A Maharshi of the Dwapara Yuga at the age of 11? #satyanandiraju #sanatandharma #hindu #ytviral #...
https://youtu.be/LuecpdifUzw?si=YYCvGCD5ByKAlcd-
https://www.youtube.com/watch?v=LuecpdifUzw
Transcript:
(00:01) శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు కొన్ని కొన్ని సామూహిక తపోవ కేంద్రాలు ఉంటాయి అంటే ఉదాహరణకి శ్రీశైలం దగ్గర అక్కమహాదేవి గోలు అటువంటి సామూహిక తపోవ కేంద్రమే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గుత్తికొండ బిలం పిడుగురాళ్ళ మండలంలో ఉంటుంది అంటే ఎంతోమంది సిద్ధులు అక్కడ తపస్సు చేసుకున్నారు యోగులు కూడా గుంటూరు నల్లమస్త సత్యనపల్లి ఫిరోజీ మహర్షి చిరుమామిళ్ల సుబ్బదాసు గారు అలాగే రామయోగి చాలామంది తపస్సు చేసుకున్నారు.
(00:37) ఇంకా చెప్పాలి అంటే వేరే యుగం నాటి మునులు మహర్షులు కూడా తపస్సు చేసుకున్నారు చేసుకుంటున్నారు ఇప్పటికీ దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అర్హులైన సాధకులకి ఆ యుగం నాటి మహర్షులు మునులు దర్శనం ఇచ్చి ఉద్ధరింపజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం సత్సంగం చేసుకోబోయేటటువంటి ఒక యోగిని తల్లి జీవిత చరిత్ర దీనికి సంబంధించిందే ఏ ముని ద్వారా ఆ తల్లి ఉద్ధరింపబడింది అది మనం ఇవాళ సత్సంగం చేసుకోబోతున్నాం అసలు ఆ తల్లి యొక్క జీవిత చరిత్రే అద్భుతం మనం నమ్మశక్యం కానటువంటిది అటువంటి సత్సంగం చేసుకోబోయే ముందు నా మనవి ఏంటంటే ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్
(01:20) చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమ ఈ సత్సంగం చేసుకో సుకొని ఆ తల్లి యొక్క ఆశీసులు దత్తస్వామి యొక్క ఆశీసులు పుష్కలంగా పొందేద్దాం సరేనా సత్సంగం చేసుకుందాం రండి. అసలు ఈ గుత్తికొండ బిలానికి చాలా చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఒకటి ఏం చెప్తారంటే పల్నాటి కాలం నాటి బ్రహ్మనాయుడు తన చివరి రోజుల్లో ఈ బిల్లంలోనే తపస్సు చేసుకున్నాడు అని చెప్తారు.
(01:51) ఆయనకు సంబంధించిన ఆయుధం కూడా ఇక్కడ దొరికితే దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం లో భద్రపరిచారు అని చెప్తారు. ఇంకోటి మాంచాల అంటే బాలచంద్రుని యొక్క భార్య తను ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో నాగకన్యగా ఈ బిలంలోనే దర్శనం ఇస్తూ ఉంటుంది కొందరికి అని చెప్తారు ఇంకా విశేషాలు ఏంటంటే బయట వేడిగా ఉంటే బిలం లోపల చల్లగా ఉంటుందట బయట చల్లగా ఉంటే లోపల వేడిగా ఉంటుందట ఇలాంటి విచిత్రాలకు నెలవ అసల గుత్తికొండ బిల్లం సరే మనం ఇంకా ఈ తల్లి యొక్క జీవిత చరిత్రలోకి వద్దాం సరే ఈ గుత్తికొండకి దగ్గరలోనే జూలకల్లు అనే గ్రామం ఉంది.
(02:35) అక్కడ లింగారెడ్డి లింగమ్మ అనే దంపతులు ఉండేవారు వారి ప్రధాన వృత్తి వ్యవసాయం సరే వీరికి ముగ్గురు సంతానం మొదటి సంతానం కూతురు మిగతా ఇద్దరు కూడా కొడుకులు ఈ కూతురు పేరు పేరమ్మ ఈ తల్లి గురించే మనం చెప్పుకోబోతున్నాం. నేను ఏం చెప్పాను ఈ లింగారెడ్డి గారు వ్యవసాయదారులు కదా ఈయన పత్తి చేను వ్యవసాయం చేస్తూ ఉండేవారు సరే ఒకసారి ఏం చేశారంటే పేరమ్మని తీసుకువెళ్లి అమ్మ కొంచెం చేనుకి కాపలా కాస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లింగారెడ్డి గారు పని మీద ఎక్కడికి వెళ్లారు. సరే పేరమ్మ చేను దగ్గర ఉంది.
(03:19) ఇంత లోపల ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఒక మునీశ్వరుడు వచ్చారు. బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్నారు తెల్లటి గడ్డం తెల్లటి జుట్టు దివ్య తేజస్సు ఎంత దివ్య తేజస్సు అంటే పేరమ్మ కన్నార్పకుండా ఇలా చూస్తూ ఉండిపోయింది. ఆ మునీశ్వరుడు కూడా ఇలా చూస్తూ ఉండిపోయారు పేరమ్మను చూస్తూ ఇద్దరు ఏం మాట్లాడుకోలా కాసేపు అయిన తర్వాత ఆ మునీశ్వరుడు వేరే దిక్కు వైపు నడవడం మొదలు పెట్టారు.
(03:51) పేరమ్మ కూడా ఏమీ ఆలోచించకుండా ముని వెంబడే వెళ్ళిపోయింది అట్లా అలా ఎక్కడదాకా వచ్చారంటే ఈ గుత్తికొండ బిలన్లోని చీకటి మల్లయ్య అనేటువంటి గుహలోకి వెళ్ళిపోయారు. అక్కడ మునీశ్వరుడు కూర్చున్నారు ఎదురుగా పేరమ్మ కూర్చుంది అలా కన్నార్పకుండా చూస్తూ ఉంది. గంట రెండు గంటలు పది గంటలు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అయిపోయాయి.
(04:24) తర్వాత స్పృహలోకి వచ్చింది పేరమ్మ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మునీశ్వరుడు అప్పుడు అడిగారు ఆయన నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని తీసుకొచ్చింది ఆయనేగా సరే పేరమ్మ అంది స్వామి ఏమో నాకు తెలియదు మిమ్మల్ని చూశాను అట్లా ఆకర్షణకు లోనయ్యాను వచ్చేసాను ఇంతకుమించి నాకేం తెలియదు అని చెప్పింది సరే అయితే ఇంక పో అన్నారు. నేను ఎక్కడికి పోతాను మీరు మామూలు మనుషుల్లా లేరు మీరేదో మహాత్ములా ఉన్నారు మీరు తప్ప నాకు దిక్కు లేదు నాకు ఏదైనా భగవన్ మార్గాన్ని చూపించండి అని చెప్పి పట్టు పట్టింది పేరమ్మ ఎన్నేళ్ల వయసు ఆ తల్లికి అప్పుడు 11 ఏళ్ల వయసు కేవలం అంతే
(05:10) మునీశ్వరుడి యొక్క మనసు కరిగిపోయింది. చిన్న పిల్ల తీసుకువచ్చింది ఆయనే పరీక్ష కరిగిపోయి అప్పుడు ఒక మంత్రోపదేశం చేశారు చేసి తల్లి నీకు ఇంకా కర్మశేషం ఉంది నీకు సంసార జీవితం ఉంది ఇంకా కర్మశేషంగా నువ్వు వివాహం చేసుకో నేనే పిలిపించుకుంటాను నిన్ను నీకు 42 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నా ద్వారా ఇక్కడికి వస్తావ్ నీ పుణ్యం మామూలుది కాదమ్మా ఈ బిలంలో ఎంతోమంది పుణ్యాత్మ ఉన్నారు మహాఋషులు ఉన్నారు అటువంటి పుణ్యం నీకు ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికి రాగలిగావు నిన్ను మళ్ళీ రప్పించుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చి పంపించేశరు.
(05:59) ఈ మునీశ్వరుడు ఎవరో కాదు కొంతమంది ఏం చెప్తారంటే మహాభారత కాలం నాటి ముచికుంద మహర్షి అని చెప్తారు. నేను అదే చెప్పాను చూసారా గుత్తికొండ బిలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అదే ఈ కాలం నాటి ముళ్ళు మహర్షులు కాదు ఎప్పటి మహాభారత కాలం ద్వాపర యుగం నాటి మహర్షులు ముళ్ళు కూడా ఇప్పటికే అక్కడ సాధన చేస్తూ అర్హులైన వారికి దర్శనం ఇచ్చి ఉద్ధరిస్తారు అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ పేరమ్మ తల్లి ఇంకా ఏం చెప్పారంటే పేరమ్మ తల్లికి ఆయన నువ్వు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శివరాత్రికి నువ్వు చక్కగా శ్రద్ధగా నీ వ్రత దీక్షలను ఆచరించు సరేనా అని చెప్పి కళ్ళు
(06:42) మూసుకోమన్నారు కళ్ళు మూసుకోంగానే మళ్ళీ పేరమ్మ పత్తి చెన్నైలో కనిపించింది తనకు తానే ఎవరో చెప్పారు ఈ లింగారెడ్డి లింగమ్మలు అప్పుడే వాళ్ళ బంధువులు అందరూ కూడా వెతుక్కుంటున్నారు తల్లి గురించి ఇప్పటికి మూడు రోజులు అయిపోయింది కదా కనిపించకుండా పొరుగు ఊళ్ళలో కూడా వెతుక్కుంటున్నారు ఎవరో చెప్పారు నీ పిల్ల అక్కడ ఉందయ్యా పత్తి చేనులోన కనిపించట్లేదు అంటావ ఏంటి అని వీళ్ళు పరుగున పోయి ఆ పిల్ల దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావ అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పింది పేరమ్మ.
(07:10) సరే ఇంటికి తీసుకువచ్చారు పేరమ్మ శ్రద్ధగా ఆ మంత్రాన్ని అనుష్టానం చేసుకుంటుంది. ఆ ముచ్చుకుంద మహర్షి చెప్పినటువంటి వ్రతాలన్నీ కూడా శ్రద్ధతో ఆచరించేది. సరే పేరమ్మ గారికి వయసు వచ్చింది వివాహం జరిగింది కోల లక్ష్మీ నరసారెడ్డి గారితో అందుకే మనం ఇప్పటికీ కూడా ఆ గుత్తికొండ బిలం దగ్గర ఈ తల్లి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ మనం పేరు చూస్తాం.
(07:35) కోల పేరుమాంబ అని ఎవరో కాదు మన పేరమ్మ తల్లి సరే చక్కగా ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకుంది చిన్నప్పటి నుంచి కూడా సుగుణాలు రాసి కదా పేరమ్మగారు మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది మంచి భార్యగా తల్లిగా పేరు తెచ్చుకుంది ముగ్గురు బిడ్డలకు తల్లి అయింది ముగ్గురు కూడా చక్కగా కూతుళ్లే సరే హాయిగా గడిచిపోతుంది జీవితం కానీ ఏకాంతంగా ఈ సాధన చేస్తూనే ఉండేది ఈ ధ్యానం గాన మంత్రానుష్టానం గాన చేసుకుంటూనే ఉండేది అంతేకాదు ఎప్పుడైనా తన పుట్టింటికి వస్తే లేదా ఎప్పుడైనా ఈ పర్వ దినాల్లో కానీ రాత్రిపూట ఈ బిలానికి వచ్చి తపస్సు చేసుకుని తెల్లారక ముందే మళ్ళీ వెళ్ళిపోయేది ఇంటికి
(08:21) సరే కొన్నాళ్ళ తర్వాత ఈ లక్ష్మీ నరసారెడ్డి గారు అంటే భర్త గారు గమనించారు ఎక్కడికి వెళ్తోంది పేరమ్మ రాత్రి పూట్ల అని అంకే అనుమానం లేదు కానీ అనవసరంగా ఈ లోకోప నిందలు మోయాలి అని చెప్పి ఒకసారి వెంబడించారు. ఆ తల్లి ఈ గుత్తికొండ పిలానికి వచ్చింది. అక్కడికి వెళ్లి మునులతో మాట్లాడటం చూశారు ఆ మునులు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు నరసా రెడ్డి గారు ఆశ్చర్యపోయారు.
(08:53) నా భార్య మామూలుది కాదు నా జన్మ ధన్యం అయిపోయింది. ఇటువంటి పేరమ్మ నాకు భార్యగా వచ్చి నా వంశాన్ని కూడా ఉద్ధరించింది అని చెప్పి ఆయన ఆ తల్లి కంటే ముందు ఆ రాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి ముందుగా పడుకొని పోయారు ఏమి తెలియనట్టు తెల్లారింది అప్పటి నుంచి పేరమ్మగారి మీద తన భర్త గారికి ఆరాధనా భావం ఎక్కువైపోయింది.
(09:23) ఈ దృశ్యం చూసిన తర్వాత సరే ఇటువంటి తల్లుల జీవితంలో ఏదో ఒక మలుపు ఉండాలిగా మనలాంటి వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలంటే నరసారెడ్డి గారు కాలం చేశారు హటాత్తుగా అప్పటికి పేరమ్మగారి వయసు 42 ఏళ్ళు అంటే ముచ్చుకుంద మహర్షి చెప్పినటువంటి వయసుకి ఈ తల్లి చేరుకుంది. అంతకు ముందు ముచ్చుకుంద మహర్షి చెప్పినట్లుగానే ధ్యానంలో ఆయన కనిపించి పేరమ్మ కి ఇంకా నువ్వు ఈ గుత్తికొండ బిలానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది నేను వచ్చే పుష్య బహుళ సప్తమికి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చి నేను నీకు దర్శనం ఇస్తాను నువ్వు భక్తులని అందరిని పిలిపించుకో అని చెప్పారు. సరే ఆ రాత్రికి
(10:10) వారు చెప్పినట్టుగానే పేరమ్మ అందరిని పిలిచింది భక్తుల్ని అందరూ భజన కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొన్నారు అర్ధరాత్రి 1:00 గంట అయింది అపూర్వమైన కాంతితో విభూది పళ్ళు ఈ తల్లి చేతిలో వచ్చి పడ్డాయి ఎక్కడి నుంచి వచ్చినాయో ఎవరికీ అర్థం కాదు ఆశ్చర్యపోయారు. ఈ తల్లి శక్తి ఏంటో అప్పుడు అందరికీ తెలిసి వచ్చింది.
(10:33) ఈ తల్లి మహత్యం మామూలుది కాదు అని చెప్పి అర్థం చేసుకుని దీనికి కారణ భూతులు అయినటువంటి ఆ ముచ్యుకుంద మహర్షి స్తుతించడం మొదలుపెట్టారు. అట్లా ముచ్యుకుంద మహర్షి వారందరికీ కూడా ఆ సమయంలో దర్శనం ఇచ్చారు. దాని తరువాత కార్తీక పౌర్ణమికి స్వయంగా ముచ్యుకుంద మహర్షి ప్రత్యక్ష దర్శనం ఇచ్చి పేరమ్మను స్వయంగా ఈ గుత్తికొండ బిల్లాని తీసుకువెళ్లారు.
(10:58) తీసుకువెళ్లి అష్టబంద మహాబీజాలను ఇచ్చి దీక్షను ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తల్లి యొక్క సాధన తీవ్రమైపోయింది ఎలాగంటే ఆకలి దప్పులు కూడా మర్చిపోవడం మొదలుపెట్టింది. ఆ సంతానం మీద ఉన్న కొద్దిపాటి మమకారం కూడా తెలియపోయింది. మొదటి ఇద్దరు పెద్ద కూతుళ్ళను అత్తవారి ఇంట్లో ఉంచింది. చిన్న కూతుర్ని నరసమ్మని పుట్టింట్లో ఉంచింది. రెండేళ్ళ తర్వాత చిన్న కూతురు నరసమ్మ కాలం చేసింది.
(11:31) ఆ తల్లి యొక్క సమాధి కూడా ఈ బిలం పక్కనే ఈ పేరమ్మ గారు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సనగపాటి సుభద్రమ్మ అనేటువంటి ఒక మహిళ ఈ పేరమ్మ గారికి చేదోడు వాదోడుగా ఉండడం మొదలుపెట్టారు. అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఆ బిలంలో దేవతలను పూజించడం పేరమ్మ గారిని దర్శించుకోవడం ఈ సుభద్రమ్మ గారిని దర్శించుకోవడం అంతా కూడా పరిపాట అయిపోయింది.
(12:00) ఇదే సమయంలో రాజరాజేశ్వరి దేవి జగన్మాత పేరమ్మ గారికి దర్శనం ఇచ్చి అనేక యోగశక్తులను ప్రసాదించింది. ఒకటి కాదు రెండు కాదు సద్గురు స్థితిని కూడా ఇచ్చింది ఆ తల్లి పేరమ్మ గారికి ఇదంతా చూసినటువంటి సుభద్రమ్మ గారు పేరమ్మ గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు అట్లా సుభద్రమ్మ గారు పేరమ్మ తల్లికి మొట్టమొదటి శిష్యురాలుగా మారింది అప్పటి నుంచి అసలు పేరమ్మ గారి పేరు మారుమ్రోగిపోయింది ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకునేవారు వారి ఈతి బాధలు తీర్చుకోవడానికి సంసార బాధల కోసం అని చెప్పి రోగాల కోసం అని చెప్పి ఆర్థిక బాధల నుంచి తప్పించుకోవడానికి ఎంతో మంది వచ్చి పేరమ్మగారిని దర్శించుకునేవారు
(12:42) అంతేకాదు పక్క ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చి తల్లిని పల్లకీలో మోసుకొని మరి తీసుకువెళ్ళేవాడు ఈ తల్లి కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాడు. అన్నదానాలు చేయించేది భక్తులతో తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయించేది. తల్లి పేరు ఈ మండలం దాటి పక్క మండలాలకు కూడా పాగిపోయింది. అక్కడే చిన్న తిరకాసు వచ్చింది ఈ తల్లి వైభవాన్ని చూసి కొంతమంది ఈర్ష పడడం మొదలు పెట్టారు ఏమైందంటే కొంతమందికి వంశ పారంపర్యంగా ఆ బిలం మీద ఆధిపత్యం ఉండేది.
(13:16) ముఖ్యంగా ఆ గ్రామ కారణానికి. ఈ తల్లి యొక్క వైభవాన్ని జీర్ణించుకోలేక ఈ సుభద్రమ్మ గారిని పేరమ్మగారిని గ్రామంలోకి వెడలుగొట్టారు పిల్ల దగ్గర నుంచి పేరమ్మగారు చాలా బాధపడి ధ్యానంలో ముచ్చుకుంద మహర్షిని ప్రార్థించింది. అప్పుడు వారు ప్రత్యక్షమై నువ్వు నిరాహారిగా మూడు రోజులు తపస్సు చెయ్యి నీ కర్మ తొలగిపోతుంది అని చెప్పారు ఆ తల్లి అలాగే చేసింది.
(13:44) ఆశ్చర్యంగా నాలుగో రోజు గ్రామంలోని ప్రజలందరూ ఒక్క తాటి మీదకు వచ్చి ఆ కరణాన్ని ఎదిరించి ఈ సుభద్రమ్మని ఈ పేరమ్మ గారిని తిరిగి మళ్ళీ బిలానికి చేర్చారు. దీని తర్వాత ఆ కరణానికి బుద్ధి రాలేదు సరి కదా ప్రతీక ఆరేచతో రగిలిపోయాడు. పేరమ్మగారు ఉంటున్నటువంటి పాకను తగలబెట్టి ఇచ్చాడు. ఆ తల్లికి ముందుగా తెలిసిందో ఏమో సుభద్రమ్మ గారితో కలిసి ఆ రాత్రి జూలకలు గ్రామానికి అంటే పుట్టింటికి వెళ్ళిపోయారు.
(14:17) ఆ కరణం అక్కడితో ఆగిపోలేదు దాని తర్వాత ఈ తల్లి మీద హైకోర్టులో కేసు వేశడు ఆ కేసుని విచారించాల్సినటువంటి జడ్జి ఇంటి ముందు అరుగు మీదకు ఈ పేరమ్మగారు వెళ్లి అలా ధ్యానంలో కూర్చుని ఉన్నారు. అదే రాత్రి ఆ జడ్జి కల్లో ఒక యోగిని తల్లి దర్శనం ఇచ్చింది. ఎవరా అనుకుని ఇంటి బయటకి రాంగానే ఆ తల్లి ఎదురుగా అరుగు మీద దర్శనం ఇచ్చింది వెళ్లి చేతులు జోడించి తల్లి ఏమైంది అని చెప్పి జడ్జి గారు అడిగితే ఆ పేరమ్మ తల్లి జరిగింది మొత్తం చెప్పింది ఆ తీర్పు పేరమ్మగారికి అనుకూలంగా వచ్చింది అప్పటినుంచి మళ్ళీ ఆ తల్లి ఆ బిలం దగ్గర స్వేచ్ఛగా ఉండడం మొదలు పెట్టింది దీని తర్వాత క్రమంగా భక్తుల సంఖ్య పెరగడం మొదలు
(14:57) పెట్టింది. వారి సహాయంతో పేరమ్మ తల్లి అక్కడ ఎన్నో ఆలయాల్ని కట్టించింది. ఆంజనేయ స్వామి ఆలయం రాజరాజేశ్వరి మాత ఆలయం నాగేంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమంది భక్తుల యొక్క కష్ట నష్టాలను తీర్చేది. అందుకే ఆ తల్లిని నమ్ముకుని ఇప్పటికీ కూడా భక్తులు ఆ తల్లి యొక్క సమాధిని దర్శిస్తూనే ఉన్నారు.
(15:21) సరే ఒకసారి ఒక విచిత్రం జరిగింది. ఈ తల్లి నైవేద్యం తీసుకువెళ్తుంది. అది హటాత్తుగా నేలపాలు అయిపోయింది. చాలా బాధపడిపోయింది పేరమ్మగారు ఏంటి ఇలా జరిగింది ఏమన్నా దోషమా ఇదేమన్నా అప్పుడు ముచ్చుకుంద మహర్షి ప్రత్యక్షమయి నీదే దోషం లేదు ఎక్కడైతే ఆ నైవేద్యం నేలపాలు అయింది అక్కడ తవ్వి చూడు అని చెప్పారు. తవ్వి చూస్తే బంగారం దొరికింది.
(15:46) ఆ బంగారం సహాయంతో ఆ తల్లి అక్కడ ఆశ్రమాన్ని అభివృద్ధి పరిచింది. కొన్ని వంటపాత్రలు కొనుగోలు చేసింది అందుకే మనం ఇప్పటికీ కూడా అక్కడికి వెళితే ఆ వంటపాత్రల మీద ముచ్చుకుంద మహర్షి యొక్క పేరును చూడవచ్చు మనం ఆ తర్వాత ఆ తల్లి కుండల్ని శక్తి సాధనలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ తల్లికి మధ్యాహ్నం 12 గంటలకి రాత్రి 12 గంటలకి విచిత్రమైన ధ్వనులు వినపడేవి.
(16:12) అలా వినపడినప్పుడు బిలంలోకి వెళ్ళిపోయేది అప్పుడు ఆ తల్లికి నాగకన్య సూక్ష్మ రూపంలో ఆ బిలం యొక్క మహత్యాన్ని చెప్పేదిట అదంతా కూడా యోగామృతసారం బిలమహత్యం అనేటువంటి గ్రంథంగా రంధస్థం చేశారు భక్తులు ఇప్పటికి మనం అక్కడికి వెళితే దాన్ని చూసే అవకాశం ఉంది అసలు తల్లి యొక్క రూపం అద్భుతంగా ఉండేది మొత్తం కాషాయం పంచ కాషాయం ఫుల్ షర్టు నడలో కండువ కొప్పు ఆ కొప్పు చుట్టూ పూలు తల్లి అద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోతూ ఉండేది.
(16:51) సరే ఒకరోజు హటాత్తుగా అటువంటి తల్లి భక్తుల్ని పిలిచి ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది అని చెప్పగానే భక్తులు ఏడవడం మొదలు పెట్టారు. అప్పటివరకు కూడా మాతృస్థానంలో ఉండి కనిపెట్టుకున్నటువంటి తల్లి ఆ మాట చెప్పడంతో తట్టుకోలేకపోయారు భక్తులు. ఇట్లా కొన్ని రోజులు గడిచినాయి భార్గశిర బహుళ నవమి డిసెంబర్ 21 1943వ సంవత్సరం మంగళవారం ఆ తల్లి నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఆహార్యంలోనే విలిగిపోతూ దివ్య వర్చస్సుతో పద్మాసనంలో కూర్చుని శ్వాసను బంధించి సజీవ సమాధిని పొందేశారు.
(17:37) ఆ తల్లి సుమారు 1853 ప్రాంతంలో జన్మించింది. అట్లా 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ పేరమ్మగారు సజీవ సమాధి పొందేశారు 1943 లో ఆ తల్లి సజీవ సమాధి చెందబోతూ ఏం చెప్పిందంటే 40 రోజుల తర్వాత ఈ సమాధిని తెరిచి చూడండి. దాని తర్వాత శాశ్వతంగా మూసివేయండి అని చెప్పింది. సరే ఆ తల్లి సజీవ సమాధి పొందేసింది శాస్త్రోక్తంగా అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించేశారు.
(18:06) ఆ సమాధి ఎక్కడ ఉంది అంటే ఈ రాజరాజేశ్వరి ఆలయం పక్కనే ఈ తల్లి యొక్క దివ్య సమాధి ఉంది. సరే ఆ తల్లి చెప్పినట్లే 40 వ రోజున తెరిచి చూశారు. ఆ తల్లిలో జీవకళ అలాగే ఉంది ఆ కొప్పుకి ఉన్న పూలు వడిలిపోలా అలాగే ఉన్నాయి తాజాగా పక్కన అగరవత్తులు గుమాయించి వాసన వస్తున్నాయి. ఆశ్చర్యపోయి అందరూ కూడా పేరమ్మ తల్లికి ప్రదక్షిణాలు చేసి ఆ దివ్య సమాధిని మూసేశారు శాశ్వతంగా.
(18:43) నేను ఇందాక చెప్పాను కదా ఈ తల్లి యొక్క మొదటి శిష్యురాలు సుభద్రమ్మ గారు కొంత కాలానికి ఆ తల్లి కూడా కాలం చేసేసింది. ఆ తల్లి యొక్క సమాధి కూడా ఈ పేరమ్మగారి సమాధి పక్కనే ఉంటుంది మనం వెళ్లి దర్శించుకోవచ్చు ఇప్పటికీ కూడా పేరమ్మ తల్లి తను నమ్ముకున్న భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది. ఇక్కడ ముక్కోటి ఏకాదశికి తొలి ఏకాదశికి అలాగే శివరాత్రికి నేను ఇందాక చెప్పిన ఈ ఆరాధన తిధి పుణ్యతిధి మార్గశీర బహుళనవమికి అద్భుతమైనటువంటి ఉత్సవాలు చేస్తారు.
(19:15) ఎప్పుడైనా పల్నాడు ప్రాంతంలోకి దగ్గరగా వెళితే తప్పకుండా ఈ తల్లి యొక్క దివ్య సమాధిని దర్శించండి. నేను ఆ లొకేషన్ మ్యాప్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను సరేనా. ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ పేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఆ ముచ్చుకుంద మహర్షి యొక్క ఆశీస్సులు అలాగే దత్త స్వామి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు
No comments:
Post a Comment