3285. సుందర కాండములో ఎన్ని వేల శ్లోకాలు ఉంటాయి. పారాయణం ఎలా చేసుకోవాలి?
◆ సుందర కాండములో 2800 శ్లోకాలు ఉంటాయి. పారాయణం ఒకటి, మూడు, లేదా 9 రోజులలో చేయవచ్చు.
3286. సుందరకాండ పారాయణం ఒకటి, మూడు, లేదా 9 రోజులలో చేయాలంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఆపాలి అని పెద్దలు నిర్ణయించారు?
◆ శ్రీమత్ సుందరకాండ పారాయణ విధి
_నవాహదీక్ష:_ - అనగా తొమ్మిది రోజులలో 68 సర్గలు పారాయణము చేయుట
మొదటి రోజు - 1 నుండి 5 వ సర్గ వరకు
రెండవ రోజు - 6 నుండి 15 వ సర్గ
మూడవ రోజు - 16 నుండి 23 వ సర్గ
4 వ రోజు - 24 నుండి 31వ సర్గ
5 వ రోజు - 32 నుండి 41వ సర్గ వరకు
6 వ రోజు - 42 నుండి 49 వ సర్గ
7 వ రోజు - 50 నుండి 58 వ సర్గ వరకు
8 వ రోజు - 59 నుండి 63 వ సర్గ వరకు
9 వ రోజు - 64 నుండి 68 వ సర్గ వరకు మరియు శ్రీరామపట్టాభిషేక ఘట్టము
_3 రోజులలో చేసే దీక్ష:_
మొదటి రోజు - 1 నుండి 23 వ సర్గ వరకు
రెండవ రోజు - 24 నుండి 47 వ సర్గ వరకు
మూడవ రోజు - 48 నుండి 68 వ సర్గ వరకు మరియు శ్రీరామపట్టాభిషేక ఘట్టము
No comments:
Post a Comment