Friday, July 11, 2025

 అప్పిచ్చు వాడు వైద్యుడు!

కాఫీ...కప్పిచ్చు వాడు *సర్వరుడు..!*

తిని టిప్పిచ్చు వాడు
 *కస్టమరుడు..!*

కరీం బీడీకి నిప్పిచ్చు వాడు
 *నిజమగు మిత్రుడు..!*

బాకీ తీర్చక తిప్పిచ్చువాడు
 *బతక నేర్చినవాడు...!*

వండి పెళ్ళామును
 మెప్పిచ్చు వాడు 
*అసలు మొగుడు...!*

మామిడికాయ పప్పులో
 ఇంగువ గుప్పిచ్చు వాడు
 *గొప్ప వంటగాడు..!*

ముప్పూటా స్విగ్గీ
 తెప్పిచ్చువాడు 
*భార్యా బాధితుడు...!*

ఇంట్లో ఉండీ లేడని
   చెప్పిచ్చువాడు 
*దేశ ముదురుడు...!*

పాటకు *లిప్పిచ్చు* వాడు కథానాయకుడు..!
                      
పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు 
*మేటి రాతగాడు.!*

ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు 
*ఆధునిక ప్రియుడు...!*

ప్రియురాలిని
 ఒప్పిచ్చువాడు పాత
 కాలపు ప్రేమికుడు..!

ఆపద తప్పిచ్చు వాడు *భగవంతుడు...!*

కాలము తీరినంత పైకి రప్పిచ్చు వాడు యముడు, 

మొబైలే లేని వాడు 
దైవ స్వరూపుడు
వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు

ఉండీ ఫార్వర్డ్ లు చేయనివాడు ధృఢచిత్తుడు
కదరా సుమతీ...!!

No comments:

Post a Comment