పంచ పునీతాలు 5
1. మొదటిది.. *వాక్ శుద్ధి*: వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
2. రెండవది..... *దేహశుద్ధి*: మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
3. మూడవది..... *భాండ శుద్ధి*: శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
4. నాలుగవది.......*కర్మశుద్ధి*: అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
5. ఐదవది..........*మనశ్శుద్ధి*: మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది.
*కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి*...
పవిత్ర కార్యములు చేయువారికి,,
యింద్రియ నిగ్రహవంతులకు,, నియమితాహర నియమములు కలవారికి,, వేదపూజ,,
దైవచింతనగలవారికి,,వారి వారి కుటుంబాచార నియమములు పాటించువారలకూ,
ఆయుష్షు పరిపూర్ణముగా వుండును..
No comments:
Post a Comment