Friday, August 7, 2026

 


నేను చేస్తున్నాను అని కాకుండా 'నా ద్వారా చేయబడుతున్నది' అని చేసే కర్మ నిష్కామ కర్మ.

2) మనుష్యునకు జ్ఞానం కలిగిన పిమ్మట ఈ శరీరంపై లక్ష్యం ఉండదు. ఎంత చక్కని విస్తరికానీ భోజనం చేసిన తరువాత విసరి పారేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయం తరువాత ఎప్పుడు పారవేద్దామా అని చూస్తాడు.

3) మురికిలో పడ్డాడని బిడ్డను ఎవరైనా వదిలేసుకుంటారా? అలాగే మనం ఎలా ఉన్నా భగవంతుడు మనల్ని వదలలేడు.

4) ఈశ్వర నియతిని ఎవ్వరూ దాటలేరు.

నేను ఇలా ఉండాలని మీరు అలా ఉండాలని పరమేశ్వరుని నియమం.

ఇంతకు మించి చెప్పటానికి ఏమీ లేదు.

5) నీ తలను(బుద్ధిని) తీసి ప్రక్కన పెట్టు. అదే శరణాగతి అంటే.

6) నీకు నీవు తటస్థంగా ఉంటే మొత్తానికి తటస్థంగా ఉన్నట్లే.

No comments:

Post a Comment