Friday, July 11, 2025

 **  గురువు  **

చేయు జ్ఞాన బోధ వెలిగించు భవితను

బడి గుడిలో కొలువుండు దేవుడాతడు

నేర్పు క్రమశిక్షణ సరిదిద్దు నడవడికను

భావి తరాలను రూపుదిద్దు బ్రహ్మాతడు

చెప్పు హితము నడిపించు ధర్మమును 

అందరికీ ఆదర్శుడైన ఆచార్యుడాతడు 

పదనుబెట్టు తెలివిని పోగొట్టజ్ఞానమును

మంచి మర్యాదనెరిగిన అయ్యవారతడు 

నింపు ధైర్యమును చూపు ప్రగతి బాటను 

బతుకును మలచు అక్షర శిల్పియాతడు 

చొప్పించు దేశభక్తి గెలిపించు దేశమును 

కర్తవ్యబాధ్యతలు మరవని నిబద్ధుడాతడు 

కోరు సంఘ శ్రేయస్సు తెలుపు మర్యాదను 

లోక కల్యాణమాశించు సంస్కారుడాతడు 

పట్టు బెత్తము చేపట్టు విజ్ఞాన వ్యాప్తతను 

శారదాంబ కటాక్షమున్న గురువాతడు. 

అందరికీ గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) 
శుభాకాంక్షలు.

No comments:

Post a Comment