం !

"వ్యాస" అనే మహోన్నతశిఖరం ప్రక్కన ఏదైనా ఒక చిన్న రాళ్ళగుట్టగానే కనపడుతుంది"

ఆయన ప్రక్కన నిల్చోగల అర్హత ఎవరికి ఉన్నది ?

వేదవ్యాస భగవానుడితో సాటి రాగల వారెవ్వరు ? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే ఒక కారణం ఉన్నది !

ఆషాఢపౌర్ణమి భగవానుడి పుట్టినరోజు .

కానీ ఒక కుట్ర జరుగుతున్నది షిరిడీసాయిబాబాను గురుపౌర్ణమి రోజు పూజించటం కొంతకాలంనుండీ ప్రారంభమయ్యింది ! గురుపౌర్ణమికి ఆయనకు ఎక్కడా సంబంధం లేదు ! సాయిబాబా పుట్టినరోజు ? తెలియదు !!! మనకు ఏమిచ్చాడు ? అదీ తెలియదు!

ఆయనను కొందరు పూజిస్తే నాకేమిటి అభ్యంతరం ? ఏవిధమైన అభ్యంతరం లేదు.


కానీ ఆయనను వ్యాసభగవానుడి స్థానంలో తీసుకురావడమే నా ప్రధాన అభ్యంతరం ! వ్యాసభగవానుడిని మరచిపోతే వేదాన్ని మరచినట్లే,గీతను మరచినట్లే, విష్ణుసహస్రనామం మరచినట్లే,అష్టాదశపురాణాలను మరచినట్లే ! భారతీయులుగా మనలను మనం మరచినట్లే ! ఇది కుట్రకాదా ???

అది తప్పు ! ముమ్మాటికీ తప్పు!

గురుపౌర్ణమి రోజున వ్యాసులవారినే పూజిద్దాం !

No comments:

Post a Comment