Thursday, July 10, 2025

 బంధాలు బలహీనం గా మారడానికి కారణం ఏమిటి 
ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం 
నాకు కనిపించిన కారణాలు ఇవి 

#అభద్రత 

ఒక మనిషిని ఎక్కువ ఆరాధించినప్పుడు అభద్రత భావం ఎక్కువ అవుతుంది, సొంతం అయినా బంధాలలో కన్న మిగిలిన వాటిలో ఈ అభద్రత భావం ఎక్కువ ఉంటుంది, ఇద్దరు దూరం గా ఉండటం ఇద్దరి మధ్య బలమైన గుర్తింపు కలిగిన బంధం లేకపోవడం, సమాజం లో తమ బంధానికి ఆమోదయోగ్యం  లేకపోవడం ఈ అభద్రత భావం ఎక్కువ అవ్వడానికి కారణాలు 
ఆభద్రత ఎక్కువ అయ్యి క్రమం గా బంధం బలహీనం అవుతుంది 

#అనుమానం 

చాలా మంది ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది అంటారు,అనుమానించాలి కూడా అంటారు నిజానికి అది అబద్దం నీ ప్రేమ నిజం ఐతే నిది ఎప్పటికి నీదే దానికోసం ఎవరు రారు రాలేరు, మధ్యలో ఎవరు ఇనా వచ్చారు అంటే ప్రేమ ఎక్కడ ఉన్నట్టు లేనట్టే అనుమానం మొదలు అనేది బంధం బీటలు వారడానికి మొదటి అడుగు పడినట్టే 

#అవమానం 

చాలా మంది మాట్లాడేటప్పుడు మాట జారేస్తారు, తొందరలో కొన్ని సార్లు చులకనగా కొన్ని సార్లు, మనం అనే ప్రతిమట నీ ఎదుటివారు తీసుకునే పరిస్థితులలో ఉన్నారో లేరో కూడా ఆలోచించారు అనేస్తారు బంధాన్ని కలిపేది మాటే బంధాన్ని తెంచేది మాటే నాలుగు గోడల మధ్య అపురూపం గా చూసుకొని నలుగురు మధ్య అవమానిస్తే ఏ బంధం ఎక్కువ రోజులు నిలబడదు 

#అభిమానం 

ప్రతి ఒక్కరికీ అభిమానం అదే ఆత్మాభిమానం ఉంటుంది నీవు నిజం గా ప్రేమిస్తే తన అత్మభి మానాన్ని కూడా గౌరవించాలి, ఎడిటివారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడినా ప్రవర్తించిన ఏ బంధం ఎక్కువ రోజులు నిలబడదు 

#అలకలు 

చిన్న చిన్న మాట పట్టింపులే అలకలు, ఇద్దరి మధ్య అలకలు చాలా బావుంటాయి కానీ ఇవి పరిధి దాటితే గొడవలు గా మారతాయి, చిన్న గా మొదలు ఇనా గొడవలు పెద్దగా మారి ప్రశాంత త నీ దూరం చేస్తాయి 
అప్పుడు ఈ గొడవలు పడుతూ కలిసి ఉండటం అవసరమా అని క్రమం గా ఒకరికి ఒకరు దూరం జరుగుతారు 

అపురూపమైన బందాలని 
మరపురాని సంబంధలుగా 
మార్చుకోండి 
అంతేగానీ అర్దం పర్డం లేని విషయాలకి 
దూరం చేసుకోకండి

No comments:

Post a Comment