Friday, July 11, 2025

*పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. ఇపుడు లేటెస్ట్ స్లోగన్ ..* 

 *ఒక్కర్నే కనండి.. జనాభా తగ్గించండి.. ఒకప్పటి స్లోగన్..!* 

యువత కారణంగానే జపాన్‌ స్థానానికి చైనా.. చైనాలో యువత తగ్గితే.. ఆ స్థానానికి భారత్.. 2047 నాటికి భారత్‌లో పెరగనున్న వృద్ధులు.. పాతికేళ్ల తరువాత భారత్‌దీ జపాన్, చైనా పరిస్థితే..! అందుకే.. ముందు జాగ్రత్తగా 'పిల్లల్ని కనండి' అంటూ స్లోగన్స్..!

పిల్లల్ని కనకపోయినా ఫర్వాలేదు.. వాళ్ల ప్లేస్లో పందుల్ని పెంచుకోండి అని ఒకప్పుడు చైనా ఇచ్చిన స్లోగన్. 1979లో చైనాలో మోస్ట్ పాప్యులర్ స్లోగన్ ఇది. దాన్నుంచి వచ్చిందే.. 
One family- One child policy. .. కంటే ఒక్కరినే కనాలి. పొరపాటున ఇంకొకరికి జన్మనిచ్చారా.. ఆ గ్రామంలోని అందరికీ ఆపరేషన్లే. వేసక్టమీ లేదా ట్యూబెక్టమీ. అంత కఠినంగా వ్యవహరించింది చైనా. కాని, ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటో తెలుసా. ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్ పెట్టండని అంటోంది. ఎందుకని ఈ మార్పు..! 

యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది కాబట్టి. ఇక జపాన్. అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన దేశం. ఎకానమీలో అమెరికా తరువాత జపానే. కాని, చేజేతులా ఆ ప్లేస్ను చైనాకు ఇచ్చేసింది. 2010 తరువాత ఆ సెకండ్ ప్లేస్ను చైనా లాగేసుకుంది. కారణం.. జపాన్లో పిల్లల సంఖ్య తగ్గడం. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు.. జపాన్ ఆర్థిక వ్యవస్థే కుచించుకుపోయింది. ఇక ఇండియా. అతి త్వరలోనే జర్మనీని క్రాస్ చేసి జపాన్ ప్లేస్లోకి వెళ్లబోతోంది. మూడు నాలుగేళ్లలో టాప్-3
ఎకానమీగా ఇండియా ఉండబోతోంది ఇండియా
కారణం.. యూత్ ఎక్కువగా ఉండడం. యువత
లేని దేశాలు ఆర్థికపరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం. అదే
యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా..
15-64 సంవత్సరాల మధ్య వయస్కులను ‘పనిచేసే’ వారిగా పరిగణిస్తూ, వీరిని ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా పేర్కొంటూ వచ్చారు. దీన్నే ‘డెమోగ్రాఫిక్‌ ‌డివిడెండ్‌’‌గా వ్యవహరి స్తున్నారు. ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ దేశాలు అభివృద్ధి చెందింది కేవలం ఈ ‘డెమోగ్రాఫిక్‌ ‌డివిడెండ్‌’ ‌వల్లనేనన్న సత్యం వెల్లడవు తుంది. 1990 నుంచి భారత్‌ ‌కూడా దీనివల్ల సానుకూల ఫలితాలు పొందింది...

No comments:

Post a Comment