Today's Junk Food, Tomorrow's Diabetes | Dr Aswani Patchala | Diabetologist | Green Hospital Guntur
Author Name:Green hospital Guntur
Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3wsUyNe-OAk
Transcript:
(00:00) మన చిన్ననాటి అలవాట్లు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తున్నాయో తెలుసా మనం చిన్నప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి ఇది తర్వాత వచ్చే మధుమేహాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని స్వీడెన్ సైంటిస్ట్ లు ఎన్నో స్టడీస్ లో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు. సో చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వ్యాయామం లేకపోవటం ఆటలకు దూరంగా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగి వాళ్ళలో ఫ్యూచర్ లో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కాబట్టి చిన్న వయసు నుంచి
(00:33) పిల్లల్లో మన ఫోకస్ అనేది మూడు విషయాల మీద ఉండాలి. మొదటిగా ఆహారం ఫిజికల్ యాక్టివిటీ మంచి నిద్ర. ఆహారం విషయానికి వస్తే ఈ మధ్య మనం పిల్లల్లో గమనిస్తే ప్యాక్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఆ షుగరీ డ్రింక్స్ ఈ సోడాలు వీటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారండి సో వాటి వల్ల ఏంటంటే క్రానిక్ గా లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల ఫ్యూచర్ లో మెటబాలిక్ డిసీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
(00:58) కాబట్టి మన ఫోకస్ అంతా వేటి మీద ఉంచాలి అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, తృధాన్యాలు వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఒకటి సీడ్స్ అండ్ నట్స్ కూడా వాళ్ళ రొటీన్ డైట్ లో మనం ఇంక్లూడ్ చేయడానికి చూడాలి. ఫిజికల్ యాక్టివిటీ రోజులో గంట సేపు వాళ్ళకి ఆ ఫోన్ టైం టీవీ టైం తగ్గించేసి చక్కగా ఏదైనా పార్క్ కి తీసుకెళ్ళటం ఏదైనా గేమ్ నేర్పించడం వల్ల మంచి ఫిజికల్ యాక్టివిటీ అన్నది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన వాళ్ళం అవుతాము.
(01:22) నిద్ర మంచి నిద్ర వల్ల మెటబాలిక్ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్లకు ఒక స్లీప్ పాటర్న్ స్లీప్ సైకిల్ అనేది మనం అలవాటు చేయాలండి. డయాబెటిస్ లేని ఆరోగ్యమైన సమాజం కోసం మన పిల్లల్లో మంచి అలవాట్లని ఇప్పటినుంచే మనం ప్రోత్సహిద్దాం. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల కోసం మనవళ్ళు మనవరాల కోసం ఎలాంటి మంచి హ్యాబిట్ అలవాటు చేస్తున్నారు అనేది మెసేజ్ లో టైప్ చేయండి సో దట్ అందరం చూసి నేర్చుకుందాం.
(01:50) థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment