🦚జ్ఞానప్రసూనాలు🚩
1) నాది అంటే అరణ్యవాసం నేను(అహం) అంటే అజ్ఞాతవాసం. అరణ్యవాసాలు.. అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం
2) ఆత్మ గురించి ఎంత మాట్లాడినా అది మనసు గురించే అవుతుంది. కాబట్టి మాటల వలన లాభం లేదు.
3) గిరి గీసి కేంద్రంలో బాణం వేసేవాడు సాధకుడు. బాణం వేసి దాని చుట్టూ గిరి గీసేవాడు సిద్ధుడు.
4) దేవుడు సహస్రాక్షుడు అంటే
దేవుడికి వేయి కళ్లు ఉంటాయని కాదు. కళ్లు అన్నీ ఆయనవే అని అర్ధం.
5) నీ మనసు అనంతంగా ఉండాల. ఆ స్థితిలో దేవాలయం అయినా ఒకటే. శ్మశానం అయినా ఒకటే.
6) ఆత్మ యొక్క అభివ్యక్తమే ప్రపంచం.
అని మనకు తెలపడానికి వచ్చేదే స్వప్నం.
7) సత్సంగం అంటే తనతో తాను గడపడం.
8) ఆశ్రమం లేని ఆశ్రమం అత్యాశ్రమం.
9) అనుభవం అనేది కూడా ఓ తలంపే
10) ఎవరి స్వాభావం, అది వారి ప్రారబ్ధం.
11) మాయ అంటే - దేశము, కాలము
12) నేనే సకల నామరూపములుగా ఉన్నాను.
13) ప్రతి క్షణం నీవు అనుభవిస్తుండేది ఆత్మనే.
14) బహువచనమే లేదు.
15) ఏ అనుభవమూ లేని అనుభవం 'నేను'.
16) శివసాక్షాత్కారం అంటే తాను శివుడే అగుట.
No comments:
Post a Comment