*@ చూసే కళ్లను బట్టి..!@23
తేది: 29/06/2025
""""""'""""""'""""''""""""""""""""''"""""""
ఒక యువజంట కొత్తింట్లో కాపురం పెట్టింది. వాళ్ల కిటికీలో
నుంచి చూస్తే ఎదుటి ప్లాట్ వాళ్ల బాల్కనీ కన్పిస్తుంది. ఆ
ప్లాట్లో ఒక వృద్ధ జంట నివసిస్తోంది. రోజూ సోఫాలో
కూర్చుని దూరంగా కిటికీలో నుంచి ఎదురింటి పెద్దావిడ
ఆరేసిన బట్టల్ని చూసి 'ఇంకాస్త శుభ్రంగా ఉతకాల్సింది, బట్ట
లన్నీ దుమ్ముకొట్టుకుపోయినట్లు కనిపిస్తున్నాయి' అనుకునేది
యువ ఇల్లాలు. కొన్నాళ్లకు అది ఆమెకో అలవాటుగా మారి
పోయింది. రాను రాను ఎదురింటావిడ ఉతికే బట్టలు
మరింత మురికిగా కన్పించడం మొదలెట్టాయి. దాంతో
'చూడండి వాళ్ల బట్టలెంత మురికిగా ఉన్నాయో' అంటూ
భర్తకు కూడా ఫిర్యాదు చేసేది. 'వాళ్ల గురించి మనకెందుకు
అని అతడు సర్దిచెప్పేవాడు.
ఒకరోజు ఎప్పటిలాగే కిటికీలోనుంచి చూసిన యువతికి
ఎదురింటి బాల్కనీలో శుభ్రంగా మిలమిల మెరుస్తున్న బట్టలు
కన్పించాయి. ఆశ్చర్యంతో భర్తను పిలిచి చూపించింది.
'వాళ్ల బట్టల సంగతి సరే కానీ, నువ్వసలు మన కిటికీ
చూశావా... అద్దాలు ఎలా తళతళా మెరిసిపోతున్నాయో.
ఇవాళ పొద్దున్నే మెలకువ వచ్చేసింది. ఏమీ తోచక బాగా
దుమ్ము పట్టి ఉన్న కిటికీల అద్దాలన్నీ శుభ్రంగా తుడిచేశాను
నువ్వు లేచేసరికి' చెప్పాడు భర్త. అది విని కిటికీనీ, బయట
కన్పిస్తున్న దృశ్యాల్నీ తేరిపార చూసిన ఇల్లాలు ఆలోచనలో
పడింది. ఇన్నాళ్లూ తను చూసిన మురికి తమ కిటికీ అద్దాలదే
తప్ప ఎదురింటి వారి దుస్తులది కాదన్న మాట... అనుకుంది.
వ్యక్తిత్వ వికాస పాఠాల్లో చెప్పే కథ ఇది. మనం కళ్లతో
చూసేది అన్నివేళలా నిజం కాకపోవచ్చు, నిర్ణయాలు తీసు
కునే ముందు కాస్త విజ్ఞత చూపాలని గుర్తుచేస్తుంది. నిజమే
కదా... కిటికీ అద్దం మురికిగా ఉంటే దాని ద్వారా మనం
చూసేవన్నీ మురికిగానే కన్పిస్తాయి. మనం ఏ రంగు కళ్ల
ద్దాలు పెట్టుకుంటే లోకం ఆ రంగులోనే కన్పిస్తుంది. అలాగే
మనం ఏ దృష్టితో చూస్తే మనుషులూ అలాగే కన్పిస్తారు.
మనం నిర్మలమైన మంచి మనసుతో చూస్తే ఎదుటివారిలో
మంచి లక్షణాలన్నీ కనపడతాయి.
ఇతరుల జీవితాలూ అలవాట్ల గురించి వ్యాఖ్యానించడం,
విమర్శించడం, చర్చించడం తేలికే. నిజానికి అవి మనకే
మాత్రం అవసరమూ సంబంధమూ లేనివి. వాటివల్ల
మనసుకు అనవసర వేదనే తప్ప లాభమేమీ ఉండదు.
బతుకంతా నీటిలో ఉండే చేపకి నీచు వాసన పోదు.
దాన్ని పోగొట్టడానికి ఏవేవో వేసి రుద్దుతాం. మన మన
సులూ అంతే. వాటిని నిర్మలంగా ఉంచుకోకపోతే రోజూ
రెండుసార్లు స్నానం చేసి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకుం
టున్నా లాభం ఉండదు. తప్పెప్పుడూ ఇతరులదే అని
భావించడం మాని, మనలో మనం ఆత్మ పరిశీలన చేసు
కోవడం జీవనవికాసానికి తోడ్పడుతుంది.*
No comments:
Post a Comment