ఈ ఒక్క Review చదివిన తర్వాత… నా కళ్లలో ఆనందం, మనసులో తృప్తి రెండూ ఒకేసారి వచ్చాయి. ❤️
“బాల్యం అమూల్యం” పుస్తకం రాయడానికి కారణం… ఒక పుస్తకం రాయాలనే కోరిక కాదు.
ప్రతి రోజు కౌన్సిలింగ్‌కి వచ్చే వందలాది తల్లిదండ్రులు…
“సార్… మా పిల్లాడు మాట వినడం లేదు.”
“మా అమ్మాయి చాలా మారిపోయింది.”
“ఒక్కసారి మా పిల్లాడితో మాట్లాడండి సార్.”
అని అడిగేవారు.
అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చేది…
నిజంగా మారాల్సింది పిల్లలా…? లేక మనమా…?
సంవత్సరాలుగా వేలాది కుటుంబాలను దగ్గరగా గమనించిన తర్వాత నేను ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకున్నాను…
చాలా సందర్భాల్లో పిల్లల సమస్య కాదు… పిల్లలను అర్థం చేసుకునే విధానంలో ఉన్న లోపమే అసలు సమస్య.
పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు దాదాపు ఉండరు…
కానీ…
పిల్లల మనసును అర్థం చేసుకునే తల్లిదండ్రులు మాత్రం చాలా తక్కువ.
అందుకే ఈ పుస్తకం పిల్లలను మార్చడానికి రాయలేదు…
ముందుగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారితే… పిల్లల జీవితమే మారుతుంది అనే నమ్మకంతో రాశాను.
ఒక్కో పిల్లాడికి కౌన్సిలింగ్ చేయడం కంటే…
ఒక్కో తల్లిదండ్రికి అవగాహన కల్పిస్తే… వేలాది పిల్లల బాల్యం అందంగా మారుతుంది.
అదే ఈ పుస్తకం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
ఈరోజు Amazonలో వచ్చిన ఈ Review చదివిన తర్వాత…
నేను చెప్పాలనుకున్న ప్రతి భావాన్ని…
ఈ పుస్తకం వెనుక ఉన్న ప్రతి ఉద్దేశ్యాన్ని…
ఇంత లోతుగా అర్థం చేసుకుని, హృదయానికి హత్తుకునేలా రాసిన S. Chiranjeevi Rao గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏❤️
ఒక రచయితకు తన పుస్తకం అమ్ముడవడం ఆనందం ఇస్తుంది…
కానీ…
తన ఆలోచనను ఎవరో ఇంత అందంగా అర్థం చేసుకుని, అది ఇంకెంతో మందికి చెప్పాలనిపించేలా Review రాయడం… అదే రచయితకు దక్కే గొప్ప అవార్డు. 🥹
ఇంకో చిన్న విజ్ఞప్తి…
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే… సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కారం వెతకడం కంటే… సమస్యలే రాకుండా ముందే సిద్ధం కావడం ఎంతో గొప్పది.
ఈ పుస్తకం అదే ప్రయత్నం.
మీరు ఇప్పటికే ఈ పుస్తకం చదివి ఉంటే…
మీ Reviewని Amazonలో తప్పకుండా రాయండి.
ఇలాంటి ప్రతి Feedback…
మరో తల్లిదండ్రిని ఈ పుస్తకం వరకు తీసుకువస్తుంది.
మరో చిన్నారి బాల్యాన్ని అందంగా మార్చే అవకాశం అవుతుంది. ❤️
ఈ పోస్టు కింద కూడా నేను వచ్చిన కొన్ని Reviews షేర్ చేస్తూ ఉంటాను. వాటిని తప్పకుండా చదవండి.
మీ ఇంట్లో ఒక చిన్నారి ఉంటే… “బాల్యం అమూల్యం” ఒక పుస్తకం కాదు… ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చదవాల్సిన బాధ్యత. ❤️📖
Book link 👇
https://amzn.in/d/06tPNRNB
1/3
2/3
3/3
No comments:
Post a Comment