Sunday, July 13, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*♦️మహాభారతంలో యుయుత్సుడికి రాజ పదవి ఎందుకు దక్కలేదు?*


రాజులకు చాలామంది దారలూ, భార్యలూ , దయితలూ, వల్లభలూ ఉండేవారు.(అన్నిటి అర్థం ఒకటే అనుకోండీ !).అందరికీ ఎందరో పిల్లలు.

వాళ్ల దారిలోనే " (ధనము)పణము గలిగెనేని భార్య కలదు". ఎక్కువ ధనముంటే ఎక్కువ భార్యలు. ఎక్కువ సంతానం. అదే బలం.

(ధనం లేకపోతే ఎవరూ పిల్ల నెవ్వరు.)

రాజులు క్షత్రియులు. రాజ్యాలు ఏలేవారు. వాళ్ల కుల గోత్రాలకు సరిపడే వాళ్లే— రాణులౌతారు. రాజులకు ఉపనయనాది సంస్కారాలుంటాయి. యజ్ఞ యాగాదులు చేయవలసి ఉంటుంది. అపుడు భర్త పక్కన కూర్చొనే అధికారం (హక్కు) గలవాళ్ళు పత్నులు. ("పత్నీ యజ్ఞ సంబంధే " అని శాస్త్రం)

ధర్మ కార్యాలలో పీటల మద కూర్చొనే హక్కు పత్నులకే ఉంటుంది. వాళ్ల కు కలిగే సంతానానికే పితృకార్యాలు, కర్మ క్రతువులు చేసే అధికారం.

వాళ్లే రాజ్యానికి గూడా వారసులు.

ఇతర సంతానం వాళ్లకు సహాయకులుగా ఉంటారు. వాళ్ల రక్షణ పట్టాభిషిక్తుడి బాధ్యత. .

యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య స్త్రీ వల్ల పుట్టిన వాడు.

విలువిద్యలు నేర్చినవాళ్ళందరూ యుధ్ధాల్లో పాల్గొనే వారు.

యుయుత్సుడు తన అనీకిని తో ( 1/10 అక్షౌహిణి) ధర్మరాజు యుద్ధారంభంలో చేసిన ప్రకటనతో పాండవుల వైపే ధర్మం ఉన్నదని పాండవ పక్షానికి వచ్చి 18 రోజులూ కౌరవులతో యుద్ధం చేస్తాడు.

ధృతరాష్ట్రుడి సంతానంలో మిగిలినది అతడొక్కడే.

ధర్మ రాజు తన వల్ల బంధు వినాశమైనదని పరితపిస్తూ ధృతరాష్ట్ర సంతతి ఐన యుయుత్సుడికే రాజ్య పట్టాభిషేకం చేస్తామంటాడు. కానీ , కుల పెద్దలు అందుకు అంగీకరింపరు.

పాండవులు వాన ప్రస్థానికి బయలుదేరేటప్పుడు పరీక్షిత్తును రాజుగా, యుయుత్సుణ్ణి సర్వ సేనాపతిగా అభిషేకిస్తారు. పసివాడైన పరీక్షిత్తుకు అతడే సహాయకుడుగా ఉంటాడు.

No comments:

Post a Comment