*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*యోగఫలం*
*భగవద్గీతను సర్వశాస్త్ర శిరోమణిగా చెబుతారు. అనేక భాషల్లోకి అనువాదమైన ఈ గ్రంథానికి ఎందరో ప్రముఖులు వ్యాఖ్యానాలు అందించారు. యోగాకు సంబంధించినంత వరకు గీత ప్రమాణ గ్రంథం. 'భగవానువాచ' అంటూ సంభాషణగా యోగా గురించి వివరి స్తుంది. పద్దెనిమిది అధ్యాయాలు యోగాలోని విభిన్న అంశాలను ప్రస్తావిస్తాయి. జ్ఞాన యోగం, కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం... మొదలైనవి గీతలో ఉన్నాయి. ఇవన్నీ యోగాకుండే అనేక లక్షణాలు. ఒక్కొక్కటిగా ఏదీ సంపూర్ణమనిపించదు. అన్నీ ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉంటాయి. సులభమైనవి కొన్నైతే, క్లిష్టమైనవి మరికొన్ని. గీత ప్రకారం యోగా అంటే కలయిక.*
*ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడం. అభ్యాసం ద్వారా బుద్ధికి బలాన్ని చేకూరుస్తూ కోపం, అహం, విషయేచ్చలాంటి చెడుగుణాల నుంచి బయటపడి* *సత్యం, అహింస, కరుణలాంటి దైవీగుణాలను సంపాదించుకో వడం. యోగాలోనూ విభిన్న రీతులున్నాయి. వ్యాయామాలు, శ్వాస నియంత్రణ పద్ధతులు, ఏకాగ్రత, మానసికంగా సేదతీరే విధానాలు అనేకం ఉన్నాయి. 'బాధలన్నింటికీ మూలం అజ్ఞానం' అంటారు యోగ సూత్రాల్లో పతంజలి. మనిషి తనను తాను సరిగా అర్థం చేసుకో లేడు. అవాస్తవాలను వాస్తవాలనుకుంటూ, అశాశ్వతమైనవి శాశ్వతమని భావిస్తూ, భ్రాంతిలో జీవితం గడుపుతూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటాడు.*
*మనిషి నిరంతరం భవిష్యత్తు దిశగా రకరకాల ఆశలల్లుకుని పరిగెడుతుంటాడు. ఒకదాని తరవాత మరొకటి... ఆ పరుగు ఆగదు. చివరికి మిగిలేది ఒత్తిడి, ఆందోళన, బాధ, అనారోగ్యం. అహంకారం ఆత్మ స్వేచ్ఛకు అడ్డు తగులుతుంది. కుంచించుకు పోయిన మనస్తత్వం... యోగాభ్యాసం వల్ల విశాలమవుతుంది. అసలైన విజయం, ఆనందం, శాంతి సామరస్యా లెలా ఉంటాయో బోధపడుతుంది. మనసును జయించలేకపోతే వర్తమానంలో జీవించడం దుర్లభం. వర్తమానంలో ఆనందాన్ని అనుభవించాలంటే గతం, భవిష్యత్తుల మధ్య ఊగిసలాడే మనసును స్థిమితంగా ఉంచుకోవాలి. ధ్యానంతోనే అది సాధ్యం. ధ్యానం యోగాలో అంతర్భాగమే. ధ్యానంతో అంతరంగ నిశ్శబ్దానుభూతిని పొందవచ్చు. అప్పుడే వర్తమానంలో జీవించడం సాధ్యమవుతుంది.*
*శరీర సంబంధమైన అన్నమయకోశ, ప్రాణమయకోశ, మనోమయకోశ, జ్ఞాన మయకోశ, ఆనందమయకోశాలను ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియలుగా భావిం చాలి. యోగా దేహాన్ని, ఆత్మను శాంత పరుస్తుంది. యోగాభ్యాసం వల్ల లోపల, బయట ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞానంతో మొదలయ్యే యోగా ప్రతి ఒక్కరినీ దగ్గర చేస్తుంది. సత్, చిత్, ఆనందాలకు మూలం అది యోగా సక్రమ జీవన మార్గాన్ని తెలియపరుస్తుంది. అజ్ఞానాన్ని పోగొట్టి, అసలైన స్వభావాన్ని మేలుకొలిపి అనుభవ పూర్వకంగా తెలుసుకునేలా చేస్తుంది.*
*యోగా అనేది ధర్మంకాదు. విద్య, జ్ఞానం. విద్య వల్ల మనిషి ఎదుగుతాడు. అందుకే అది యోగ విద్య. మనిషికి లభించిన గొప్ప బహుమానం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
No comments:
Post a Comment