ఈ ఆహారాలను రెండోసారి వేడి చేస్తే విషమే..! | Reheating Food Health Risks | Health Tips | R5 Media
Author Name:R5 Media 🗞
Youtube Channel Url:https://www.youtube.com/@R5Telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0fvEqsMvj7o
Transcript:
(00:00) రీహీటింగ్ ఫుడ్ హెల్త్ రిస్క్స్ ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే ప్రస్తుత కాలంలో చాలామంది బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. దీంతో ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తినడం అలవాటు చేసుకున్నారు. [సంగీతం] అయితే కొన్ని రకాల ఆహారాలను పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
(00:22) ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో విషపూరిత రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు అలా [సంగీతం] చేస్తే ఏం జరుగుతుంది. బంగాళ దుంపలను వండి ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచి మళ్ళీ వేడి చేస్తే బ్యాక్టీరియా [సంగీతం] పెరిగే అవకాశం ఉంటుంది.
(00:43) ముఖ్యంగా సరైన విధంగా నిల్వ చేయకపోతే వాటిలో హానికర సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయి. దీంతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు రావచ్చు. గుడ్లను రెండోసారి వేడి చేయడం కూడా ప్రమాదకరమేనని వైద్యులు చెబుతున్నారు. గుడ్లలో అధికంగా ప్రోటీన్ ఉండడంతో పదే పదే వేడి చేస్తే వాటి నిర్మాణం మారి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.
(01:04) ఎక్కువసేపు బయట ఉంచిన గుడ్లలో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని మళ్ళీ వేడి చేసినప్పుడు నైట్ రేట్లు నైట్ రైట్లుగా మారే అవకాశం ఉంది. ఇవి శరీరంలో హానికర ప్రభావాలు చూపవచ్చని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు వృద్ధులు గర్భిణీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
(01:26) పుట్ట గొడుగులను తాజాగా ఉన్నప్పుడే తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్లు మళ్ళీ వేడి చేసినప్పుడు రసాయన మార్పులకు గురై జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చాలామందికి టీ ని మళ్ళీ వేడి [సంగీతం] చేసి తాగే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కువసేపు ఉంచిన టీ ని తిరిగి వేడి [సంగీతం] చేస్తే దాని రుచి పోషకాలు తగ్గిపోతాయి.
(01:51) అలాగే బ్యాక్టీరియా పెరిగే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా పాలు కలిపిన టీ ని ఎక్కువ సేపు నిల్వ చేయడం మంచిది కాదని నిపుణ్లు సూచిస్తున్నారు. చికెన్ ను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకుండా మళ్ళీ వేడి చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చికెన్ లో ప్రోటీన్లు అధికంగా ఉండడంతో అవి తిరిగి వేడి చేసినప్పుడు రసాయన మార్పులకు గురవుతాయి.
(02:10) సరైన విధంగా వేడి చేయకపోతే బ్యాక్టీరియా పూర్తిగా నశించక ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీయవచ్చు. అన్నం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. వండిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వేడి చేసిన ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన విష పదార్థాలు పూర్తిగా నశించకపోవచ్చు.
(02:31) దీంతో వాంతులు విరోచనాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వాడిన నూనెను పదే పదే వేడి చేయడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులో ప్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికర పదార్థాలు ఏర్పడతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
(02:53) ఆహారాన్ని తాజాగా వండిన వెంటనే తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని తప్పనిసరిగా నిల్వ చేయాల్సి వస్తే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మళ్ళీ వేడి చేసే సమయంలో పూర్తిగా వేడి అయ్యేలా చూసుకోవాలి. అయితే పదేపదే వేడి చేయడం మాత్రం పూర్తిగా నివారించడం మంచిదని నిపుణ్ణి చెబుతున్నారు.
No comments:
Post a Comment