*గురు పూర్ణిమ (ఆషాఢ పౌర్ణమి)శుభాకాంక్షలు*
*వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*
*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll*
*మహాభారత గ్రంధకర్త అయిన "వేదవ్యాస మహర్షి" జన్మించినది.......ఆషాఢ పౌర్ణమి నాడు. ఈ వ్యాసుడు, పరాశర ముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును "వ్యాసపౌర్ణమి" మరియు "గురుపౌర్ణమి" అని కూడా అంటారు.*
*గురు పూర్ణిమ: వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు.. ఈ కథే ఉదాహరణ!*
----------------------------------------
*సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.*
--------------------------------------
*ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపూర్ణిమ’* *‘వ్యాసపూర్ణిమ’* ------------------------------------- *అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని , వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.* ---------------------------------------- *‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’* -------------------------------------- *గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.*
--------------------------------------
*పురాణాల కథనం ప్రకారం*
---------------------------------------
*పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయికళ్లతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం , కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను’అని అంటాడు.*
----------------------------------------
*ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ , ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకిలేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం , దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు.*
-------------------------------------
*ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు , పువ్వులను సిద్ధం చేసి , శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహించి , అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్మారు.*
-------------------------------------
*స్వామి ఎన్ని నోములు , వ్రతాలుచేసినా సంతానభాగ్యం మాత్రం లేదని , ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు , ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి , వేదవతి సంతానయోగం లభించింది. సుఖసంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.* ----------------------------------
*ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్, యజ్, సామ, అథర్వణ మని నాలుగుగా విభాగం చేశారు. ఆ నాలుగింటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ధతంరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తిచేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ధ తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు.*
-------------------------------------
*మంత్రాన్ని దర్శించివాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా (రిషయోః మంత్రద్రష్టారః). ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి. అటువంటి వేదములను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి. వేదానికి స్వరం ముఖ్యం.*
--------------------------------------
*వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి, జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. ఆ బ్రహ్మ సూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి.*
----------------------------------------
*తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికి వీటీకి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచనా విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందిచిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం.*
---------------------------------------
*మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చెయ్యవలసిన చెయ్యకూడని విధులగురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషిపేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలుగునవిగా చెప్పబడ్డాయి.*
-------------------------------------
*ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మ-శాస్త్ర-నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు. ఉత్తరాదిన కాశినాథ ఉపాధ్యాయ రచించినది, దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు. వైద్యనాథ దీక్షితీయం వైష్ణవులకు శైవులకు ఇరువురికీ ఒక్కటే. అటువంటి వేదములు, ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు.*
--------------------------------------
*మనధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యులద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురుపౌర్ణమి అని కూడా పేరు. ఈ రోజున మన గురువులలో వేదవ్యాసులవారిని చూసుకొని వ్యాసులకు అంజలి ఘటించాలి.*
--------------------------------------
*వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్*
*పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్*
🪷🪷🙏🙏🙏🪷🪷
సేకరణ
No comments:
Post a Comment