*💎మిత్రమా...,*
🕉️🦚🌹🌻🌈
*🍁నువ్వు బాధలో ఉన్నప్పుడు నీతో పాటు బాధపడే మనసు ఒకటి, నిన్ను ఓదారుస్తున్న మనసు ఒకటి, నీ బాధపోయేలా సలహా ఇచ్చే మనసు ఒకటి..ఇంతకుమించి ఆ భగవంతుని సైతం ఏమీ కోరుకోకు మిత్రమా..*
*అది అత్యాశ అవుతుంది ఈ కల్తీ యుగంలో ఈ కోరికలు కూడా తీరుతాయా అంటే ప్రశ్నార్థకమే.. కానీ ఇవి ఆశించడంలో మాత్రం తప్పులేదు*
*నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో పాటు సంతోషపడే మనసు ఒకటి, నిన్ను చూసి ఆనందించే మనసు ఒకటి, నీ సంతోషానికి కారణమైన మనసు ఒకటి .. వీటి కోసం వేచి చూడు తప్పులేదు.. కానీ వీటిని గుర్తించడంలో మాత్రం తప్పు చేయకు..*
*చాలామంది పక్కన అభిమానించే వాళ్ళు ఉన్నా వాళ్ళని పక్కనపెట్టి, ఎక్కడో ఉన్నవాళ్ళ అభిమానం కోసం ఆరాటపడుతూ ఉంటారు.. అది మాత్రం చాలా తప్పని గుర్తుపెట్టుకో నేస్తమా....*
*నువ్వు ఆశించే దాంట్లోనే నీ ఆశ కనబడుతుంది మిత్రమా.. నీ స్థాయిని మించి ఆశించకు, నిరాశ చెందకు..*
*ఎందుకంటే కోరిక తీర్చే ఆ భగవంతుడు కూడా నీ కోరికలోని నిజాయితీని గుర్తిస్తాడని తెలుసుకో.. నిజాయితీగల కోరికలు ఎప్పటికీ నిరాశని మిగల్చవని తెలుసుకో మిత్రమా.. స్థాయికి మించి ఆశించకు, నిరాశకు గురికాకు ప్లీజ్..*
🕉️🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment