*స్వేచ్ఛ అంటే...*
పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని
పిల్లల్ని కనేసి
అనాథలను చేయడం కాదు.
*స్వేచ్ఛ అంటే...* చట్టభద్రత,తల్లిదండ్రుల యోగ్యత లేకుండా *సహజీవనం చేయడం కాదు.*
స్వేచ్ఛ అంటే..
గుడ్డపీలికలు కట్టుకొని నలుగురిలో
*కుప్పిగంతులు వేయడం కాదు.*
స్వేచ్ఛ అంటే...
రెండు వేళ్ళ మధ్య సిగరేట్,
చేతిలో మందు గ్లాస్ పట్టుకొని *పబ్బుల్లో_ఎగరడం కాదు.*
స్వేచ్ఛ అంటే...
సమాజంతో నాకు పని లేదు.
ఇష్టమొచ్చినట్లు బతకమని *కోర్టులు చెప్పాయి అనడం కాదు.*
స్వేచ్ఛ అంటే...
దేవుడు లేడు అనే భావజాలంతో
*విలువలను వదిలేసి బ్రతకడం కాదు.*
స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయి.
పక్షి ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగిరినా
ఆకాశాన్ని మింగేయదు.
అలాగే బిడ్డలకు రెక్కలొచ్చేదాక వదిలేయదు.
ఆనందాన్నిచ్చిన ఆకాశం మీద కృతజ్ఞత,
పిల్లల పట్ల బాధ్యత చూపిస్తుంది.
నోరు లేని పక్షికే అంత జ్ఞానం ఉంటే..,,
అన్నీ ఉన్న *మనకెంత జ్ఞానం ఉండాలి.*
స్వేచ్ఛ అంటే ఒకరికి ఇబ్బంది కలగకుండా..,,
ఒకరిని నష్టపరచకుండా..,,
ఉన్న బాధ్యతను మరవకుండా..,,
నీ మార్గంలో నువ్వు వెళ్ళడం.
దానికి నువ్వేపేరైనా పెట్టుకో..
ఆధ్యాత్మికం,నాస్తికం,హేతువాదం,ఆధునికీయం
ఏదైనా సరే..
విలువలను పాటిస్తూ ఎదగడం స్వేచ్ఛ.
విలువలను వదిలేసి విర్రవీగడం,
*నీకు,నీ చుట్టూ ఉన్నవారికి వేసే జీవితకాలపు శిక్ష.*
No comments:
Post a Comment