[7/13, 08:28] +91 79819 72004: *💎 నేటి ఆణిముత్యం 💎*
కోల్పోకు నమ్మకమ్మును
కోల్పోకు మహితునినెపుడు కొదవయెవచ్చున్
కోల్పోకు ధైర్యమెన్నడు
పాల్పడకుమ నీతిదప్పి పరువుయె పోవున్
*భావము :*
నీ పట్ల ఇతరులు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకు.స్నేహితులను కోల్పోకు .లోటు కనిపిస్తుంది.ధైర్యాన్ని సడలనీయవద్దు.ముందుకు వెళ్ళలేవు.నీతి తప్పి ప్రవర్తించ వద్దు.పరువు పోతుంది.
*రచన :గూటం స్వామి,9441092870*
[7/13, 08:28] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది.*
[7/13, 08:28] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఒక పంటి కిందికి రావు*
ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.
*ఒడిలోకొచ్చి పడడం*
దక్కడం, లభించడం"
[7/13, 08:28] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు*
ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదే అమ్మ.కాని అమ్మ ఐనా కొన్ని సందర్భాలలో ఆకలి తీర్చడం మరచి పోవచ్చు.మొగమాటంతో అమ్మ పెడ్తుందిలే అని ఊరుకుంటే ఆకలి తీరేదెలా.అమ్మ దగ్గర మొగమాట పడేవాళ్ళు ఎవరి దగ్గరా చొరవగా ఉండలేరు.చొరవ తీసుకుని అడగక పోతే ఏ పని జరగదు.అన్నిటికీ మొగమాట పడేవారిని చూసి చెప్పే సామెత ఇది.
[7/13, 08:28] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*చిన్నోడమ్మ చిన్నోడు*
చిన్నోడమ్మ చిన్నోడు
చిన్న సైకిలు కొన్నాడు
కొండ మీద కెళ్ళాడు
కాలు జారి పడ్డాడు
ఆసుపత్రి లో చేరాడు
అరవై బిళ్ళలు మింగాడు
అరవై తుమ్ములు తుమ్మాడు
హచ్ హచ్ హచ్ ...
No comments:
Post a Comment