Saturday, July 12, 2025

Ladies Psychology Explained–Every one Should Know This!" ఆడవాళ్ళ సైకాలజీ సీక్రెట్స్ Girls Mindset

Ladies Psychology Explained–Every one Should Know This!" ఆడవాళ్ళ సైకాలజీ సీక్రెట్స్ Girls Mindset



హలో ఎవ్రీవన్ నేను స్పాట్లైట్ ప్రవీణ్ అసలు ఆడవాళ్ళు ఎందుకు అర్థం కాదు వీళ్ళ ఎమోషన్స్ ఏంటి అసలు వీళ్ళు ఎప్పుడు ఎలా మారుతారు ఏ సిచువేషన్ లో ఎలా ప్రవర్తిస్తారు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఫీమేల్ మైండ్ ని డీకోడ్ చేద్దాం రండి ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ అందరిలో మెదిలేదే అసలు ఎందుకు ఆడవాళ్ళు అర్థం పర్థం లేకుండా ఊ అంటే ఎమోషనల్ గా దిగి సావగొడుతూ ఉంటారు బట్ అది ఎప్పటికీ నిజం కాదు గర్ల్స్ ఆర్ వమెన్ దే థింక్ ఎమోషనల్లీ బట్ నాట్ ఇర్రేషనల్లీ లేడీస్ ఎప్పుడు ఎప్పుడు భావోద్వేగాలతో ఆలోచిస్తారు కానీ అర్థం లేకుండా కాదు వాళ్ళు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ కాకపోతే లేడీస్ ఎప్పుడూ కూడా ఫీలింగ్స్ కి ఎమోషన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెదడు నిర్మాణమే అలా ఉంటుంది. చెప్తాను వినండి. కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం వాళ్ళ మెదడులోని హిప్పో క్యాంపస్ అండ్ ఇన్సులర్ కార్టెక్స్ అనేది పురుషుల కన్నా చాలా పెద్దగా ఉంటుందంట. దానివల్ల ఎమోషనల్ డీటెయిల్స్ ని ఎక్కువగా గుర్తుంచుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. వారికి మెమొరీ చాలా ఎక్కువ. నార్వే లోని బర్గన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం లేడీస్ 50 ఏళ్ల క్రితం పదాలను కూడా గుర్తుంచుకుంటారట. అప్పుడు కలిసిన ముఖాలను కూడా గుర్తుంచుకుంటారట. అలాంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అందుకే ఒకసారి అబ్సర్వ్ చేయండి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిది గుర్తుంటుంది. అందుకే లేడీస్ ని అబ్సర్వ్ చేయండి ఈ బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ ఫస్ట్ కలిసిన రోజు లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ సిచువేషన్ ఆ ప్రత్యేకమైన రోజు ఏదైతే ఉంటుందో అది తప్పకుండా వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. ఆ డే మళ్ళీ రాగానే వాళ్లే గుర్తు చేస్తారు. అది వారికి ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి సామర్థ్యం ఎందుకంటే అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులన్నీ కూడా ఎమోషన్స్ కి సంబంధించినవి ఎన్నేళ్లు గడవనివ్వండి ఎమోషనల్ గా జరిగినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ గుర్తుంటుంది. వాళ్ళ మెదడు నిర్మాణమే అలాగే ఉంటుంది. వాళ్ళ మెదడులో కార్టెక్స్ మరియు లింబిక్ సిస్టం లో మగవారి కన్నా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందంట. అందుకే చాలా విషయాల్లో మగవారి కన్నా యాక్టివ్ గా ఉంటారు. అనర్గళంగా మాట్లాడేటువంటి నైపుణ్యాలు కూడా వీళ్ళకి ఎక్కువే. మీరు కావాలంటే ఎవరితోనైనా గొడవకు దిగినప్పుడు ఒక్కసారి అబ్సర్వ్ చేయండి ఆ గొడవ గంటసేపు ఉంటే గంటసేపు కూడా అనర్గలంగా వాదిస్తారు. ప్రొఫెషనల్ గా స్టేజెస్ పైన కూడా అంతే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా తక్కువనే ఉంటుంది. ఒకసారి స్టేజ్ ఎక్కారు అని అంటే అనర్గలంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మగవారి కన్నా ఎక్కువ వాసనలు గుర్తుపట్టేటువంటి సామర్థ్యం కూడా వీళ్ళకి ఎక్కువనే నంట. కావాలంటే మీరు అబ్సర్వ్ చేయండి ఎప్పుడైనా బయటికి ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చిన్న సిట్టింగ్ గాని జరిగినప్పుడు జస్ట్ వన్ ఆర్ టూ పేక్స్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి లోపల వచ్చిన ఐదు నిమిషాలు లేదు లేదు లేదు మూడు నిమిషాల లోపే వాళ్ళు పసిగడతారు మనకే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళకి వాసనలు పసికట్టేటువంటి సామర్థ్యం కూడా పురుషుల కంటే ఎక్కువనే ఇక ఆడవాళ్ళతో కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు వీళ్ళ మెదడు ఎలా పని చేస్తుంది అసలు లాజికల్ గానా ఎమోషనల్ గానా మీరు గమని గమనించారా గర్ల్స్ కానీ ఉమెన్ కానీ మాట్లాడేటప్పుడు ఎమోషన్స్ బేసిక్ గా ఫీలింగ్స్ బేసిక్ గా మాట్లాడుతూనే గతంలో డీటెయిల్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ తవ్వి మరి మాట్లాడుతూ ఉంటారు. అది కేవలం వారి వ్యక్తిత్వం కాదు అది వారి బయాలజీ వారి సైకాలజీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అని చెప్పేసి ఉంటుంది. లెఫ్ట్ పార్ట్ అనేది లాజిక్స్ కి యూస్ అవుతూ ఉంటుంది. రైట్ పార్ట్ అనేది క్రియేటివిటీకి ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి యూస్ అవుతూ ఉంటుంది. మగవాళ్ళు ఎక్కువగా లాజిక్ గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే గనుక లెఫ్ట్ బ్రెయిన్ ని లాజిక్ గా ఎప్పుడు గతంలో ఏమి జరిగాయి అని ఆలోచించుకుంటూనే ఈ ఎమోషనల్ గా రైట్ బ్రెయిన్ ని కూడా యూస్ చేస్తారంట. ఇక టూ సైడ్స్ బ్రెయిన్ యూస్ చేసినాక మనక ఏముంటాయి చెప్పండి మాటలు అందుకే ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు పూర్తిగా వినడమే శ్రేయస్కరం. మీకో విషయం తెలుసా ఆడవాళ్ళు ఫైనల్లీ ఎమోషనల్ దే ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు చెప్పేది మీరు అంతా వింటే చాలు వాళ్ళు ఎంతో సంతృప్తి పడతారు. వాళ్ళు చెప్పేది కొట్టి పారేయకుండా ఎస్ నాకు అర్థమైంది అని చెప్పితే చాలు వాళ్ళు ఎంతో సంబరపడిపోతారు. ఇది నిజం ఇది సైకాలజీ. ఇంకో విషయం అసలు గర్ల్స్ కానీ ఉమెన్ కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఏమి కావాలని కోరుకుంటారు గర్ల్స్ కానీ ఉమెన్ కానీ వాళ్ళ స్వతంత్రత కెరియర్ పర్సనల్ గ్రోత్ గురించి తపన పడుతూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత గుర్తింపును కోరుకుంటారు. అందుకే పెళ్లి చేస్తామంటే లేదు లేదు ఇంకా చదువుకుంటాము అని అంటారు. ఏదో జాబ్ చేయాలని తాపత్రయ పడుతూ ఉంటారు. పెళ్లి చేసినా కూడా చాలామంది కుట్టు మిషన్ నేర్చుకోవడమో బ్యూటీ పార్లర్స్ పెట్టడమో లేదంటే స్కూల్స్ లో టీచర్స్ గా జాయిన్ కావడమో లేకపోతే హాస్పిటల్స్ లో షాపింగ్ మాల్స్ లో జాబ్ చేయడమో ఇలాంటివి వెతుక్కుంటూ ఉంటారు. ఆడవాళ్ళు వాళ్ళ పర్సనల్ గ్రోత్ అండ్ స్వతంత్రత అనేది కోరుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఇలా స్వతంత్రత కోరుకుంటూనే కుటుంబం పట్ల ఎమోషనల్ కనెక్షన్ బాండింగ్ కి డీప్ వాల్యూ ఇస్తారు. ఎదిగే కొద్దీ ఇంకా ఎదగాలి అనేటువంటి మనస్తత్వం మగవాళ్ళ కన్నా వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎమోషనల్ బాండింగ్ అనేది ఫ్యామిలీతో వదులుకోలేరు. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్. ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు మీరు చూడండి గర్ల్స్ అయినా ఉమెన్ అయినా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు 100% సేఫ్ సైడ్ ఉంటారు భవిష్యత్తు పట్ల జాగ్రత్త పడేటువంటి లక్షణం మగవారిలో కన్నా వీళ్ళకు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగా వీళ్ళు ఫైనల్ గా ఎమోషనల్ కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అప్రోచెస్ కి ఈజీగా పడిపోతారు. వీళ్ళ టూ మచ్ ఫీలింగ్స్ ఎమోషనల్ అప్ప్రోచ్ చేసే వీళ్ళకి కొన్నిసార్లు శాపంగా కూడా మారొచ్చు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు వాళ్ళ కాస్త ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు ఈజీగా అందరినీ నమ్మేస్తారు. డెసిషన్ తీసుకునే విషయంలో పెళ్లైన ఆడవాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ మరింత జాగ్రత్తగా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే లేడీస్ ఏమి ఆలోచించినా వాళ్ళ అనుభవాల ఆధారంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి సైకలాజికల్ గా మూడ్ స్వింగ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పే విషయాన్ని కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ కి తొందర పడకుండా కాస్త ఎక్కువ టైం తీసుకొని ముందుకెళ్లేలా వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేకానీ వాళ్ళు తీసుకున్న డిెసిషన్స్ పై చిన్నచూపు చూస్తూ వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. ఒక్క మాట ఆడవాళ్ళు ఏదైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించరు. ఇది అక్షర సత్యం ఇప్పుడు కామన్ మిస్అండర్స్టాండింగ్స్ ఒకసారి చూద్దాం అసలు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అప్పుడే నవ్వడం అప్పుడే అలగడం అప్పుడే అరవడం చూసి వీళ్ళు ఇంత వీక్ అని అనుకుంటాం కానీ వాళ్ళు వీక్ కాదు జస్ట్ ఎమోషనల్ అంతే రెండిటికీ చాలా తేడా ఉంది. డెసిషన్ మేకింగ్ లో వాళ్ళ ఆందోళన అతి జాగ్రత్త చూసి వీళ్ళు ఇంత కన్ఫ్యూజన్ పార్టీయా అని అనుకుంటాం కానీ అది కన్ఫ్యూజన్ కాదు జస్ట్ ఓవర్ థింకింగ్ అంతే రెండిటికీ చాలా తేడా ఉంది. వాళ్ళు పడే వేదన ఒత్తిడి ఏడవడం చూసి వీళ్ళు ఇంత డ్రామాటికా అని అనుకుంటాం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళది డ్రామా కాదు జస్ట్ సెన్సిటివిటీ రెండిటికీ చాలా తేడా ఉంది. గర్ల్స్ ని కానీ ఉమెన్ ని కానీ వాళ్ళు మంచోళ్లా చెడ్డోళ్లా కరెక్టా రాంగా అని జడ్జ్ చేయడం మాని వాళ్ళ ఎమోషనల్ ఉద్వేగ స్థితిని అర్థం చేసుకుంటే హెల్దీయర్ స్ట్రాంగర్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వుమెన్ సైకాలజీ ఎప్పుడైనా కూడా డీప్ ఇన్నర్ ఫీలింగ్స్ తో పరి పరి విధాలుగా పొరలు పొరలుగా ఉండేది ఆ సైకాలజీ మన చెల్లి అయినా కావచ్చు అక్క అయినా కావచ్చు వైఫ్ అయినా కావచ్చు అమ్మ అయినా కావచ్చు కాస్త సమయం ఇచ్చి అర్థం చేసుకునే ఓపిక ఉంటే అది ఫ్యామిలీ అయినా వర్క్ ప్లేస్ అయినా ఫ్రెండ్షిప్ అయినా కూడా వాళ్ళతో ది బెస్ట్ గా కనెక్ట్ అవ్వగలం. చివరిగా ఒక్క మాట ప్రపంచంలో ఏ మగాడు ఆడవాళ్ళని ఫోర్స్ ఫుల్ గా మారుద్దామని చెప్పేసి అనుకోకూడదు అలా ఎన్నటికీ మార్చలేడు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఆల్రెడీ రూపుదిద్దుకునే ఉంది. అయితే స్నేహ భావంతో డీప్ అండర్స్టాండింగ్ తో లాయాలిటీతో వాళ్ళని ప్రభావితం మాత్రం చేయొచ్చు. కాదు కాదు మనం అలా ఉంటే వాళ్లే ప్రభావితం అవుతారు. కాస్త మనకి ట్యూన్ అవుతారేమో ఈ వీడియోలో ఎన్నో విషయాలు చర్చించాం. ఇది ఏమాత్రం ఆలోచింపజేసినా కూడా ఒక చిన్న లైక్ కొడతారా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటో మనం చర్చించిన విషయం ఏంటో మీరు కామెంట్ లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ మగవాళ్ళ గురించి వాళ్ళ సైకాలజీ గురించి వీడియో చేయాలి అని అనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను. మన ఛానల్లో ప్రతి వీడియో రేపటి బెటర్ లైఫ్ కోసమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ చేతుల మీదుగా మరింత ముందుకు నడిపించండి. థాంక్యూ వెరీ మచ్.

No comments:

Post a Comment